-
జీవీ ప్రకాష్‌కుమార్ ‘జైలు’ సిద్ధం
సాక్షి, చెన్నై(తమిళనాడు): జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటించి సంగీతాన్ని అందిస్తున్న చిత్రం జైలు. అబర్ణతి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వసంతబాలన్ దర్శకుడు. రాధిక శరత్‌కుమార్, ప్రసంగ పాండు, నందన్‌రామ్, రవి మరియా తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విడుదల హక్కులను స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా పొందారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వసంతబాలన్ వివరాలను వెల్లడించారు. -
నేను చాలా లక్కీ
ఆ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని అంటోంది నటి వేదిక. పరదేశి చిత్రంలో అద్భుతమైన అభినయాన్ని చాటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం కావ్య తలైవన్. సిద్ధార్థ్, పృథ్విరాజ్‌లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్గా అనైక నటించారు. వసంతబాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. వేదిక తన అనుభవాలను చెప్పింది. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు నటించే చాన్సు చాలా తక్కువమందికే లభిస్తుం ది. ఆ విధంగా చూస్తే నేను చాలా లక్కీ. పరదేశి చిత్రంలో కొండప్రాంత వాసిగా నటనకు అవకాశం వున్న పాత్ర పోషించాను. ఆ పాత్ర కోసం నా రూపురేఖలన్నీ మార్చుకుని నటించాను. చాలామంది అభినందనలు పొందా ను. తాజా చిత్రం కావ్యతలైవన్ చిత్రంలో రంగస్థల నటిగా నటించాను. ఇది 1930 ప్రాంతంలో జరిగే నాటకాల బృందం ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం. నిజం చెప్పాలంటే ప్రఖ్యాత నటీమణి కె.పి.సుందరాంబాల్ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన పాత్ర ఇది. 1940 ప్రాంతంలో నాటకా ల్లో స్త్రీ పాత్రల్ని కూడా మగవారే పోషించేవారు. అలాంటి పరిస్థితిలో నాటకాల్లో నటించడానికి ముందుకొచ్చిన తొలి నటీమణి కేపీ సుందరాంబాల్. కావ్యతలైవన్ చిత్రం లో నటించడానికి ముందు ఈ విషయం తెలుసుకున్నాను. అయితే ఈ తరహా పాత్రలో నటించడం అంత సులభం కాదు అని అనుభవపూర్వకంగా గ్రహించాను. ధరించే దుస్తుల నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేకప్ కోసం గంటల సమయం వెచ్చించాను. ఈ చిత్రంలో నటించేముందు పాత క్లాసికల్ చిత్రాలు పలు తిలకించాను. కావ్యతలైవన్ చిత్రం లో నటించడం చాలా కొత్త అనుభ వం. చిత్రం చూసే ప్రేక్షకులకు వినూత్న అనుభవం కలుగుతోందనే నమ్మకం ఉంది. మరో విషయం ఏమిటంటే రంగస్థల కళాకారుల ఇతివృత్తం అనగానే ఇదేదో సీనియర్ డ్రామాతో కూడిన చిత్రం అనుకుంటారు. సహనటులు సిద్ధార్థ్, పృథ్విరాజ్‌ల గురించి చెప్పాలంటే చాలా డెడికేటెడ్‌గా శ్రమించి నటించారు. వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో చిత్రంలో మంచి అవుట్‌పుట్ వచ్చింది. ప్రముఖ నృత్యదర్శకుడు రఘురాం కన్నుమూసే ముందు ఈ చిత్రంలో నా పరిచయం పాటకు నృత్య దర్శకత్వం వహించారు. కావ్యతలైవన్ నా సినీ కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నానని వేదిక పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్‌కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ఉండాలి
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్‌కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement