breaking news
www.virus.com
-
వైరస్‌లా మారిన సంపూ
హృదయకాలేయం సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్ టాప్ స్టార్లకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సోషల్ మీడియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ బర్నింగ్ స్టార్, ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కూడా స్పెషల్ క్యారెక్టర్లు చేస్తూ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. స్పెషల్ క్యారెక్టర్లతో పాటు హీరోగానూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే కొబ్బరి మట్ట సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంపూర్ణేష్ బాబు, మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైరస్.కామ్ పేరుతో ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్‌ను రెడీ చేస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. సిహెచ్ రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గీతాషా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హృదయకాలేయం సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సంపూ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
వైరస్
తొలి సినిమా ‘హృదయ కాలేయం’తో ఓ విభిన్నమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సంపూర్ణేష్‌బాబు www.virus.com పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. సీహెచ్ శివరామకృష్ణ దర్శకత్వంలో సలీం, ఏజే రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని విజయదశమికి మొదలు పెడతామని, డిసెంబర్లో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు: తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వీజే.