breaking news
Vacancy reserve
-
వీఆర్ కూడా పోస్టింగేనా.. జీతాలేవి మరి..!
సాక్షి, అమరావతి: ‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉండటం కూడా పోస్టింగే. వీఆర్ అన్నది శాంక్షన్ పోస్టే’ అని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేసిన వ్యాఖ్యలపై ఆ శాఖ సిబ్బంది, అధికారులు వారి కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ‘వీఆర్‌లో ఉండటం కూడా పోస్టింగే అయితే... మరి జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలతో దేశ చరిత్రలోనే ఎన్నడూలేని రీతిలో భారీగా ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని అత్యున్నతాధికారి అయిన డీజీపీ గుప్తా బహిరంగంగా సమరి్థంచడంపై మండిపడుతున్నారు. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మల్లా పనిచేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీ గుప్తా వ్యాఖ్యలు ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారాయి.వేధించడం ఏవిధంగా సమర్థనీయం డీజీపీ..!?పోలీసుల సంక్షేమం, గౌరవాన్ని పరిరక్షించాల్సిన డీజీపీ గుప్తా మాత్రం చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రను వెనకేసుకురావడంపై పోలీసువర్గాలు గళం విప్పుతున్నాయి. వీఆర్ శాంక్షన్ పోస్టే అయితే వారికి ప్రతినెలా జీతం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. కనీసం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఈ ఐదు నెలల్లో అయినా వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులకు జీతాలు చెల్లించారా.. అని సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రభుత్వంలో ఏ ఇతర శాఖలో లేని రీతిలో భారీ సంఖ్యలో అధికారులను వెయిటింగ్లో ఉంచడం, జీతాలు చెల్లించకుండా వేధించడం ఏవిధంగా సమర్థనీయమో డీజీపీ గుప్తానే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల చేతుల్లో పావుగా మారిన డీజీపీ కనీసం ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయకుండా ఉండాల్సిందని, పోలీసులు కీలు బొమ్మలు కాదని అభిప్రాయపడుతున్నాయి. వీఆర్‌లో పోలీసు అధికారులకు పోస్టింగులు ఇప్పించే బాధ్యత తీసుకోలేకపోయినా కనీసం వారికి నైతిక మద్దతు కూడా ఇవ్వకపోవడం డీజీపీ స్థాయి అధికారికి తగదని విమర్శిస్తున్నాయి. 199 మంది పోలీసు అధికారులకు వీఆర్!దేశ చరిత్రలోనే ఎన్నడూలేని స్థాయిలో వేధింపులు గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులతోపాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి మొత్తం మీద 199 మందికి పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ సంఖ్యలో పోలీసు అధికారులను వీఆర్‌లో ఉంచలేదు. నెలల తరబడి పోలీసు అధికారులను అవమానానికి గురి చేసింది. వారికి జీతాలు చెల్లింపు నిలిపివేసింది. అంతే కాదు వీఆర్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు డీజీపీ కార్యాలయంలో సంతకం చేయాలని, వెయిటింగ్ హాల్లో రోజంతా నిరీక్షించి సాయంత్రం 5 గంటలకు సంతకం చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం విభ్రాంతి కలిగించింది. ఇప్పటికీ ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామ్‌రెడ్డి, వై.రవిశంకర్‌రెడ్డి, పి.జాషువా, వై.రిషాంత్ రెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు వీఆర్‌లోనే ఉన్నారు. పోలీసు అధికారులను దీర్ఘకాలం వీఆర్‌లో ఉంచొద్దని రాజస్థాన్ హైకోర్టు కూడా ఇటీవల తీర్పు/నిచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రతో వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోంది. -
మహిళపై కన్ను.. వీఆర్‌కు శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్
సాక్షి, నల్గొండ జిల్లా: శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ మహిళ మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వేధింపుల ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కి పిలిపించి టీ పెట్టించారని.. చికెన్ ఫ్రై, చేపల కూడా వండటం వస్తే బయట కలుద్దామంటూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ మెసేజ్ చేశాడంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. విచారణ పేరుతో గంటన్నర సేపు తన రూమ్‌లో నిలబెట్టి నానా మాటలు అన్నాడు. ఏదన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేయమన్నాడు. ఇక్కడి విషయాలు ఎవరికన్నా చెప్తే నీతో పాటు కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. తనపైనే కుల సంఘాల నేతలతో దుష్ర్పచారం చేయిస్తున్నాడు’’ అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
జంట హత్యల కేసు ఎఫెక్ట్ : వీఆర్‌కు డీఎస్పీ ?
అనంతపురం సెంట్రల్: అనంతపురం రుద్రంపేటలో ఇటీవల జరిగిన జంట హత్యల కేసులో మరో పోలీస్ అధికారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ప్రమేయం లే కుండా నిందితులను అదుపులోకి తీసుకున్న ఓ డీఎస్పీని వీఆర్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. అత్యంత వి శ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... రౌడీషీటర్లు గోపీనాయక్, వెంకటేష్‌నాయక్ హత్యకేసులో బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి న సంగతి తెలిసిందే. వారిలో అమర్, చంద్ర, పోతులయ్య, రాములు సోమవారం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మహబూబ్‌బాషా ఎదుట లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇందుకు గతంలో కాం గ్రెస్ పార్టీలో ఉంటూ ప్రస్తుతం తట స్తంగా ఉన్న ఓ మైనారిటీ నేత మధ్యవర్తిత్వం వహిం చినట్లు తెలిసింది. నిందితులు లొంగిపోవడంతో పాటు వారిని మీడియాతో మాట్లాడించినట్లు బయటకు వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ రాజశేఖరబాబు, ఉన్నతాధికారులు ఓ డీఎస్పీని వీఆర్‌కు పంపాలని నిర్ణయించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పోలీస్‌శాఖలో ఈ అంశం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే నాల్గవ పట్టణ సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ హేమంత్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. డీఎస్పీని వీఆర్‌కు పంపనున్నారనే అంశం పోలీస్ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. మధ్యవర్తిత్వం వహించిన సదరు మైనారిటీ నేతను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం. వారితో ఇతర సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
వీఆర్‌కు ఇటుకపల్లి సీఐ, రాప్తాడు ఎస్ఐ
అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి హత్య నేపథ్యంలో.. ఇటుకపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారిద్దరినీ వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ డీఐజీ బాలకృష్ణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.