breaking news
Veterinary medical officer
-
రైల్లో చోరీ....
మంచిర్యాల క్రైం: సిర్పూర్-కాగజ్‌నగర్ వద్ద రామగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీ జరిగింది. తిరుపతమ్మ అనే మహిళా పశువైద్యాధికారిని గాయపరిచి ఓ దుండగుడు రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లాడు. రైలు వేగం కాస్త తగ్గగానే దిగి పారిపోయాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగినా ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నాం వెలుగులోకి వచ్చింది. గాయపడిన మహిళకు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వింతవ్యాధితో గొర్రెలు మృతి
వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధితో 15 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం సురాజుపల్లె గ్రామపంచాయతీ కర్సుకుంటపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నపుల్లమ్మ అనే కాపరికి చెందిన రూ.ఒకట్నిర లక్షల విలువైన 15 గొర్రెలు ఒక్కరోజులోనే వింతవ్యాధితో చనిపోయాయి. పోషకుల సమాచారంతో పశువైద్యాధికారి శ్రీధర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నోటికి సంబంధించిన వ్యాధి గొర్రెలకు సోకుతోందని, అయితే లక్షణాలను బట్టి అది కొత్త వ్యాధి అని ఆయన తెలిపారు. మృత గొర్రెల నుంచి నమూనాలు సేకరించి లేబొరేటరీకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఫలితాలు అందిన అనంతరం వ్యాధి నిర్ధారణ అవుతుందని చెప్పారు. కాగా,ఈ గ్రామంలోని వారంతా గొర్రెల పెంపకాన్నే వృత్తిగా చేపట్టారు. సుమారు ఆరు వేల గొర్రెలను ఇక్కడ పోషించుకుంటున్నారు.