breaking news
Vizianagaram marketing
-
అప్పుడు రూ.60, ఇపుడు రూ. 6 లే : సిద్దూ సైకిల్ భళా..!
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేందుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్యమైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరిస్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్లైన్లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించుకున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదిర్శంచేందుకు రూపొందించిన ప్రాజెక్టుల అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్ చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలిచాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు అభినందిస్తున్నారు. ఇదీ చదవండి: కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోందిఆ విజ్ఞానంతోనే.. ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారంకోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకిల్‌కు బిగించాను. ప్రస్తుతం ప్రతిరోజూ కళాశాలకు ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్‌పైనే వెళ్తున్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది. – సిద్దూ, జె.కొత్తవలసచదవండి: బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు -
ఆ పెద్దోళ్లున్నారే..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం:ధాన్యం కొనుగోలులో అక్రమాల భాగోతం. జిల్లా ఇటీవల పెద్ద కలకలమే సృష్టించింది. అయితే ఈ బాగోతంలో సూత్రధారులు, సలహాదారులు మాత్రం తమకేమీ కాదన్నట్లు వ్యవహరిస్తుంటే కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం బలైపోతున్నారు. ఏదైనా కుంభకోణం కానీ, అక్రమ వ్యవహారం కానీ జరిగినప్పుడు ఎటువంటి వ్యవహరంలోనైనా చిన్న తలకాయలే బలిపశువులవుతున్నాయి. రూ.కోట్లు వెనకేసుకున్నోళ్లు వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్నారు. అక్రమాలకు గేట్లెత్తిన అధికారుల వ్యవహారం బయటకు రావడం లేదు. ఉన్నతస్థాయి వ్యక్తుల జోలికే వెళ్లడం లేదు. అక్రమాల వ్యవహారాలో నిగ్గు తేల్చే విచారణల సందర్భంగా జిల్లా ప్రజల అభిప్రాయాలివి. ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై తీసుకుంటున్న చర్యలు గమనిస్తుంటే జిల్లా ప్రజల అభిప్రాయాలను కొట్టిపారేయలేని పరిస్థితి. సంబంధిత ఉద్యోగ వర్గాల నుంచి కూడా ఇవే రకమైన వాదనలు విన్పిస్తున్నాయి. గంట్యాడ మండలంలోని శ్రీ సాయి వరలక్ష్మి ఆగ్రోఫుడ్స్ మిల్లులో అక్రమాలు జరిగాయని, ధాన్యం రవాణాకు సంబంధించి అడ్డగోలుగా ట్రక్షీట్లు జారీ చేశారన్న అభియోగాలతో ఆ మండలం హెచ్‌డీటీ కె.మసీన్రావు, నీలావతి వీఆర్ఓ శంకర్రావులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పు చేశారన్న కారణంతో వీరిపై చర్యలు తీసుకోవడం సరైనదే కానీ..ఇందులో సూత్రధారులు చాలా మంది ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యవహారం ఒక్క శ్రీ సాయి వరలక్ష్మి ఆగ్రోఫుడ్స్ విషయంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా జరిగిన ధాన్యం కొనుగోలు అక్రమాల భాగోతంలో ఉన్నత స్థాయి వ్యక్తులే కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కీలక అధికారుల అంతర్గత ఆదేశాలు లేకుండా ఏమీ జరగలేదన్న వాదనలు ఉన్నాయి. అధికారులు, పలు శాఖల సిబ్బంది, పలువురు మిల్లర్లు కుమ్మక్కై ఈ దందాకు పాల్పడినట్టు బయటకు వెల్లడైన పరిణామాల బట్టి స్పష్టమవుతోంది. అధికారులకే తెలియాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన ట్రక్షీట్లు మిల్లర్లకు చేతికి ఎలా వెళ్లాయి? ట్రక్షీట్ల పుస్తకాలు మిల్లర్ల వద్దకు వెళ్లడానికి కారకులెవరు? సీరియల్ నంబరు లేకుండా లెక్కాడొక్కా లేకుండా ట్రక్షీట్లు ముద్రించిందెవరు? ఐకేపీ, సివిల్ సప్లైస్, రెవెన్యూ సిబ్బంది రాసి ఇవ్వాల్సిన ట్రక్షీట్లను మిల్లర్లు ఎలా రాసిచ్చారు? ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలియకుండా జరిగిందా? ఇలా ప్రశ్నిస్తే వీటిపై ఉన్నతాధికారుల వద్ద సమాధానమే లేదు. ఇక, సం తల్లో చీటీల్లా సాగు ధ్రువీకరణ పత్రాలు చెలామణిలోకి వచ్చాయంటే అధికారులకు సంబంధం లేకుండా జరిగిపోయిందా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఎకరాకు 1200బస్తాల ధాన్యం పం డించినట్టు, వాటిని కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపిస్తున్నాయి. ఆ స్థాయిలో పంట పండించే రైతులెక్కడున్నారో సదరు అధికారులే తేల్చాలి. ఒకే మిల్లర్ తన బంధువుల పేరున ట్రక్షీట్లు రాసుకుని, రూ.లక్షలాది రూపాయలు డ్రా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ, ఆ దిశగా విచారణే జరగడం లేదు. పత్రికల్లో కథనాలొచ్చినప్పుడు మత్రం భుజాలు తడుముకుంటూ విచారణకు ఆదేశించామని చెబుతున్నారే తప్ప వాస్తవ పరిస్థితులు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరగడం లేదు. అసలీ విచారణలపై కూడా విమర్శలొస్తున్నాయి. ఎవరికైతే ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలొస్తున్నాయో వారే విచారణాధికారులగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవర్నో ఒకర్ని ఇరికించి, ఫైలు మూసేస్తే సరిపోతుందనే ధోరణితో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.