breaking news
wonderkid
-
Wonder Kids ఏడేళ్లకే ఆపరేషన్ చేశాడు!
1993లో హిమాచల్ ప్రదేశ్‌లోని నూర్పూర్లో జన్మించిన ఆక్రిట్ ప్రణ్ జస్వాల్, చిన్న వయసులోనే అసాధారణ తెలివి చూపించాడు. 10 నెలలకే నడవడం, మాట్లాడడం మొదలుపెట్టాడు; రెండేళ్లకు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. ఐదేళ్ల వయసులో షేక్స్పియర్, శాస్త్రీయ పుస్తకాలు చదివాడు. ఏడేళ్ల వయసున్నప్పుడు, అతను తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక చేతిపై శస్త్రచికిత్స చేసి, కాలిన గాయం వల్ల అతుక్కుపోయిన వేళ్లను విడదీసాడు. ఒక గంటపాటు జరిగిన ఆపరేషన్ విజయవంతమై, అతన్ని ‘‘ప్రపంచంలోనే అతి చిన్న సర్జన్’’గా చేసింది. ఆ సర్జరీ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది. 2007లో ఓ ప్రా విన్ ఫ్రే షోలో ‘‘లిటిల్ జీనియస్’’గా కనిపించాడు ఆక్రిట్. 12 ఏళ్లలో చండీగఢ్ యూనివర్సిటీలో సైన్స్ డిగ్రీ, 17 ఏళ్లలో కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాడు. క్యాన్సర్ రోగుల బాధలు చూసి, చిన్నప్పటి నుండి క్యాన్సర్ నివారణ కనుగొనాలని కలలు కన్నాడు. ఓరల్ జీన్ థెరపీపై పరిశోధన చేస్తూ, ఆక్రిట్ సైన్స్ ద్వారా ప్రపంచాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇంతటి మేధోశక్తి కలిగిన ఆక్రిట్ ఐక్యూ 146. నాలుగేళ్ల వయసు.. రికార్డుల్లో అదుర్స్నాలుగేళ్ల పిల్లలు అల్లరితో, ఆటలతో కాలం గడుపుతారు. అయితే జమ్మూ కశ్మీర్ రాష్ట్రం గంగ్యల్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల సిద్ధార్థ్ మాత్రం రికార్డులతో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. అంత చిన్న వయసులో అతను సాధించిన రికార్డులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సిద్ధార్థ్ తల్లిదండ్రులు శివ్ జ్యోతి పాండే, శ్వేత పాండే వైద్యులు. చిన్నప్పటి నుంచి పిల్లాడికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ పెంచారు. దీంతో రెండేళ్ల వయసుకే ఇంగ్లిష్ అక్షరాలన్నీ నేర్చేసుకున్న సిద్ధార్థ్ 12 సెకండ్లలో వాటిని అప్పజెప్పి ‘అతి చిన్న వయసులో, అత్యంత తొందరగా ఇంగ్లీషు అక్షరమాల అప్పజెప్పిన వ్యక్తి’గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. మూడేళ్ల వయసులో భారత జాతీయ చిహ్నాలు, వివిధ రకాల కరెన్సీ నోట్లను గుర్తించి మరోసారి రికార్డు సాధించాడు. ఆ వయసులోనే ఎన్నో పద్యాలు, సంస్కృత శ్లోకాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇతర దేశాల పేర్లు, వాటి జెండాలు, కరెన్సీ వంటి అంశాలను సైతం మూడేళ్లకే గుర్తించడం మొదలుపెట్టాడు. ఎన్నో మున్ముందు మరెన్నో రికార్డులు నెలకొల్పాలని సిద్ధార్థ్ ఉవ్విళ్లూరుతున్నాడు. -
రికార్డుల రాణి.. రెండేళ్ల ఖుషీ
మంచిర్యాల టౌన్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఈ వండర్ కిడ్ వయసు రెండేళ్లు. అయితేనేం తన అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భాషల్లో శ్లోకాలు, పద్యాలు, ఆండ్రాయిడ్ ఫోన్లో పజిల్స్ పరిష్కరించడం, బొమ్మలను జత చేయడం, వివిధ రకాల జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, రంగులను గుర్తించడం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో అంకెలను గుర్తించడం, జంతువుల అరుపులు చెప్పడం, వివిధ రకాల వాహనాలు, వంట సామగ్రి, జామెట్రీ వస్తువులు, శరీర భాగాలను గుర్తించడం, నవ్వడం, ఏడవడంతోపాటు అనుకరించడం వంటి వాటిలో ఖుషీ విశేష ప్రతిభను చాటుతోంది. సానా గిరీశ్‌కుమార్, సుధతి దంపతుల కూతురు ఖుషీ(2) తన అసాధారణ ప్రతిభతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థల నుంచి చైల్డ్ ప్రోడ్జి బిరుదు అందుకుంది. ఆదివారం మంచిర్యాలలో ఖుషీ రికార్డులను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ భారత సమన్వయకర్త బింగి నరేందర్‌గౌడ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయకర్త జి.స్వర్ణశ్రీ పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఖుషీకి రికార్డులు ప్రకటించారు. రికార్డుల బ్యాడ్జిలు, పతకాలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.