breaking news
vijay verma
-
అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్‌కు..!
కటిక పేదరికం అందమైన బాల్యం దూరంచేసి చదువు దారిదాపుల్లోకి రానివ్వకుండా చేసింది. కానీ అతడి ఎదుగుదలను ఆపలేకపోయింది. చదువు లేకపోయినా..బతక నేర్చిన తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి..అంట్లు తోమే స్థాయి నుంచి వ్యవస్థాపకుడిగా మారి ఏకంగా 160 కోట్లు విలువ చేసే కంపెనీని నిర్మించే స్థాయికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అంతేగాదు జీవితం అన్ని ఇవ్వకపోయినా..కష్టపడి సాధించుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు అని చూపించాడు.ఆ వ్యక్తే రాజస్థాన్‌కు చెందిన విజయ్ వర్మ. రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా, బిసౌ గ్రామంలో అక్టోబర్ 1978లో జన్మించిన ఆయన బాల్యం కటిక దారిద్యంలో గడించింది. అతనికి పదేళ్లు వచ్చేసరికి తాతయ్య, నానమ్మ ఇద్దరూ చనిపోయారు. ఏడాదిలోపే తండ్రి కూడా చనిపోయారు. మిగిలింది తల్లి ఒక్కత్తే..ఆమెనే ఆరుగురు పిల్లలను పోషించాల్సి ఉంది. అయితే అక్కడ మహిళలు ఎప్పుడూ పొడవాటి ఘూంఘట్లతో గడప దాటి బయటకు రావడం చాలా అరుదు. అందువల్ల నాటి సమాజ ఆంక్షలను ధిక్కరించే అవకాశం లేక అతడి తల్లి ఆరుగురు పిల్లలను పోషించేందుకు ప్రతి రోజు సూర్యోదయానికి ముందే ఇంటి వెనుక ఉన్న అడవిలోకి వెళ్లి ఎండిన ఆకులు, పేడను సేకరించి బదులుగా 30-40 కిలోల పిండిని తెచ్చుకునేదని చెప్పుకొచ్చారు విజయ్ వర్మ. ఇంతలో అన్నయ్య అమ్మకు సాయంగా ఆస్పత్రిలో రెండు రూపాయల జీతానికి కార్మికుల భోజన పెట్టెలు మోసుకెళ్లే పనిలో చేరాడని అన్నారు. అంతా బాగానే సాగుతుంది అనుకుంటుండగా..ఒక ఏడాది తర్వాత మళ్లీ చేతిలో పనుల్లు లేక ఇబ్బందిపడాల్సి వచ్చింది. అప్పుడే తమ కుటుంబానికి తెలిసిన సీతారాం భాయ్ అనే వ్యక్తి మా అన్యయ్యను ముంబై తీసుకువెళ్లి నెలకు రూ. 500లు ఇప్పిస్తానని చెప్పారు. ఆరో తరగతిలో ఉన్నా తాను ఆ మాటలు విని పట్టుబట్టి మరి అన్యయ్య తోపాటు ముంబై వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ మురుగు కాలువ దుర్గంధం, దోమల బెడద తట్టుకోలే నరకం చూసి, ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోదాం అనుకున్న తరుణంలో పూణే వెళ్లి పరిశుభ్రమైన వాతావరణ చూడమని సలహా ఇవ్వడంతో అక్కడికి పయనమైనట్లు తెలిపారు. అయితే తమకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి రూ. 200లు ఇవ్వడంతో ఆ డబ్బులతో తాము రైలు ఎక్కి పూణేకి చేరుకున్నట్లు తెలిపారు. రైలు టికెట్ రూ. 20లు పోగా మిగిలినడబ్బుని ఎవరో ఎత్తుకుపోయిన ఘటన అస్సలు మరవనన్నారు. ఆ సమయంలో టాయిలెట్లు క్లీన్ చేసే ఒక అపరిచితుడు మమ్మల్ని చూసి జాలిపడి మాకు మూడు రోజులు అన్నం పెట్టి..టాయిలెట్ వాడుకునేందుఉ అనుమతించాడని అన్నారు. ఆ తర్వాత తాము అతడి వద్దే 18 రోరజు ఉండి వడా పావ్ అమ్మేవారికి గిన్నెలు కడుగుతూ రూ. 3లు సంపాదించినట్లు తెలిపారు. సరిగ్గా ఆ సమయంలోనిరాధర్ అనే రాజస్థానీ కాంట్రాక్టర్, వర్మ తనసోదరుడికి మంగళా థియేటర్లో రోజుకు రూ. 18 చొప్పున పునరుద్ధరణ పనులు చేసే పనులు అప్పగించడంతో తమ రాత మారినట్లు తెలిపాడు. అయితే విజయ్‌కి పనిచేసే వయసు తక్కువగా ఉండటంతో ఒక వృద్ధురాలికి ఇసుక జల్లించడంలో సాయం చేయమని చెప్పారు. అయితే ఆమె కంటే మూడు రెట్లు వేగంగా పనిచేయడంతో ఆశ్చర్యపోయిన కాంట్రాక్టర్ తనకు రోజుకు రూ. 8లు చెల్లించినట్లు తెలిపారు. ఆ తర్వాత నెలలో ఒక గదికి మారి రూ. 2లకు ఒక సైకిల్ని అద్దెకు తీసుకుని ఒక భవన నిర్మాణానికి సంబంధించి.. టైల్ ఫ్లోరింగ్ నుంచి ప్లాస్టరింగ్, ఆర్సీసీ వరకు ప్రతి అంశంలో నైపుణ్యం సాధించినట్లు తెలిపారు. ప్రతి నెల 25వ తేదీకి రూ. 90 నుంచి 170 వరకు మనీ ఆర్డర్లను పంపేవాళ్లమని అన్నారు. ఒక ఏడాది తర్వాత టిఫిన్ బాక్సులలో రూ. 65,000 నగదును దాచి మా ఊరికి వెళ్లి..మా ఇంటి వెనుకు ఉన్న పొదలను తొలగించి ఒక గోడను నిర్మించుకోగలిగామని గర్వంగా చెప్పారు.అన్నింటినీ మార్చేసిన ఆ అవకాశందానితో ధైర్యం తెచ్చుకున్న ఆ సోదరులు, సొంతంగా కాంట్రాక్టర్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు విజయ్. ఇందుకోసం తమ గ్రామం నుంచి ఆరుగురు అబ్బాయిలను శిక్షణ కోసం చేర్చుకున్నామని అన్నారు. వారు విమల్ కుమార్ జైన్ అనే ఒక ప్రసిద్ధ బిల్డర్ వద్ద పని చేయాలని ఆశపడ్డారు. మూడు నెలల పాటు, ఆ బిల్డర్ వారిని "కేవలం పిల్లలు" అని కొట్టిపారేశాడు. చివరకు విజయ్ తాము, టైలింగ్, కిచెన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్‌సిసి, ప్లాస్టరింగ్ వంటి వాటిలో తనకు నైపుణ్యం ఉందని వాదించి మరి అవకాశం ఇవ్వమని అర్థించాడు. దాంతో ఆ బిల్డర్ 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఒక శాంపిల్ ఫ్లాట్‌ను కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేయాలనే అసాధ్యమైన గడువు ఇచ్చాడు, అంతేగాదు పని పూర్తి చేయకపోతే జీతం కూడా ఉండదని హెచ్చరించాడు. కానీ విజయ్ బృందం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రేయింబవళ్లు పనిచేసి మూడు రోజుల్లోనే ఆ పనినని పూర్తి చేసి ఆశ్చర్యపోయేలా చేశారు. వారి వేగం, నాణ్యత చూసి ఆ ఇంజనీర్ కాంట్రాక్టర్ ఏకంగా రూ. 5100 అందజేశారు. అదే తమనుఅన్న పేరుమీద శ్యామ్‌సుందర్ చీరంజీవ్లాల్జీ కన్స్ట్రక్షన్ అనే కంపెనీని పెట్టే స్ధాయికి తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. కొద్దిమంది కార్మికులతో మొదలైన ఆ కంపెనీ..చూస్తుండగానే ఏకంగా 350 మందికి పెరిగింది.ఆ తర్వాత కాంట్రాక్టర్ నుంచి వ్యవస్థాపకుడిగా1998 నాటికి, ఆ సంస్థలో సుమారు 850 మంది కార్మికులు పనిచేసేవారు, పైగా రూ. 8 కోట్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేసేదని వెల్లడించారు. అయితే ఈ సంఖ్య పెరుగుతూనే ఉండి, 2004-05 నాటికి రూ. 20 కోట్లకు చేరుకుందని చెప్పారు. ఫైవ్-స్టార్ హోటళ్ల లాబీల నుంచి ఫామ్‌హౌస్‌ల వరకు, తాము అస్సలు వెనుతిరిగి చూడలేదని తెలిపారు. ఆ తర్వాత ఆయన 2008లో,సొంతంగా సాయి విజయ్ కన్‌స్ట్రక్షన్‌ను స్థాపించి, 2011లో దానిని LLPగా లాంఛనప్రాయంగా మార్చారు. 2017లో, ఆ కంపెనీ ఆదాయపు పన్ను విచారణను కూడా ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి నష్టం లేకుండా బయటపడిందన్నారు. తమ రికార్డులు ఎంత పకడ్బందీగా ఉండేవంటే, దర్యాప్తు అధికారులు కనీసం రూ. 5,000 వ్యత్యాసాలను కూడా కనిపెట్టలేకపోయేవారని గర్వంగా చెప్పారు. ఈనాడు, ఆ కంపెనీ విలువ సుమారు రూ. 160 కోట్లు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయనకు పూణేలో నాలుగు ఇళ్లు, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఒమన్, యెమెన్ వంటి దేశాల్లో ఏకంగా రూ. 730 కోట్ల అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని అన్నారు. అలాగే తన వద్ద శిక్షణ తీసుకున్న కార్మికులే కొందరు సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్థికపరిస్థితుల దృష్ట్యా కోల్పోయిన చదువుని తిరిగిపోందడం కోసం..30వ ఏట ఓపెన్ స్కూలింగ్ సాయంతో పది పూర్తి చేసి, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా, పీహచ్‌డీ పూర్తి చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలను చెబుతున్నారు. అరగంటగా మొదలయ్యే తన ప్రసంగాలు విద్యార్థుల ప్రోత్సాహంతో రెండు మూడు గంటల వరకు సాగుతాయని చెప్పుకొచ్చారు. అంతేగాదు విజయ్ వర్మ కుమారుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు.ఆయన చెప్పే జీవిత పాఠాలు..తనలాంటి జీవితాన్ని నిర్మించుకోవడానికి ఏం కావాలని అడిగితే, నిజాయితీ, కఠోర శ్రమ, పట్టుదల అని తడుముకోకుండా చెప్పేస్తారు. అంతేగాదు తాము ఎదిగే క్రమంలో ఒక రాత్రి పోలీసులో దాడిలో తీవ్రంగా గాయపడ్డమని అన్నారు. దాంతో తన అన్నయ ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఆ ఘటన తనకు గౌరవనీయమైన వ్యక్తులతో సత్ససంబంధాలు ఏర్పరుచుకోవడం అత్యంత ముఖ్యమని తెలిసొచ్చిందన్నారు. అంతేగాదు విజయ్ అందమైన జీవితాన్ని నిర్మించుకోవడమే కాదు, బాల్యంలో మిస్సైన అభిరుచుల వైపుకి మళ్లుతూ పియానో, మార్వాడీ జానపద గీతాలు వంటివి కూడా నేర్చుకుంటూ..తన బాల్యన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంటానని అన్నారు.(చదవండి: చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్..!) -
ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన విజయ్ వర్మ.. కొన్నాళ్ల క్రితం తమన్నాతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారు కూడా. ఇప్పుడు ఎవరికి వాళ్లు కెరీర్ పరంగా బిజీ అయిపోయాడు. విజయ్ వర్మ నటించిన క్రైమ్ డ్రామా సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రాబోతుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో ఉస్తాద్ భగత్‌సింగ్..!)మట్కా పేరుతో గతంలో బెట్టింగ్ తరహా గేమ్ ఉండేది. ఇప్పుడు దీన్ని బ్యాక్‌డ్రాప్ స్టోరీగా తీసుకుని తెరకెక్కించిన సిరీస్ 'మట్కా కింగ్'. విజయ్ వర్మ, కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 'సైరత్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుందని తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌తో ప్రకటించారు.టీజర్ బట్టి చూస్తే.. ముంబైకి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ఈ క్రమంలోనే అండర్ వరల్డ్, పోలీసులని ఎలా ఎదుర్కొన్నాడు? తదితర అంశాలే స్టోరీ అని తెలుస్తోంది. గతంలో తెలుగులో 'మట్కా' పేరుతో వరుణ్ తేజ్ హీరోగా సినిమా వచ్చింది గానీ అది ఘోరమైన డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడొస్తున్నది సిరీస్ కాబట్టి ఇందులో స్టోరీ మరింత రియలస్టిక్‌గా చూపించే అవకాశముంది.(ఇదీ చదవండి: ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది) -
గోవా టూర్లో బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ తమన్నా (ఫొటోలు)
-
మా డేటింగ్ మొదలైంది అప్పుడే!
‘నువ్వు కావాలయ్యా...’ అంటూ ‘జైలర్’లోని ప్రత్యేక పాటలో తమన్నా చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పాటల్లో ఇదొకటి. కాగా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అయితే తమన్నాతో దాదాపు ఇలానే అన్నారట. ‘నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అని చెప్పారట విజయ్. గత ఏడాది కొత్త సంవత్సరం పార్టీలో విజయ్, తమన్నా చాలా క్లోజ్‌గా కనిపించడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా సినిమాల్లో కూడా చేయనంతగా విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో ముద్దు సన్నివేశాల్లో నటించారు తమన్నా. ఆ సిరీస్‌లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమోననే అభిప్రాయం పలువురికి కలగజేసింది. అయితే అప్పుడు కాదు.. అసలు డేటింగ్ మొదలైంది ఎప్పుడంటే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విజయ్ వర్మ, ఆ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ – ‘‘లస్ట్ స్టోరీస్ 2’ అప్పుడు మేం డేటింగ్లో లేము. ఆ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ‘ర్యాప్అప్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో తమన్నా, నేను, మరో ఇద్దరు పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలోనే ‘నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అంటూ నా ఫీలింగ్‌ని తమన్నాతో చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ సెట్ కావడానికి 20, 25 రోజులు పట్టింది’’ అని పేర్కొన్నారు. సో.. ప్రపోజ్ చేసిన 25 రోజులకు విజయ్, తమన్నాల డేటింగ్ మొదలైందన్న మాట. ఇక ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో ఒకరంటే మరొకరికి బాగా ఇష్టమన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. -
మేమిద్దరం కలిసి ఓ సినిమా చేశాం, మా పెళ్లి చేశారు!: తమన్నా
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది తమన్నా. 'మేమిద్దరం(విజయ్ను ఉద్దేశిస్తూ..) కలిసి ఓ సినిమా చేశాం. అప్పటినుంచి మా రిలేషన్షిప్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఈ అంశంపై నేను ఇంతకుమించి చెప్పాల్సిన విషయాలు కూడా ఏమీ లేవు. అయినా హీరోయిన్స్ గురించి ఇలాంటి అవాస్తవాలు ఎలా తెరపైకి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ నుంచి బిజినెస్మెన్ వరకు నాకు తెలియకుండానే కొందరు ఇప్పటికే నా పెళ్లి చాలాసార్లు చేశారు(వ్యంగ్యంగా)' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా రజనీకాంత్ జైలర్, చిరంజీవి భోళా శంకర్ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే! -
సీఎంతో కటీఫ్.. శరద్ యాదవ్ సొంత కుంపటి!
పాట్నా: మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో సీఎం నితీశ్ కుమార్ తెగదెంపులు చేసుకున్న తర్వాత బిహార్‌లో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ కొత్త కుంపటి పెట్టుకునేలా కనిపిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి పాత మిత్రపక్షమైన బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన జేడీయూ నేత నితీశ్‌కుమార్ నిర్ణయంపై ఆ పార్టీ అగ్రనేత శరద్‌యాదవ్ ఇంకా అసంతృప్తి జ్వాలలు కురిపిస్తున్నారు. శరద్ యాదవ్ సన్నిహితుడైన విజయ్ వర్మ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలువురు జేడీయూ నేతలను శరద్‌యాదవ్ కలుసుకోనున్నారని తెలిపారు. తమ భావజాలంతో జోడు కుదిరే పార్టీలతోనూ శరద్ యాదవ్ చర్చిస్తున్నారని చెప్పారు. కొత్త పార్టీకి సంబంధించి కీలక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని విజయ్ వర్మ అన్నారు. ముఖ్యంగా నితీశ్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రజా తీర్పును గౌరవించకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సీనియర్ నేత శరద్ యాదవ్ ర్ణించుకోలేక పోతున్నారు. ఇదే అంశంపై జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ పాట్నాలో మీడియాతో మాట్లాడారు. శరద్ తమ పార్టీ సీనియర్ నేతని, అయితే కొత్త మార్గం ఎంచుకునే అవకాశం ఉందన్నారు. శరద్ యాదవ్ తనకు నచ్చిన నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడ్డారు. ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ పేరిట ఆగస్టు 27వ తేదీన ఆర్జేడీ నిర్వహిస్తున్న ర్యాలీలో జేడీయూ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన శరద్ యాదవ్ పొల్గొననున్నారు. -
భారీ మోసం.. జైలుకు ఇండియన్ అమెరికన్స్
వాషింగ్టన్: పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడిన ఇద్దరు భారతీయ అమెరికన్లకు జైలు శిక్ష పడింది. దాదాపు 200 మిలియన్ డాలర్ల క్రెడిట్ కార్డు మోసానికి దిగిన విజయ్ వర్మ(49), తర్సీం లాల్(78) అనే ఇద్దరికి ఏడాదిపాటు జైలు శిక్ష పడింది. వీరికి కోర్టు ఐదువేల డాలర్లను జరిమానా విధించింది. న్యూజెర్సీలో వీరిద్దరు ఓ జ్యూయెలరీ స్టోర్ యజమానులుగా ఉన్నారు. 2013లో ఓ పథకం పేరిట దాదాపు 7000 తప్పుడు చిరునామాలు, అడ్రస్ ప్రూఫ్‌లు పెట్టి దాదాపు వేలల్లో క్రెడిట్ కార్డులు రాబట్టి వాటి ద్వారా పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడ్డారు. ఆ క్రెడిట్ కార్డులను ఉపయోగించి తమ స్టోర్‌లోనే స్వైపింగ్ చేసి క్రెడిట్ లిమిట్ మొత్తం తమ ఖాతాల్లోకి వచ్చేలా చూసుకున్నారు. ఇలా 200 మిలియన్ డాలర్లు వారి ఖాతాకు జమ అయింది. అయితే, ఆ తర్వాత ఆ అప్పును చెల్లించేందుకు కార్డు దారులు ముందుకు రాకపోవడంతో దర్యాప్తు చేయగా అసలు బండారం బయటపడింది. వారే క్రెడిట్ కార్డులు సృష్టించి వారే ఈ మోసానికి దిగినట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు తరలించగా మొత్తం 14 నెలల జైలు శిక్షతోపాటు 12 నెలలపాటు ఇంట్లోనే ఉండిపోయేలా శిక్ష వేసింది. -
జీవితాన్ని మార్చే రిక్వెస్ట్
ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంత మంది జీవితాలను తలకిందులు చేసి, భయానక పరిస్థితులను సృష్టిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో ఆదిత్యా ఓం హీరోగా నటిస్తూ, తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్, సుదర్శన్, మనీషా కేల్కర్, రిచాసోనీ ముఖ్యతారలు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ఇప్పుడొస్తున్న హార ర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుంది. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: లవన్, వీరల్. -
'ఫ్రెండ్ రిక్వెస్ట్' టీజర్ లాంచ్..!


