breaking news
Vikalp scheme
-
ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక ప్రత్యేక అనుభవం కూడా. సందడిగా ఉండే రైల్వే స్టేషన్లు, ప్రకృతి అందాలను చూపించే మార్గాలు, ప్రయాణంలో కలిసే కొత్త వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే.. టికెట్ బుకింగ్ సమయంలో లేదా రిజర్వేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో కనిపించే కొన్ని రైల్వే పదాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ పదాల అర్థం తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభంగా.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగుతుంది.ఆర్ఏసీ (RAC)RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్. ఈ స్టేటస్ ఉన్న ప్రయాణికుడికి ఫుల్ బెర్త్ లభించదు. కానీ రైలులో ప్రయాణించవచ్చు. అయితే.. ఒక సీటును ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళా ఇతర ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకుంటే, అలాంటి సందర్భంలో ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటానికి బదులుగా ఆర్ఏసీ మంచి ఎంపికగా భావిస్తారు.జీఎన్డబ్ల్యుఎల్ (GNWL)GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇది రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే వెయిటింగ్ లిస్ట్ రకం. ఇతర వెయిటింగ్ లిస్ట్‌లతో పోలిస్తే GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా టికెట్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.టీక్యూడబ్ల్యుఎల్ (TQWL)TQWL అంటే తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్. తత్కాల్ పద్ధతిలో టికెట్ బుక్ చేసినప్పుడు సీటు దొరకకపోతే ఈ స్టేటస్ వస్తుంది. తత్కాల్ కోటాలో సీట్లు పరిమితంగా ఉండటంతో, TQWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు GNWL కంటే తక్కువగా ఉంటాయి. ప్రయాణం ప్రారంభమయ్యే వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అయితే మీ డబ్బు రీఫండ్ అవుతుంది.యూటీఎస్ (UTS)UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. ఇది రిజర్వేషన్ అవసరం లేని ప్రయాణాల కోసం ఉపయోగించే టికెట్ విధానం. సాధారణంగా చిన్న దూర ప్రయాణాలు లేదా రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. UTS టికెట్లను కౌంటర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రద్దీ సమయాల్లో ఈ కోచ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి, కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.ఈ-క్యాటరింగ్ఈ-క్యాటరింగ్ అనేది ప్రయాణికులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి, ప్రయాణ సమయంలో దానిని తమ సీటు వద్దకే తెప్పించుకునేందుకు వీలు కల్పించే ఒక సర్వీస్. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వివిధ రెస్టారెంట్ల నుంచి భోజనాన్ని సెలక్ట్ చేసుకుని, రైలు ప్రయాణ సమయంలో స్టేషన్ వద్ద మీరున్న చోటుకే డెలివరీ పొందవచ్చు. లాంగ్ జర్నీ సమయంలో తాజా, రుచికరమైన ఆహారం (ప్రాంతీయ వంటకాలు) రుచి చూడవచ్చు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుLHB అంటే లింకే హోఫ్మాన్ బుష్. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రైల్వే కోచ్‌లు. పాత ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవి. ప్రయాణ సమయంలో తక్కువ కుదుపులు ఉండటం వల్ల ప్రయాణికులకు మెరుగైన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రధానంగా LHB కోచ్‌లను ఉపయోగిస్తున్నారు.వికల్ప్ పథకంవికల్ప్ పథకం అనేది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించే ప్రత్యేక సదుపాయం. మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అదే మార్గంలో వెళ్లే మరో రైలులో సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అధిక రద్దీ ఉన్న రోజుల్లో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది.భారతీయ రైల్వేలో ఉపయోగించే ఈ ముఖ్యమైన పదాల అర్థం తెలుసుకోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. RAC, GNWL, TQWL వంటి స్టేటస్‌ల అర్థం తెలిసి ఉంటే మీ టికెట్ పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే UTS, E-Catering, LHB కోచ్‌లు, వికల్ప్ పథకం వంటి సదుపాయాల గురించి అవగాహన ఉండటం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కాబట్టి ప్రతి రైలు ప్రయాణికుడు ఈ పదాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ.. -
వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే...
- ప్రత్యామ్నాయ రైల్లో వెళ్లే సౌకర్యం - వికల్ప్ పథకాన్ని విస్తరించిన రైల్వే న్యూఢిల్లీ: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం ఎంపిక చేసిన రూట్లలో రైల్వే శాఖ కొత్త ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్ రూట్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైల్లో గమ్యానికి చేర్చేందుకు వికల్ప్ పథకాన్ని సోమవారం విస్తరించింది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని వారి ఇష్టం మేరకు వేరే రైల్లో వెళ్లవచ్చు. ఈ పథకం మెయిల్/ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వర్తిస్తుంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో చెల్లుబాటుకాదు. వికల్ప్ కింద ప్రత్యామ్యాయ వసతి కల్పించాక ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అనుమతించరు. చార్జీలో తేడాలున్నా రీఫండ్ ఇవ్వరు.ఎలాంటి అదనపు చార్జీలు కూడా ఉండవు. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. ► తత్కాల్ టికెట్లను రద్దు చేసుకుంటే సగం మొత్తం వెనక్కిస్తారు. ప్రస్తుతం ఇందులో రీఫండ్ సౌకర్యం లేదు. ► తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పు. ఏసీ బుకింగ్‌లకు ఉదయం 10 నుంచి 11 వరకు. స్లీపర్ కోచ్ టికెట్ బుకింగ్ ఉదయం 11 నుంచి 12 వరకు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో కేవలం మొబైల్ టికెట్లనే అనుమతిస్తారు. ► ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుకింగ్ రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో బోగీల సంఖ్య పెంపు. దీనివల్ల ఎక్కుమంది కన్ఫర్మ్ టికెట్స్ పొందొచ్చు. ► సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయం. ఇవి రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మాదిరి తక్కువ స్టాప్‌లు ఉంటాయి. ► ప్రీమియం సర్వీసు రైళ్లకు ముగింపు. రైళ్లలో ప్రయాణికులకు గమ్యస్థానం వచ్చేటప్పుడు అప్రమత్తం చేసేందుకు ‘వేకప్ కాల్’ సౌకర్యం. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద హెచ్చరికలు.. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు రైల్వే సాంకేతికత సహాయంతో హెచ్చరికలు చేసే కొత్త విధానాన్ని అవలంబించనుంది. సీసీ కెమెరాలు, రేడియో పౌనఃపున్యం ఆధారంగా పనిచేసే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చారు. అన్రిజర్వ్డ్ రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి హ్యాండ్ హెల్డ్ టర్మినల్స్‌ను ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్లో పైలట్ ప్రాజెకు ్టకింద ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్లాట్‌పాం టికెట్, అన్రిజర్వ్డ్ టికెట్, సీజన్ టికెట్లను కొనొచ్చు. రైల్వేలో ట్రాక్ మరమ్మతులకు ట్రాక్‌మెన్, కీమెన్ల కోసం తేలికైన టూల్ కిట్‌ను రైల్వే తీసుకొచ్చింది.


