-
పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు..
తమిళసినిమా: నమ్మకమైన వాడు తోడు కావాలని నటి లక్ష్మీమీనన్ అంటోంది. 15 ఏళ్ల వయసులోనే నటిగా పరిచయమైన ఈ కేరళా కుట్టి కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ను ఆకట్టుకుంది. ఆ తరువాత విశాల్, విజయ్‌సేతుపతి, జయంరవి వంటి స్టార్ హీరోలతో జతకట్టి సక్సెస్ఫుల్ నాయకిగా గుర్తింపు పొందింది. అలా ఎదుగుతున్న సమయంలో చదువు పూర్తి చేయాలంటూ నటనకు గ్యాప్ తీసుకుంది. ఆ నిర్ణయం సినీకెరీర్‌కు నష్టాన్నే కలిగించింది. రీఎంట్రీ అయినా మునుపటి లక్కు రాలేదు. ప్రస్తుతం ప్రభుదేవాతో జంటగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఈ చిత్రం లక్ష్మీమీనన్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. చాలాకాలం మీడియాకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఒక భేటీలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఎలాంటి బదులిచ్చిందో చూద్దాం. నాకు వివాహబంధంపై నమ్మకం లేదు. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని నేను అనుకోను. పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు. నేను చెప్పేది ఇతరులకు అర్థం అవుతుందో, కాదో తెలియదు. నేను మాత్రం తెలివిగానే చెబుతున్నాను. వివాహ జీవితంపై నాకు నమ్మకం లేదు. అందుకే నేను పెళ్లే చేసుకోను. అలాగని నాకు జీవితానికి అండ ఉండరని చెప్పడం లేదు. కచ్చితంగా ఉంటాడు. అందుకు అండ అనే మాటకు బలం, చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగించే వ్యక్తి కావాలి. దాన్ని పెళ్లి అనే మాటల్లో చేర్చడం నాకు ఇష్టం లేదు.అయితే దాన్ని సహజీవనం అని కూడా చెప్పను. మరో విషయం ఏమిటంటే జీవితంలో అనుభవమే ఉత్తమ ఉపాధ్యాయుడు. అయితే నేను పెళ్లి గురించి చెప్పిన విషయాలు అనుభవాలే కారణం అని చెప్పను. దాన్ని ఎలా చెప్పాలో నిజానికి నాకే తెలియదు. -
డాన్స్‌మాస్టర్.. కుంగ్‌ఫూ మాస్టర్
డాన్స్‌మాస్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రభుదేవా ఆ తరువాత ఎలా డాన్సింగ్ కింగ్ అయ్యారో అందరికీ తెలిసిందే. అనంతరం కథానాయకుడిగా.. ఆపై దర్శకుడు, నిర్మాత అంటూ అనూహ్యగా ఎదిగిపోయిన విధంబు ఎరిగినతదే. ఒక దశలో బాలీవుడ్లో దర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి దేవి చిత్రంతో సూపర్సక్సెస్ను అందుకున్నారు. ఆ తరువాత నటిస్తున్న చిత్రం యంగ్ మంగ్ ఛంగ్. బాలాజీధరణీధరన్ దర్శకత్వంలో కాళిదాస్ జయరాం హీరోగా ఒరు పక్కకథై చిత్రాన్ని నిర్మించిన వాసన్ విజువల్స్ వేంచర్స్ సంస్థ అధినేతలు కేఎస్. శ్రీనివాసన్, కేఎస్. శివరామ్‌లు త్వరలో ఈ చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సంతానం కథానాయకుడిగా ఓడి ఓడి ఉళక్కనుమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిరా దస్తూరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ప్రభుదేవా కథానాయకుడిగా యంగ్ మంగ్ ఛంగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు తంగర్‌బచ్చన్, ఆర్జే.బాలాజీ, చిత్రాలక్ష్మణన్, కే.రాజన్, బాహుబలి ప్రభాకర్, కుంకీ అశ్విన్, నాగేంద్రప్రసాద్, మునీష్కాంత్, కాళీవెంకట్, మారి ముత్తు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రిష్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా నిజ జీవితంలో డాన్స్‌మాస్టర్ అయిన ప్రభుదేవా ఈ యంగ్ మంగ్ ఛంగ్ చిత్రంలో కుంగ్‌ఫూ మాస్టర్‌గా అదరగొట్టనున్నారట. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement