breaking news
vegetarian fast food
-
ఫుడ్‌కోర్టులో ‘గుడ్డు’ వివాదం
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగర పార్కు లేఔట్ ప్రధాన రోడ్డులో వెజ్ ఫుడ్ కోర్టు (శాఖాహార)లో గుడ్లకు సంబంధించిన ఆహార విక్రయంపై గొడవ జరిగింది. వ్యాపారస్తులు బాహాబాహీకి కూడా దిగాల్సి వచ్చింది. శనివారం వెజ్‌ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించారు. దీనికి కొందరు మరికొందరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. వెజ్‌ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించేందుకు అవకాశం లేదని గొడవకు దిగారు. ఇదే విషయంపై శివమొగ్గ మహానగర పాలికెకు కొందరు ఫిర్యాదు చేశారు. చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి.. -
సో...యమ్మీ
శాకాహారులకు హై ప్రొటీన్ ఫుడ్ ఏదైనా ఉందంటే... అది సోయానే. రుచికి రుచి...శక్తికి శక్తి. సోయా వీట్ కుకీస్ కావలసినవి సోయాబీన్ పిండి – 1/2 కప్పు, గోధుమపిండి – 1/2 కప్పు, బటర్ – 1/2 కప్పు, పంచదార పొడి – 6 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా – 1/4 టీ స్పూన్, పిస్తా పలుకులు – 2 టేబుల్ స్పూన్స్. తయారి ఒక గిన్నెలో పంచదార పొడి, బటర్ వేసి 3, 4 నిమిషాల సేపు బాగా కలపాలి ∙మరొక గిన్నెలో సోయా పౌడర్, గోధుమ పిండి, యాలకుల పొడి, బేకింగ్ సోడా అన్నింటిని కలిపి బటర్, పంచదార కలిపిన మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙పిండిని ఉసిరికాయ సైజులో ఉండలుగా చేసుకొని అరచేతిలో ఒత్తుకోవాలి ∙రకరకాల షేప్స్‌లో కావాలంటే పిండిని మందపాటి చపాతీలా చేసుకుని బిస్కట్ మౌల్డ్‌తో షేప్ చేసుకోవచ్చు ∙ఈ కుకీస్ పైన తరిగిన పిస్తా పలుకులను అద్దుకోవాలి ∙ప్లేట్‌పై కొంచెం బటర్ రాసి తయారు చేసుకున్న కుకీస్‌ను పెట్టుకోవాలి ∙స్టౌ పైన మందపాటి పెనం పెట్టి వేడయ్యాక కుకీస్ ప్లేట్‌ను పెనంపై పెట్టి, వాటిపైన మూతపెట్టి 20 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి ∙టూత్‌పిక్‌తో కుకీస్ మధ్యలో చెక్ చేయాలి. పిక్కు పిండి అంటుకోకుండా ఉంటే కుకీస్ రెడీ అయినట్టే. సోయా కుకుంబర్ పాన్కేక్ కావలసినవి తురిమిన కీరా – 1 కప్పు, సోయా పిండి – 1 కప్పు, బొంబాయి రవ్వ – 1/2 కప్పు, జీలకర్ర – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్స్, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్స్, వెన్న – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడా. తయారి ఒక గిన్నెలోకి తురిమిన కీరా, సోయాపిండి, బొంబాయి రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా ఉప్పు, గ్లాసు నీళ్లు పోసి మరీ పలుచగా కాకుండా గరిటె జారుగా కలుపుకోవాలి ∙స్టౌ పైన నాన్‌స్టిక్ పాన్ పెట్టి 1/2 టీ స్పూన్ వెన్న వేసి వేడయ్యాక గరిటెతో పిండిని వేసి చుట్టూ కొంచెం నూనె వేసి, తిప్పి రెండువైపులా బాగా సిమ్‌లో కాల్చుకోవాలి ∙గ్రీన్ చట్నీతో వేడిగా వేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది. సోయా చంక్ బిర్యానీ కావలసినవి బాస్మతి రైస్ – 1 కప్పు, నీరు – 2 కప్పులు, సోయా చంక్స్ – 1/2 కప్పు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు తరుగు – 3 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోట, బంగాళదుంప, క్యారెట్ – ఒక్కొక్కటి, బీన్స్ – 5, పచ్చి బఠానీ – 1/4 కప్పు, ఉప్పు – రుచికి సరిపడ, కారం – 3/4 టీ స్పూన్, పసుపు – 1/4 టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, ధనియాల పొడి – 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి – 1/2 టీ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు – 4 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 1/2 అంగుళం ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1. తయారి బాస్మతి రైస్, సోయా చంక్స్‌ను విడివిడిగా కడిగి కనీసం 15 నిమిషాలు నానబెట్టుకోవాలి ∙స్టౌ పైన కుక్కర్ పెట్టి నూనె వేసి వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోట, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి ∙ఇప్పుడు తరిగిన బంగాళ దుంప, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, పసుపు, కారం, గరం మసాలా, ధనియాలపొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి ∙ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్‌ను కూడా వేసి బాగా వేగనివ్వాలి ∙కూరగాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి ∙ఉప్పు అడ్జస్ట్ చేసుకుని నీరు పోసి మూత పెట్టి 1 లేదా 2 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి ∙కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసి పైన నెయ్యి వేసి వేడివేడిగా సర్వ్ చేయండి. సోయా కీమా మటర్ కావలసినవి సోయా పలుకులు (గ్రాన్యూల్స్) – 1 కప్పు, పాలు – 2 కప్పులు, ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 2, టమోట – 1, బఠానీ – 1/4 కప్పు, అల్లం తరుగు – 1 టీ స్పూన్, వెల్లుల్లి – 2 టీ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడ, పసుపు – 1/4 టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, గరం మసాలా – 1/2 టీ స్పూన్, కొత్తిమీర తరుగు – గుప్పెడు, పుదీనా తరుగు – గుప్పెడు, నూనె – 6 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం – 1 టీ స్పూన్. తయారి సోయా గ్రాన్యూల్స్ గోరువెచ్చని నీటిలో లేదా పాలలో అరగంటసేపు నానబెట్టుకోవాలి ∙స్టౌ పైన మందపాటి బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కాసేపు వేగిన తర్వాత ఉడికిన బఠానీ కూడా వేసి వేయించుకోవాలి ∙ఇప్పుడు వరుసగా పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి చివరిగా సన్నగా తరిగిన టమోటా వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి ∙చివరగా పాలల్లో నానబెట్టిన సోయా క్రంచెస్ను వేసి బాగా కలిపి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి సోయా కీమా మటర్ రెడీ! ∙ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసి రోటీతో వడ్డించండి. – సేకరణ: జ్యోతి గొడవర్తి -
పైన పంటలు.. లోన వంటలు
ఫొటోలో ఉన్నదేంటో ’యామీస్’ అన్న పేరు చూడగానే తెలిసిపోయి ఉంటుంది. కానీ విషయం హోటల్‌కు మాత్రమే సంబంధించిన విషయంకాదు. శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా)కు గంట ప్రయాణ దూరంలో ఉండే ఈ హోటల్ పైకప్పు చూశారా? అదీ సంగతి! ఈ డ్రైవ్ థ్రూ హోటల్లో శుద్ధ శాకాహార వంటకాలను మాత్రమే వడ్డిస్తారు. పైగా వాటిల్లో అత్యధికం పైకప్పుపై పండినవే అయి ఉంటాయి. ఎక్కడెక్కడి పంటలన్నీ కొని తీసుకొచ్చి తింటే ఖర్చు ఎక్కువ కావడంతోపాటు జన్యుమార్పిడి పంటల కారణంగా లేనిపోని అనారోగ్యాలు వస్తాయేమో అన్న ఆలోచన యామీస్ కిచెన్ యాజమాన్యాన్ని ఈ ప్రయోగానికి పురికొల్పింది. ట్రాటెన్‌బర్గ్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసిన ఈ హోటల్ పైకప్పుపై అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలను పండిస్తున్నారు. మొక్కలు పెంచేందుకు అవసరమైన మట్టి, దాని అడుగున అవసరానికి మించిన నీటిని తోడివేసేందుకు ఏర్పాట్లు, దాని దిగువన నీళ్లు కారకుండా ప్రత్యేకమైన కవచం.. ఇలా ఉన్నాయి. పక్కనే వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు ఓ ట్యాంక్, డ్రిప్ ఇరిగేషన్ మోటార్లను పనిచేయించేందుకు అవసరమైన సోలార్ ప్యానెల్స్, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు బయోఛార్ (బొగ్గు) వంటివాటినీ ఏర్పాటు చేశారు. వీటితోపాటు పర్యావరణానికి చేతనైనంత సాయం చేయాలన్న ఉద్దేశంతో యామీస్ కిచెన్ యాజమాన్యం ఇక్కడ 15 కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్ ప్యానెల్స్ అదనంగా ఏర్పాటు చేసింది. వీటి అడుగునే కార్లను నిలిపి, ఆర్డర్ చేసిన ఆహారాన్ని పట్టుకెళ్లవచ్చు. ఈ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఎలక్ట్రిక్ కార్లకు చార్జ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తమ్మీద యామీస్ కిచెన్‌కు ఒక్కసారి వెళ్లామంటే... పెట్రోలు, డీజిల్‌లను విచ్చలవిడిగా మండిస్తూ వాతావరణ మార్పులకు కారణమవుతున్న వారు తమ కార్బన్ పాపాలను కొంచెమైనా కడిగేసుకోవచ్చన్నమాట!