breaking news
van hits
-
టమాటాల వ్యాను బోల్తా.. ఎగబడ్డ జనం
హజారీబాగ్: టమాటాల లోడుతో వస్తున్న వ్యాను బోల్తా పడగా అందులోని టమాటాల కోసం జనం ఎగబడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి కొంత సరుకును మాత్రం తిరిగి స్వా«దీనం చేసుకోగలిగారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. నేపాల్ నుంచి టమాటాల లోడుతో వస్తున్న వ్యాను ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో బిహార్‌లోని రాంచీ–పట్నా హైవేపై చర్హి వ్యాలీ వద్ద పల్టీ కొట్టింది. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వ్యాను బోల్తా పడి అందులోని టమాటాలు రోడ్డుపై పడిపోయాయి. ఇంకేముంది..? టమాటాల ధర కిలో వందల్లో ఉన్న వేళ..ఈ ఘటన సమీప గ్రామస్తులకు అనుకోని వరంలా మారింది. వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. సంచులు, డబ్బాలతో టమాటాలు ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. వ్యాను డ్రైవర్, క్లీనర్ అడ్డుకున్నా వారు లెక్కచేయలేదు. అయితే, ఈ గందరగోళంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గ్రామస్తులు ఎత్తుకెళ్లిన టమాటాల్లో చాలా వరకు తిరిగి రాబట్టారు. -
తప్పిన ముప్పు
ఉంగుటూరు : జాతీయ రహదారిపై బాదంపూడి వై.జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఇద్దరికిS స్వల్పగాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన బస్సు ద్వారకాతిరుమల నుంచి తాడేపల్లిగూడెం వస్తుండగా వై.జంక్షన్ వద్ద విశాఖపట్నం నుంచి నెల్లూరు వెళ్తున్న వ్యా¯Œæను ఢీకొంది. ఆర్టీసీ బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వ్యాన్ డ్రైవర్ అపోజు, మరో ప్రయాణికుడు గౌతం మరళీ గాయపడ్డారు. వీరిలో గౌతంను 108లో తాడేపల్లిగూడెం తరలించారు. ఘటనాస్థలానికిS తాడేపల్లిగూడెం ఆర్టీసీ మేనేజర్ కుమార్ వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జయింది. బస్సు ఢీకొన్న వ్యాన్ ముందుకు దూసుకుపోవడంతో బస్సు వెనుక భాగం దెబ్బతింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.