breaking news
Yemeni
-
సినిమా రేంజ్లో.. బస్సు హైజాక్!
ఇంగ్లాండ్‌లోని టెల్ఫోర్డ్లో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడు దాడి చేశాడు. దాడి చేయడమే కాదు.. బస్సును కూడా దొంగిలించాడు. ఆ బస్సును రాంగ్ రూట్లో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.డ్రైవర్ దగ్గరకు వెళ్లిన నిందితుడు.. ఆయన గడ్డం పట్టుకుని లాగాడు. గొడవ వద్దని చెబుతున్నా ఆ వ్యక్తి వినలేదు. తన తలను డ్రైవర్ తలతో ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడి ఘటనను ఓ మహిళ వీడియో తీసింది. అసలు ఏం చేస్తున్నావంటూ అంటూ దుండగుడిని ఆ మహిళ ప్రశ్నిచింది. డ్రైవర్‌పై దాడి చేయొద్దంటూ ఆమె చెబుతున్నా దుండగుడు పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. దీంతో డ్రైవర్.. పోలీసులకు ఫోన్ చేయాలని ఆ మహిళను కోరాడు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు బస్సులోని వస్తువులను కూడా ధ్వంసం చేశాడు.డ్రైవర్ క్యాబిన్‌లోని లైట్లా కనిపించే ఒక వస్తువును తీసి.. దాంతో సిక్కు డ్రైవర్‌పై దాడి చేస్తానని బెదిరించాడు. బస్సును తనకు ఇవ్వాలని డ్రైవర్‌ను పదేపదే కోరాడు. చివరకు డ్రైవర్‌ను బస్సు నుంచి బయటకు తోసి.. తానే డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. బస్సు నడుపుకుంటూ వెళ్లాడు. ఆ బస్సును రాంగ్రూట్లో నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు.వీడియోలో ఓ మహిళ భయంతో ఏడుస్తూ.. ప్రజలను పక్కకు తప్పుకోవాలని పదేపదే కోరుతూ.. ‘ఓ మై గాడ్’ అంటూ అరుస్తున్నట్లు వినిపిస్తుంది. ఘటన జరుగుతున్న సమయంలో ఆమె బస్సు వెనుక పరుగెత్తుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకుని దుండగుడిని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.A Sikh bus driver was assaulted by a man in his 20s. The accused attacked the driver, pulled his beard and forced him out of the bus and hijacked the bus.The incident took place on Court Street, telford near to London. The police have arrested the suspect. #Uk #Telford pic.twitter.com/s9KBZ3BxqA— Ravinder Singh (@ravindraJourno) September 19, 2026ఇదీ చదవండి: బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు -
‘బిచ్చగాడు’ కన్నా పెద్ద హిట్ అవ్వాలి: వినాయక్
‘‘మదర్ సెంటిమెం ట్‌తో వచ్చిన ‘బిచ్చ గాడు’ పెద్ద హిట్ అయింది. ఫాదర్ సెంటిమెంట్‌తో వస్తోన్న ‘యమన్’ ఆ చిత్రం కంటే పెద్ద హిట్ కావాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమన్’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. టీజర్‌ను వినాయక్ రిలీజ్ చేశారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల శివరాత్రికి రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. లైకా ప్రొడక్షన్స్ రాజా, చిత్ర సమర్పకులు మిర్యాల సత్యనారాయణరెడ్డి, పాటల రచయిత భాషశ్రీ, నిర్మాత కాశీ విశ్వనాధ్ పాల్గొన్నారు.


