breaking news
Vignesh Karthick
-
మరో ఆఫర్ కొట్టేసిన బేబి
'బేబి' సినిమా అనగానే హీరోయిన్ వైష్ణవి చైతన్య గుర్తొస్తుంది. ఒక్క మూవీనే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ అవి డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఫోకస్ అంతా తమిళంపై పెట్టింది. ఇంతకు ముందే అజిత్ హీరోగా నటించిన 'వలిమై'తో తమిళ ఎంట్రీ ఇచ్చింది కానీ అందులో చిన్న పాత్ర మాత్రమే చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్గా అవకాశాలు అందుకుంటోంది.సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు జంటగా వైష్ణవి నటిస్తోంది. చిత్రమైన సినిమాలు తీసే విఘ్నేష్ కార్తీక్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన ఇంతకు ముందు తిట్టం ఒండ్రు, అడియే, హాట్ స్పాట్ 1,2 మూవీస్ తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే చైన్నెలో ప్రారంభమై తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గత చిత్రాలకు భిన్నంగా దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ దీనిని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడట. మరోవైపు ఆర్య హీరోగా నటిస్తున్న సినిమాలోనే వైష్ణవి చైతన్య ఓ హీరోయిన్గా చేస్తోంది. -
స్టార్ డైరెక్టర్-యంగ్ హీరోయిన్ పెళ్లి? షాక్‌లో ఫ్యాన్స్!
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. ఏ భాషలో తీసుకున్నా సరే ఇలాంటి జంటలు చాలానే కనిపిస్తుంటాయి. నాలుగైదు రోజుల క్రితం కన్నడ హీరోయిన్ సోనాలి.. దర్శకుడు తరుణ్ సుధీర్‌తో పెళ్లికి రెడీ అయింది. ఆగస్టులో పెళ్లి ఉంటుందని చెబుతూ ఏకంగా ప్రీ వెడ్డింగ్ వీడియోనే పోస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్లలానే తమిళ స్టార్ డైరెక్టర్-హీరోయిన్ పెళ్లి దుస్తుల్లో కనిపించడం అందరినీ షాక్‌కి గురిచేసింది.(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?)తమిళంలో 'అడియే', 'తిట్టం ఇరండు', 'హాట్ స్పాట్' సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేశ్ కార్తీక్.. యంగ్ హీరోయిన్ బ్రిగిడ సాగాతో కలిసి సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపించాడు. ఆ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. సడన్‌గా చూసి నిజంగానే ఈ డైరెక్టర్, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నారు. కానీ ఇదంతా ఓ సినిమా కోసం జరిగిన షూట్.ఎందుకంటే ఇదివరకే దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్‌కి పెళ్లయింది. మరోవైపు బ్రిగిడ.. తమిళ, తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే వీళ్లిద్దరూ పెళ్లి డ్రస్సులో కనిపించేసరికి చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. అసలు విషయం తెలిసి తాపీగా నవ్వకున్నారు. ఏదేమైనా ఇలా సినిమా ప్రమోషన్ చేయడమంటే ఫస్ట్ షాకవుతారు. ఆ తర్వాత నవ్వుకుంటారు!(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)


