‘ది ప్యారడైజ్’లో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన ఈ నటి ఎవరో తెలుసా?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నానితో పాటు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీరావు, విషిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఇందులో సంపూర్ణేష్ బాబు ‘బిర్యానీ’ అనే పాత్రలో కనిపించారు. సాధారణంగా కామెడీ పాత్రలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్.. ఈ సినిమాలో మాత్రం కాస్త భిన్నమైన పాత్రలో కనిపించారు. ఆయన భార్య ‘దేవి’ పాత్రను నటి విషిక పోషించారు. ఆమె పాత్ర సినిమాలో ఎక్కువసేపు కనిపించకపోయినా.. కథలో కీలకమైన సందర్భాల్లో కనిపిస్తారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సంపూర్ణేష్ బాబు, విషిక మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కథలో ఆసక్తిని పెంచేలా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ధూమావతి దేవి విగ్రహం ముందు వచ్చే సీన్ అందరిని కంటతడి పెట్టిస్తుంది. అంతలా తనదైన సహజనటనతో ఆకట్టుకుంది విషిక. ఇక విషిక సీనీ కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటికే ‘కోర్ట్’, ‘పతంగ్’, ‘పురుషః’ వంటి సినిమాలు, సిరీస్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా తన పరిధిని పెంచుకుంటున్నారు. ‘ది ప్యారడైజ్’లో దేవి పాత్ర కూడా ఆమె కెరీర్లో మరో విభిన్నమైన పాత్రగా నిలిచింది.పెద్దగా హడావుడి లేకుండా తన పాత్ర పరిధిలో సహజంగా నటించడం ద్వారా విషిక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమాలో ఆమెది కీలక పాత్ర కాకపోయినా.. కథలో భాగమైన దేవి పాత్ర మాత్రం గుర్తుండిపోయేలా ఉందని చెప్పొచ్చు. అయితే ఆ సినిమాలో సవారీ జాతి మహిళగా డీగ్లామర్ పాత్రలో కనిపించిన విషిక..బయట మాత్రం చాలా అందంగా, హీరోయిన్ మెటిరియల్గా ఉంది. విషిక బ్యూటిఫుల్ ఫోటోలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Kirthi♊️ (@vishika_14)