breaking news
UK political helm
-
ప్రధానీ.. ప్లీజ్ రాజీనామా చేయండి!!
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, 14 ఏళ్ల కన్జర్వేటివ్‌ల పాలనకు చరమగీతం పాడిన లేబర్ పార్టీ.. ఏడాది తిరగకముందే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. స్థానిక, ప్రాంతీయ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ప్రధాని కీర్ స్టార్మర్‌పై సొంత పార్టీ నేతలే కత్తిగట్టారు. ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని 70 మందికి పైగా ఎంపీలు, సీనియర్ క్యాబినెట్ మంత్రులు డిమాండ్ చేయడం ఇప్పుడు బ్రిటన్‌లో సంచలనంగా మారింది.ముదురుతున్న సంక్షోభంఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా వేల్స్ పార్లమెంటుపై 1999 నుంచి ఉన్న పట్టును కోల్పోయి, ‘ప్లాయిడ్ సిమ్రూ’కు అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. అటు స్కాట్లాండ్లోనూ పార్టీ ప్రాభవం తగ్గడం, రిఫార్మ్ యూకే, గ్రీన్ పార్టీలు పుంజుకోవడంతో స్టార్మర్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.మంత్రుల ఒత్తిడివిదేశాంగ మంత్రి యెవెట్టే కూపర్, అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ వంటి కీలక నేతలు ఇప్పటికే స్టార్మర్తో చర్చలు జరిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీ జరగాలని వారు సూచించినట్లు సమాచారం.సహాయకుల రాజీనామానలుగురు కీలక మంత్రుల పార్లమెంటరీ సహాయకులు (జో మోరిస్, టామ్ రట్లాండ్, మెలానియా వార్డ్, నౌషాబా ఖాన్) తమ పదవులకు రాజీనామా చేస్తూ.. స్టార్మర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని బహిరంగంగా విమర్శించారు.గండం గట్టెక్కేనా?లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం.. అధికారికంగా నాయకత్వ మార్పు కోసం ఓటింగ్ జరగాలంటే కనీసం 81 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం 70 మందికి పైగా సభ్యులు వ్యతిరేకిస్తుండటంతో, మరో పది మంది తోడైతే స్టార్మర్ కుర్చీకి ప్రమాదం తప్పదు. 2029 సాధారణ ఎన్నికల నాటికి స్టార్మర్ సారథ్యంలో పార్టీ గెలవడం అసాధ్యమని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు."ప్రధానిపై ప్రజలకు విశ్వాసం సడలిందని స్పష్టమవుతోంది. ఈ మార్పుకు ఆయన నాయకత్వం వహించలేరు" అని వెస్ స్ట్రీటింగ్ పార్లమెంటరీ సహాయకుడు జో మోరిస్ వ్యాఖ్యానించారు.తగ్గని స్టార్మర్.. వారసులెవరు?ఎంత ఒత్తిడి వచ్చినా తాను వెనక్కి తగ్గేది లేదని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. "నాపై సందేహాలు ఉన్నాయని తెలుసు, వాటిని పటాపంచలు చేస్తాను. నేను బాధ్యతల నుంచి పారిపోను" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి, ఇంధన సంస్కరణలు, ఐరోపాతో సత్సంబంధాలే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన మద్దతుదారులకు హామీ ఇచ్చారు.రేసులో వీరేనా?ఒకవేళ స్టార్మర్ దిగిపోవాల్సి వస్తే.. ఆయన స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ లేదా మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక స్తబ్దత మధ్య స్టార్మర్ ఈ గండాన్ని ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. -
ప్రీతి పాటిల్‌కు కేబినెట్ హోదా
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి కామెరాన్ కేబినెట్లో మంత్రిగా ప్రవాస భారతీయురాలు ప్రీతి పాటిల్(43) నియమితులయ్యారు. గత మే 7న జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఘనవిజయం సాధించి కామెరాన్ మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టిన విషయం విదితమే. ఇదే ఎన్నికల్లో పలువురు ప్రవాస భారతీయులు విజయం సాధించారు. వీరిలో ఒకరైన ప్రీతి పాటిల్ ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సహాయ మంత్రి అయిన ఈమెకు కేబినెట్ హోదా కల్పించారు. గత కేబినెట్లో ఇదే శాఖను నిర్వహించిన ఎస్తేర్ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. ఎస్సెక్స్‌లోని విథం నుంచి ప్రీతి భారీ మెజారిటీతో రెండోసారి విజయం సాధించింది. తన నియామకం విషయాన్ని ఆమె ట్విటర్లో పోస్టు చేశారు.


