-
టీడీపీ నేత పడాల కన్నా కేసులో కీలక మలుపు
విజయవాడ : కృష్ణాజిల్లా అర్బన్ టీడీపీ కార్యదర్శి పడాల కన్నా కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నా భార్య కళ్యాణి తమిళనాడులోని కన్యాకుమారిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పడాల కన్నా మరణానంతరం కుమారుడు, స్నేహితుడితో కలిసి కళ్యాణి అదృశ్యమైంది. గత నెలాఖరులో పడాల కన్నా అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె మంగళవారం లేఖ పంపినట్లు సమాచారం. కళ్యాణి లేఖ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందం తమిళనాడుకు బయల్దేరింది. మరోవైపు కన్యాకుమారిలోని లాడ్జిలో ఓ మహిళ సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో అక్కడ లభ్యమైన ప్రాథమిక ఆధారాలతో ఆత్మహత్యకు పాల్పడింది కళ్యాణిగా స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వాళ్లు ...విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. -
ప్రముఖ దర్శకుడు భాస్కరరావు కన్నుమూత
ప్రముఖ సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు(78) శనివారం రాత్రి హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య కల్యాణితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ ఆయన స్వస్థలం. అక్కడే 8వ తరగతి వరకూ చదివిన భాస్కరరావుకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే 1959లో ఆయన మద్రాస్ చేరుకున్నారు. మేటి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, తాపీ చాణక్య, వి.మధుసూదనరావు, భీమ్‌సింగ్ దగ్గర సహాయకునిగా దాదాపు 40 చిత్రాలకు పనిచేశారు. దర్శకునిగా భాస్కరరావు తొలి చిత్రం ‘మనుషులు మట్టి బొమ్మలు’. కృష్ణ, జమున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా ఉత్తమ కథారచయితగా నంది అవార్డును కూడా అందుకున్నారు భాస్కరరావు. ఇక అప్పట్నుంచీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు తదితర అగ్ర నటులతో 18 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా మోహన్‌బాబు తొలి చిత్రం ‘గృహప్రవేశం’కి భాస్కరరావే దర్శకుడు. ఆ సినిమా విజయంతో నిర్మాతగా మోహన్‌బాబు కెరీర్‌కి బలమైన పునాది ఏర్పడింది. కృష్ణంరాజు కథానాయకునిగా భాస్కరరావు రూపొందించిన ‘ధర్మాత్ముడు’ చిత్రమైతే... అప్పట్లో ఆల్‌టైమ్ హిట్. మురళీమోహన్, జయసుధలతో ఆయన తెరకెక్కించిన ‘కల్యాణ తిలకం’ చిత్రం మహిళామణుల నీరాజనాలు అందుకుంది. ఇంకా భారతంలో శంఖారావం, రాధా మై డార్లింగ్, చల్మోహనరంగా, శ్రీవారు, గృహలక్ష్మి, ఆస్తులు అంతస్తులు, శ్రీరామచంద్రుడు, సక్కనోడు, చదరంగం, ఉమ్మడిమొగుడు, మామాకోడలు... ఇలా చెప్పుకోదగ్గ ఎన్నో చిత్రాలు రూపొందించారు భాస్కరరావు. కెరీర్లో ఎక్కువ సినిమాలో కృష్ణంరాజు, జయసుధలతోనే చేశారాయన. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన భాస్కరరావు... 1995 నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశాన వాటికలో భాస్కరరావు అంత్యక్రియలు నేటి ఉదయం జరుగుతాయి. నా గురువుని కోల్పోయా: దర్శకుడు ఎన్. శంకర్ సహాయ దర్శకునిగా నా కెరీర్ ఆరంభమైంది భాస్కరరావుగారి దగ్గరే. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘భాగవతంలో శంఖారావం’కి సహాయకునిగా చేశాను. దర్శకత్వ శాఖ గురించి ఎన్నో మెళకువలు నేర్పించిన గురువు. ఆయన్ను కోల్పోవడం బాధాకరం. భాస్కరరావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement