breaking news
universal strike
-
కార్మికుల హక్కులను కేంద్రం హరిస్తోంది..
సాక్షి, విజయవాడ: ఈ నెల 8న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె, రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ మద్దతు ప్రకటించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కనీస వేతనాలపై కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. 8న విజయవాడ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరుకు వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల నుండి కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. సమ్మెలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ సభ్యులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఎం నేత ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే..ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెకు వామపక్షాలు మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె
విజయవాడ(గాంధీనగర్) : కార్మికుల సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు , సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ సమ్మెకు సన్నద్ధంలో భాగంగా ఈనెల 16న అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లా, పట్టణాల స్థాయిలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు అన్ని పట్టణాలలో ఫ్యాక్టరీ గేట్ల వద్ద సభలు, పాదయాత్రలు, ప్రచార యాత్రలు నిర్వహించాలని, ఈనెల 31న సమ్మెపై ప్రచారం చేస్తూ బైక్ ర్యాలీలు అన్ని పట్టణాల్లో నిర్వహించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 2న పెద్ద ఎత్తున కార్మికులు సమ్మెలో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బి.వెంకటసుబ్బయ్య(ఐఎన్టీయూసీ), పి.పోలారి (ఇఫ్టూ), పి.రామ్‌దేవ్, చలసాని వెంకటరామారావు (ఏఐటీయూసీ), బరబన నాగేశ్వరరావు, ఆసుల రంగనాయకులు పాల్గొన్నారు.