breaking news
woman request
-
అశ్లీల వెబ్సైట్లు ఆపండి
సుప్రీం కోర్టుకు ఓ మహిళ అభ్యర్థన న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న పోర్న్ (అశ్లీల) వీడియోలను తొలగించాలంటూ ఓ మహిళ సుప్రీం కోర్టుకు విన్నవించింది. తన భర్త బాగా చదువుకున్నప్పటికీ.. పోర్న్ వీడియోలు, చిత్రాలకు బానిసగా మారటంతో వైవాహిక జీవితంలో, కుటుంబలో ఇబ్బందులు ఏర్పడ్డాయని ఓ మహిళ (కెమికల్ ఇంజనీర్) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోలుండే సైట్లను పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ బాధిత మహిళకు పెళ్లై 32 ఏళ్లు పూర్తవగా.. ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా తన భర్త ఇలాంటి వీడియోలకు అలవాటు పడ్డారని.. విలువైన సమయాన్ని ఇలాంటి వీడియోలు చూసేందుకు వ్యర్థం చేస్తున్నారని ఆవేదనగా కోర్టుకు వెల్లడించారు. ‘నా భర్త అశ్లీల వీడియోలు, చిత్రాలకు అలవాటు పడ్డారు. దీంతో ఆయన ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. దీంతో మా వైవాహిక జీవితం నాశనమైంది. అందరికీ అందుబాటులో ఉంటున్న ఈ వీడియోలు చాలా ప్రమాదకరం. భారతదేశంలోని కుటుంబ విలువలకు ఈ సైట్లు తీరని నష్టం కలగజేస్తున్నాయి. యువత దీనివల్ల ఎంతలా చెడిపోతున్నారో ఆలోచించాలి. వయసుకు అతీతంగా చాలా మంది ఈ సైట్లకు బానిసలు అవుతున్నారు’ అని ఆ మహిళ పిటిష¯ŒSలో పేర్కొన్నారు. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి... ప్లీజ్
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమెకు న్యాయం జరగకపోగా.. యువకుడి బంధువులు ఆమెపై దాడికి తెగబడ్డారు. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం లక్కవరానికి చెందిన రుద్ర సత్యనారాయణ మూర్తి ధాన్యం కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం కోసం రామేశ్వరానికి చెందిన అడబాల జ్యోతి తండ్రి వద్దకు అతడు వచ్చేవాడు. ఈ క్రమంలో సత్యనారాయణమూర్తి, జ్యోతి మధ్య పరిచయం ప్రేమగా మారింది. 2011 డిసెంబర్ నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు జ్యోతిని వంచించాడు. పెళ్లి చేసుకోమని ఆమె నిలదీయగా.. తన తల్లిదండ్రులు ఒప్పుకోవాలని బదులిచ్చాడు. ఈ విషయాన్ని ఆమె తన పెద్దలకు చెప్పింది. రూ.5 లక్షలు కట్నంగా ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటామని యువకుడి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో అంగీకరించారు. ఆమె తండ్రి అప్పు చేసి, కట్నం సొమ్ము సిద్ధం చేయగా, సత్యనారాయణ మూర్తి ముఖం చాటేశాడు. ఐదు నెలలుగా పెద్దల వద్దకు తిరిగినా ఫలితం లేకపోవడంతో.. ఆమె రెండు నెలల క్రితం సఖినేటిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతడు ఉండే గ్రామం తమ పరిధిలోనిది కాదని చెప్పడంతో, మలికిపురం పోలీసులను ఆశ్ర యించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నెల ఏడో తేదీన పెద్దలతో కలిసి సత్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్లిన బాధితురాలిపై అతడి బంధువులు దాడి చేసి గాయపరిచారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితురాలితో పాటు ఆమె తల్లి నాగవేణి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మలికిపురం ఎస్సై ఎస్కే సాదిఖ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.