breaking news
yerragondapalem mla
-
కొడుకు ఉద్యోగం కోసం తండ్రి ఆత్మహత్యాయత్నం
డబ్బు తీసుకొని మొండి చేయిచూపిన టీడీపీ నేత యర్రగొండపాలెం: తన కుమారుడి ఉద్యోగం కోసం టీడీపీ నేతకు లంచమిచ్చి మోసపోయిన ఓ తండ్రి ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది. పెద్దదోర్నాల మండలం రామచంద్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నేత మాలపాటి సుబ్బయ్య ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో రాసుకున్న సూసైట్ నోట్ ప్రకారం.. రామచంద్రకోటలో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లో తన కుమారుడు వెంకటరెడ్డికి వాచ్మన్ ఉద్యోగం ఇప్పిస్తానని టీడీపీ నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యుడు అంబటి వీరారెడ్డి రూ. 1 లక్ష తీసుకున్నాడు. వెంకటరెడ్డితో పాటు మరో ముగ్గురిని ఉద్యోగంలో చేర్పించారు. రెండు నెలల తరువాత కూడా వెంకటరెడ్డికి జీతం ఇవ్వలేదు. దీనిపై వీరారెడ్డిని ప్రశ్నించగా.. ఇంకా కొంత డబ్బు ఇవ్వాలని ఆ టీడీపీ నేత కోరాడు. వెంటనే రూ.10 వేలు ఇచ్చాడు. ఆ తరువాత ఆ ఉద్యోగం మరొకరికి ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం గురించి మరో త్రిసభ్య కమిటీ సభ్యుడు డాక్టర్ మన్నె రవీంద్ర దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ విషయం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు దృష్టికి తీసుకొనివెళ్తే తననే కోపగించుకున్నారని ఆ సూసైడ్ నోట్లో సుబ్బయ్య పేర్కొన్నాడు. దీనిపై జరిగిన చర్చల్లో కూడా సరైన సమాధానం రాకపోవడంతో సుబ్బయ్య తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగిఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనకు చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. -
టీడీపీలో చేరిన డేవిడ్ రాజు
విజయవాడ/యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీకి చెందిన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఆదివారం టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరినట్టు డేవిజ్ రాజు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరినట్టు డేవిడ్ రాజు తెలిపారు. యర్రగొండపాలెం అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీయిచ్చారని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. అంతకుముందు టీడీపీలో 24 ఏళ్ల పాటు పనిచేశానని గుర్తుచేశారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని అన్నారు. డేవిడ్ రాజు పార్టీ ఫిరాయించడంపై యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వలాభం కోసమే పార్టీ మారారని ఆరోపించారు. డేవిడ్ రాజు ఫ్లెక్సీలను చించివేసి నిరసన తెలిపారు.