breaking news
women blackmailing
-
శృంగార వీడియోలతో వలపు వల
సాక్షి, కొత్తగూడెం/పాల్వంచ : పట్టణంలోని టీచర్స్‌కు కాలనీకి చెందిన ఓ మహిళ ఆర్థికంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని, వారిని శారీరకంగా లొంగదీసుకుని, రహస్యంగా వీడియోలు తీసి భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేస్తోంది. ఇటీవల శాస్త్రిరోడ్‌కు చెందిన ఓ బడా వ్యాపారిని ఇదే తరహాలో లొంగదీసుకుంది. ఇద్దరు చాటుమాటుగా కలిసిన వీడియో తన వద్ద ఉందని, అందుకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగింది. పాల్వంచ, ఇల్లెందు పట్టణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం రాయబారం నడపడం గమనార్హం. దీంతో సదరు వ్యాపారి అంతమొత్తం ఇచ్చుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారితో డబ్బులు కొంత మొత్తం ఇస్తామని రప్పించి మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. (విలాసాల లేడీ.. రూ.4కోట్ల మోసం) అనంతరం ఆమె ఫోన్ డాటా, ఫోన్లో ఉన్న చిత్రాలను పరిశీలించగా.. మరికొందరు కూడా ఈ ఊబిలో చిక్కుకున్నారనే విషయం వెలుగు చూసినట్లు సమాచారం. కేటీపీఎస్ డీఈ స్థాయి అధికారి, మరో ఫోర్‌మెన్, భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి కూడా వలపు వలలో పడ్డట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది ఉన్నారు. ఏ స్థాయిలో డబ్బులు కాజేశారనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు ఓ అంగన్ వాడీ సెంటర్‌కు చెందిన మహిళ సహకారం కూడా ఉన్నట్లు సమాచారం. -
న్యూడ్ ఫోటోలతో మహిళ బ్లాక్ మెయిల్
హైదరబాద్ : న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.... హాస్టల్లో ఉన్న రూమ్మేట్లను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి వాటిని తను పనిచేసే యజమానికి వాట్సప్‌లో పంపిన యువతితో పాటు ఆమెకు సహకరించిన వారిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలోని ఓ లేడీస్ డీలక్స్ హాస్టల్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. విజయ అనే మహిళ ఒక ప్రయివేటు కంపెనీలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటోంది. ఆమె గత కొంత కాలంగా తన రూమ్మేట్లను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీయడంతోపాటు వాటిని తాను పనిచేస్తున్న కంపెనీ యజమాని శివయ్యకు వాట్సప్‌లో పంపించింది. ఆ తర్వాత ఆ యువతులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో బాధితులు.. విజయపై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సైబర్ పోలీసులకు అప్పగించారు. వారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.