-
ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం
‘‘మా సినిమాకి తొలిరోజు మిక్డ్స్ టాక్ వచ్చింది. తర్వాత వెంటనే యావరేజ్ అన్నారు. చిన్నవాళ్లం.. అందరూ ఆశీర్వదించండి. మరిన్ని సినిమాలు చేసేలా ప్రోత్సహించండి’’ అని సప్తగిరి అన్నారు. ఆయన హీరో గా, వైభవీజోషి కథానాయికగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. అర్చన కీలక పాత్రలో నటించారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర, జి.ఎన్.రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సప్తగిరి మాట్లాడుతూ– ‘‘మన బడ్జెట్‌ను, మన టార్గెట్‌ను రీచ్ అయ్యామని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్యగారు చెప్పడంతో హ్యాపీ. పరిశ్రమలో నిర్మాతలది దైవస్థానం. మా నిర్మాతలు జి.ఎన్.రెడ్డి, నరేంద్రగారికి ధన్యవాదాలు. సెకండాఫ్‌లో 10 నిమిషాలు తగ్గిస్తున్నాం. ఇక 100 శాతం గ్రాండ్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా భారీ హిట్ అవ్వాలని మేం కోరుకోలేదు. కానీ మా శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలని మాత్రం కోరుకున్నాం.. అది దక్కినందుకు అందరం తృప్తిగా ఉన్నాం. సప్తగిరిలాంటి హీరోను నమ్ముకుంటే కచ్చితంగా 200 కుటుంబాలు బతుకుతాయి’’ అన్నారు నిర్మాత నరేంద్ర. ‘‘వజ్ర కవచధర గోవింద’ సినిమాని 400 థియేటర్లలో విడుదల చేశాం. 2 రోజులకు రూ.90లక్షల గ్రాస్ వసూలు చేసింది’’ అన్నారు బ్రహ్మయ్య. ‘‘కాలేజ్, స్కూల్ ఓపెనింగ్ టైమ్‌లోనూ మా సినిమా ఇంత బాగా ఆడుతోంది. థియేటర్లలో జనాలు నవ్వుతుంటే ఆనందంగా ఉంది’’ అని అరుణ్ పవార్ అన్నారు. ‘‘ఈ సినిమాలో నల్లూరి ప్రసన్నలక్ష్మీ అనే ఎమ్మెల్యేపాత్ర చేశాను’’ అన్నారు అర్చన. -
‘వజ్ర కవచధర గోవింద’ మూవీ రివ్యూ
టైటిల్ : వజ్ర కవచధర గోవింద జానర్ : కామెడీ డ్రామా తారాగణం : సప్తగిరి, వైభవీ జోషి, జస్పర్, అర్చన, విరేన్ తంబిదొరై సంగీతం : బల్గానిన్ దర్శకత్వం : అరుణ్ పవర్ నిర్మాత : నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సప్తగిరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా వజ్ర కవచధర గోవింద. సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాను తెరకెక్కించిన అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడి స్టార్‌ను మాస్ హీరోగా మార్చిందా..? హీరో పాత్రకు సప్తగిరి ఎంతవరకు న్యాయం చేశాడు..? కథ : సోమల అనే చిన్న గ్రామంలో ఉండే గోవింద్(సప్తగిరి) తన గ్రామ ప్రజలు పడే కష్టాలు చూడలేక దొంగగా మారతాడు. ఊళ్లో ఒక్కొక్కరు క్యాన్సర్‌తో చనిపోతుండటంతో వారిని కాపాడేందుకు చాలా డబ్బు కావాలనే ఉద్దేశంతో ఓ నిధిని వెతికేందుకు కొంతమందితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ ప్రయత్నంలో వారికి 150 కోట్ల విలువైన మహేంద్ర నీలం అనే వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రాన్ని అమ్మి పంచుకోవాలనుకుంటారు గోవింద్ అండ్ బ్యాచ్. అయితే వజ్రాన్ని ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టిన గోవింద్ ఓ ప్రమాదంలో గతం మర్చిపోతాడు. వజ్రాన్ని దాచిన చోటు కూడా మర్చిపోతాడు. చివరకు గోవింద్‌కు గతం గుర్తుకు వచ్చిందా..? వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చాడా..? ఈ కథతో బంగారప్పకు ఉన్న సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : కమెడియన్‌గా ఆకట్టుకున్న సప్తగిరి హీరోగా ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోయాడు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో సప్తగిరి నటన తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు ఏ మాత్రం సూట్ అయినట్టుగా అనిపించదు. కామెడీ సీన్స్‌లో ఆకట్టుకున్నా.. అది పూర్తిగా సినిమాను నిలబెట్టే స్థాయిలో లేదు. హీరోయిన్ పాత్రకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేకపోవటంతో వైభవీ జోషికి నటనకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. లుక్ పరంగానూ వైభవీ ఆకట్టుకోలేకపోయారు. విలన్‌గా జస్పర్ లుక్ బాగుంది. ఇతర పాత్రలో అర్చన, టెంపర్ వంశీ, జాన్ కొట్టోలి, విరేన్ తంబిదొరై తమ పరిధి మేరకు పరవాలేదనిపించారు. విశ్లేషణ : సప్తగిరికి మాస్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు అరుణ్ పవార్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడు. సప్తగిరి ఇమేజ్ను పట్టించుకోకుండా ఇంట్రో సాంగ్, స్లోమేషన్ షాట్స్, యాక్షన్ సీన్స్‌తో సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల విషయంలోనూ దర్శకుడు తడబడ్డాడు. హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు, అసలు కథ మొదలయిన తరువాత కూడా కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోగా అసలు కథకు బ్రేకులు వేస్తూ విసిగిస్తాయి. సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. సంగీతం, ఎడిటింగ్, నిర్మాణ విలువలు నిరాశపరుస్తాయి. ప్లస్ పాయింట్స్ : కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథా కథనాలు దర్శకత్వం ఎడిటింగ్ నిర్మాణ విలువలు - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
న్యూ ఇయర్‌ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)
కేజీ కుంకుమపువ్వు రూ.4.95 లక్షలు - ఎందుకింత రేటు తెలుసా?
ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు
తప్పక చదవండి
- నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్‌కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement