-
మాకు బతకాలని ఉండదా!.. కనపడితే ఖతం చేస్తున్నారు
సాక్షి ,భామిని(పార్వతిపురం మన్యం): సరీసృపాల్లో సర్పజాతిపై అవగాహన లోపంతో అవి అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. హైందవ సంప్రదాయంలో పవిత్ర స్థానం గల సర్పాలకు పూజలు, నోములు చేస్తున్న చోటే అవగాహన లోపంతో వాటిని అంతం చేసే సంస్కృతి సాగుతోంది. దెబ్బ తిన్న పాము పగ పడుతుందనే అభూత కల్పన, పాము కాటు వేస్తే విష ప్రభావంతో మరణిస్తామనే భయంతో వాటిని హతమారుస్తున్నారు. గ్రామస్తుల చేతిలో హతమైన భారీ కొండచిలువ పంట కాపాడే పాములు రైతు పండించే పంటలో నలభై శాతం స్వాహా చేస్తున్న ఎలు కలు, పందికొక్కుల నివారణ లో కీలక పాత్ర ధారి పాముకు మనుగడ కష్టమైపోతోంది. పర్యావరణ పరిరక్షణలో కీలకంగా, భూ సారాన్ని కాపాడే ముఖ్యమైన జీవిగా గుర్తింపు పొందినా వాటికి తగిన రక్షణ కరువవుతోందని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిమి సంహారక మందుల ప్రభావం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వినియోగించే క్రిమి సంహారక మందుల ప్రభావం, ఆదునిక యంత్రాల వాడకంలో పుట్టలు, తుప్పలు, దిబ్బలు లేకుండా, భూమిలో బొరియలు లేకుండా చేయడంతో పాముల సంచారం కష్టమైంది. విష సర్పాలు తక్కువ.. మన చుట్టూ తిరుగుతున్న పాములలో 80 శాతం విషంలేని సాధారణ సర్పాలే ఉన్నాయి. విçషపూరితమైనవి, ప్రాణాంతకం కలిగించేవి కొద్దిగానే ఉన్నాయి. నాలుగు రకాలైన తాచుపాము(నాగుపాము),రక్తపింజర,కట్లపాము, పొడపాములను విషసర్పా లుగా గుర్తించారు. పాము కాటుకు గురైన వ్యక్తుల్లో అత్యధికంగా భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాములపై అవగాహన అవసరం విద్యార్థి స్థాయి నుంచి పాములపై అవగాహన కల్పించాలి. అన్ని పాములు ప్రమాదరం కావని తెలియజేయాలి. పాము పగ పడుతుందనే మూఢ నమ్మకాలు విడిచి పెట్టేలా చైతన్యం కల్పించాలి. స్నేక్స్ ఫ్రెండ్లీ సొసైటీలు ఏర్పాటు కావాలి. అన్ని పాములను హరించడం తగదు. కొట్టి చంపకుండా, పట్టి దూరంగా విడిచిపెట్టాలి. అవి అంతరించకుండా చూడాలి. పాములన్నీ విషసర్పాలు కావు పాములన్నీ విషసర్పాలు కావు. అన్ని పాములకు విషం ఉండదు. పాము కాటు వేస్తే చనిపోతామనే భయం వీడాలి. ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైనా భయపడవద్దు. అందుబాటులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురండి. విషాన్ని నివారించే ఏంటీస్నేక్ వీనమ్(ఏఎస్వీ) మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు పడిన తరువాత గాయాన్ని కడగవద్దు. పాము వేసిన గాట్లు గుర్తించి విషప్రభావం లెక్కించి ఏఎస్‌వీలు వేస్తాం. – డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు,డిప్యూటీ డీఎంహెచ్ఓ,సీతంపేట పాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సర్ప జాతుల సంరక్షణకు స్నేక్ రెస్క్యూ టీం తరలి వస్తుంది. ప్రాణాపాయం లేకుండా పట్టుకుని అడవుల్లో విడిచి పెడతాం.అటవీశాఖాధికారుల సహకారంతో గ్రీన్ మెర్సీ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది.సర్పజాతులను చంపవద్దు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది.హెల్ప్‌లైన్ నంబర్ 9848414658కు తెలియ పర్చండి. పాములను చంపడం చట్టరీత్యానేరం.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు కఠిన శిక్షలు తప్పవు. – కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ వన్యప్రాణ సంరక్షణ గస్తీ బృందం చదవండి: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల వెనుక షాకింగ్ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ ప్లాన్! -
సర్ప సంరక్షకుడు క్రాంతి..
సాక్షి,జంగారెడ్డిగూడెం : పాము కనిపిస్తే మనకు ఒళ్లు జలదరిస్తుంది. వెంటనే ఆమడ దూరం పారిపోతాం. కానీ ఆ యువకుడు మాత్రం పాము కనిపిస్తే చాలు దాన్ని ఎంతో సులువుగా పట్టుకుని ప్రజల నుంచి హాని కలగకుండా సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతాడు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి కుమార్‌ను అందరూ ఆ ప్రాంతంలో పాముల సంరక్షకుడిగా పిలుస్తారు. ఏటా జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజుని పురస్కరించుకుని స్నేక్ సేవియర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి గురించి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే ఆసక్తి డిగ్రీ వరకు చదివిన క్రాంతి చిన్నప్పటి నుంచి వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదనే ఆలోచనతో పెరిగాడు. ఎవరైనా వాటికి హాని కలిగిస్తే వారికి అవగాహన కల్పించేవాడు. చాలామంది పాములను చంపడం చూసి వాటిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. వాటిని సురక్షితంగా పట్టుకోవడంలో శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం విశాఖపట్నంలో ఉన్న స్నేక్ సేవియర్ సొసైటీలో పాములపై రీసెర్చ్ మొదలుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే పాములను సురక్షితంగా పట్టుకోవడంలో పేరుగాంచాడు. అనేక గ్రామాల్లో పర్యటించి పాముల్ని చంపకుండా ఎలా వాటి నుంచి రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతవరకు జనావాసాలు, ఇళ్ల మధ్యకు వచ్చిన 10,900 పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. పశ్చిమగోదావరి జిల్లాలో అనేక మండలాల్లో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాము కనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేది క్రాంతి పేరే. 83869 84869, 80998 55153 నెంబర్లకు ఫోన్ చేయగానే ఆ ప్రాంతానికి వెళ్లి పామును పట్టుకుని సురక్షితంగా విడిచిపెడుతుంటాడు. పాములతో పర్యావరణానికి మేలు మొట్టమొదటి సారిగా కెనడాలో ప్రపంచ పాముల దినోత్సవాన్ని నిర్వహించారు. పాములనేవి పర్యావరణానికి మంచి చేస్తాయని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 3,458 సర్పజాతులు ఉండగా.. వీటిలో కింగ్ కోబ్రా, తాచుపాము, పొడపాము, కట్లపాము, రక్తపింజర విషపూరితమైనవి. – చదలవాడ క్రాంతికుమార్, పేరంపేట -
సిగ్గెక్కువ.. కానీ, కాటేస్తే వందమంది ఖతం!
ఈ భూమ్మీద సమస్త జీవరాశుల్లో సర్పాలు ఉన్నాయి. కానీ, మనుషుల భయాలు, అపోహలతో వాటి జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది ఎంతవరకు సరైందన్నది పక్కనపెడితే.. చాలామందిలో చెడును చెప్పడానికి ‘పాములాంటోడు’ అని వర్ణిస్తుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావు. ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే విషపూరితమైనవని సైంటిస్టులు ఇప్పటిదాకా(జులై 7 రిపోర్ట్ ప్రకారం) గుర్తించారు. అందులోనూ 200 జాతుల(10 శాతం) పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ, అవేం పట్టించుకోకుండా కనిపిస్తే చంపేస్తూ.. వాటి జనాభాను తగ్గించేస్తున్నారు. అందుకే వాటి పరిరక్షణ కోసం, పాములన్నీ ప్రమాదకరమైనవి కాదని జనాల్లో అవగాహన కల్పించాలని.. అందుకోసం ఓ రోజు ఉండాలని జులై 16న వరల్డ్ స్నేక్ డే ను నిర్వహిస్తున్నారు కొందరు(స్నేక్ సొసైటీలు). ప్రతీ ఏడాది ఇదే థీమ్‌తో ముందుకు సాగుతున్నారు. వాసన కోసం నాలిక పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. చెవుల్లేకున్నా వినికిడి శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. పాము కింది దడవలో ఉన్న ఎముకలు శబ్దతరంగాలను పసిగడతాయి. కానీ, వాసన విషయంలో మాత్రం గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి నాలుకతోనే వాసనను పసిగడతాయి. అందుకే ఎప్పుడూ అవి నాలికను అలా బయటకు ఆడిస్తుంటాయి. అత్యంత విషపూరితమైనవి విషానికి ప్రాథమిక కొలమానం ఎల్డీ 50. లెథాల్ డోస్ 50 పర్సంట్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. ఈ పద్దతిలో పాముల విషాన్ని పరిశీలించే.. అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాముల జాబితాను సిద్ధం చేస్తుంది ఇంటర్నేషనల్ స్నేక్ సొసైటీ. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్.. ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము జాతి. దీని విషం నిమిషాల్లో మనిషిలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. కిడ్నీలను పాడు చేస్తుంది. ఒక్కోసారి మెదడుకు చేరి పక్షవాతాన్ని కలగజేస్తుంది. చివరికి రక్తం గడ్డకట్టేలా చేసి మనిషి ప్రాణం తీస్తుంది. టైగర్ స్నేక్ ఎలాపిడ్ జాతికి చెందిన టైగర్ స్నేక్ పాములు కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఒంటిపై ఉండే మచ్చల కారణంగా వాటికి టైగర్ స్నేక్ అనే పేరొచ్చింది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అరగంటలో మనిషి మరణానికి కారణం అవుతుంటాయి. టైగర్స్నేక్స్ విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. కండరాల్లో రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కోబ్రా తరహాలో పడగ విప్పి.. భయపెడుతుంది. ఇన్‌ల్యాండ్ టైపాన్ ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన పాము ఇది(అనధికారికంగా). వంద గ్రాముల విషంతో వంద మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పాము ఇది. వంద గ్రాముల విషాన్ని ఒకే కాటుతో దింపగలదు ఇది. కానీ, ఎల్డీ50 ప్రకారం(త్వరగా ప్రాణం తీసే లెక్కప్రకారం).. లిస్ట్ వల్ల మూడో ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషం ప్రభావంతో గంటలో ప్రాణం పోవడం ఖాయం. ఇవి జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా బతుకుతాయి. ఈ పాముకి ‘సిగ్గు’ ఎక్కువ అని అంటుంటారు. మనుషులను చూస్తే.. ఇవి వేగంగా పాక్కుంటూ వెళ్లి ఓ మూల దాక్కుంటాయి. అలా ఈ డేంజర్ స్నేక్కు ‘సిగ్గున్న పాము’గా ముద్దు పేరు వచ్చింది. రస్సెల్స్ వైపర్ ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతిగా పేరుంది రస్సెల్స్ వైపర్‌కి. అంతేకాదు ఎక్కువ మరణాలకు కారణమైన జాతి కూడా ఇదే. దీనిని గుర్తించడం కూడా చాలా తేలిక. భయంతో ఉన్నప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తుంటుంది. కాటు వేసిన మరుక్షణం నుంచే విషం శరీరంలోకి ఎక్కేస్తుంటుంది. ఒక్క రస్సెల్స్ వైపర్ గక్కే విషంతో లక్షా యాభై వేల ఎలుకలను చంపొచ్చనేది సైంటిస్టుల మాట. బ్లూ క్రాయిట్ ఆసియాలో ప్రమాదకరమైన పాముల్లో దీని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని విషయం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. చికిత్స అందినా సగం మంది చనిపోతుంటారు. అంత ప్రమాదకరమైంది ఈ పాము విషం. ఇవి విషపూరితమైన పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. జనసంచారానికి దూరంగా పగటి పూట పచ్చిక బయళ్లలో, అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి ఇవి. బూమ్స్లాంగ్ క్లౌబ్రిడ్ కుటుంబంలో అత్యంత విషపూరితమైన పాము జాతి ఇది. రంగు రంగుల్లో ఉంటాయి ఇవి. విషం అంత విషపూరితమైనది కాకపోయినా.. రక్తస్రావం కారణంగా ప్రాణం పోతుంటుంది. అందుకే ప్రమాదకరమైన పాముల లిస్ట్‌లో చేర్చారు. అయితే ఇవి మనుషులు కనిపిస్తే.. దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇవి దాడులు చేసే సందర్భాలు చాలా తక్కువ. చెట్ల మీద ఉంటూ పక్షుల్ని, పురుగులని తింటాయి. మోజావే రాటెల్స్నేక్ అమెరికా నుంచి పాము జాతుల్లో అత్యంత విషపూరితమైన లిస్ట్‌లో ఫస్ట్ కనిపించేది ఇదే. రక్తం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది దీని విషం. నైరుతి అమెరికా పప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించేది ఈ పాముల వల్లే. స్టిలెట్టో స్నేక్ పరిణామంలో చిన్నగా ఉండి, కలుగుల్లో దాక్కునే పాము ఇది. కానీ, విషపూరితమైంది. అయితే అదృషవశాత్తూ ఇది ఎక్కువ విషాన్ని కక్కదు. కానీ, దీని విషం ఎంత ప్రమాదకరమంటే.. కణజాలాన్ని దెబ్బ తీయడంతో పాటు గుండె పనితీరును స్తంభింపజేస్తుంది. అంతేకాదు వీటిని పట్టడం కూడా అంత ఈజీ కాదు. కోరలు కూడా విచిత్రంగా వంగి ఉంటాయి. కాబట్టి, నేరుగా కాకుండా వంగి మరీ కాటు వేస్తుంది స్టిలెట్టో. సా స్కేల్డ్ వైపర్ ఇది అంత విషపూరితమైన పాము కాదు. కానీ, ప్రమాదకరమైన జాతిలో ఒకటి. భారత్ తో సహా చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. చిన్నసైజులో ఉన్నప్పటికీ అగ్రెసివ్‌గా ఇవి దాడులు చేస్తాయి. వైపర్ జాతి పాముల్లాగే రక్తం గడ్డకట్టించి చంపుతాయి. అయితే విరుగుడు వెంటనే ఇవ్వకపోతే బతకడం కష్టం. ఇసుకలో దాక్కుని వేటాడుతుంటాయి. ఒకవేళ దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తే.. గట్టిగా శబ్ధం చేస్తూ భయపెడుతుంటాయి. కింగ్ కోబ్రా విషానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ జాతి. అత్యంత పొడవైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. పైన చెప్పుకున్నంత రేంజ్లో వీటిలో విషం లేకపోయినా.. ఎక్కువ పరిమాణంలో విషం చిమ్మడం, కాటు వేయడంతో పాటు రూపంతోనే భయపెట్టేస్తుంటాయివి. ఇక ఆడ పాము గూడుకట్టి గుడ్లు పెట్టాక.. మగపాముతో కలిసి కాపలా కాస్తుంటుంది. వీటితో పాటు కోస్టల్ టైపాన్, బాండెడ్ క్రాయిట్, కామన్ డెత్ ఆడర్, సముద్రంలో ఉండే బీక్డ్ సీ స్నేక్, ఆఫ్రికన్ డేంజరస్ స్నేక్ జాతి ‘బ్లాక్ మాంబా’, చైనీస్ కోపర్హెడ్, సౌత్ అమెరికన బుష్‌మాస్టర్, ఫర్ డె డాన్స్, బెల్చర్స్ సీ స్నేక్, బ్లూ మలయన్ కోరల్ స్నేక్.. ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. ఇక వీటితో పాటు విషం లేని బుక్స్నేక్(నార్త్ అమెరికా, అమెరికా), కొండ చిలువ జాతికి చెందిన పాములు, జెనస్ యూనెక్టస్కు చెందిన వాటర్ బోస్(అనకొండ) కూడా ఈ భూమ్మీద ఉన్నాయి. అదృష్టం అంటే దీనిదే.. చాలాకాలం కిందట వైరల్ అయిన వీడియో ఇది How could we dedicate #WorldSnakeDay to anything else? 🐍#PlanetEarth2 pic.twitter.com/B4YxSxqmvm — BBC Earth (@BBCEarth) July 16, 2018 "I'm asking you to respect these creatures, because they have a right to be on Earth, the same way we do." We know many of you may be scared of snakes but it's #WorldSnakeDay, so we asked the 'Snake Man of Lagos' - Dr Mark Ofua - why it's so important we protect them. 🐍 pic.twitter.com/DgWc12NvoS — BBC News Africa (@BBCAfrica) July 16, 2019
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement