ugadi puraskar
-
‘మన్యం ధీరుడు’కి ఉత్తమ చిత్ర అవార్డు
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డు 2026 గాను ఆర్ వి వి సత్యనారాయణ నటించి నిర్మించిన చిత్రం మన్యం ధీరుడు కు ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డును మన్యం ధీరుడు చిత్రానికి ఇవ్వడం జరిగింది. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఆర్ వి వి సత్యనారాయణ మరియు శ్రీమతి ఆర్ పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కార ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు సుబ్రమణ్యం రామానాయుడు కమిటీ మెంబర్స్ 600 మంది తెలుగు సంఘం సభ్యులు పాల్గొన్నారు.ముఖ్యఅతిథి పోలీస్ కమిషనర్ విజయరావు మాట్లాడుతూ మన తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గాధను మన్యం ధీరుడు పేరును తరికెక్కిచ్చిన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఆర్ వి వి సత్యనారాయణకు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సినిమాలో దేశభక్తిని చాటుతూ ఒక దేశభక్తి గీతాన్ని ఆలపించి ఆ గీతం భారతదేశంలో ప్రతి పౌరుడు ఆలపించే విధంగా ఆ పాటను తీర్చిదిద్దారు ఆర్ వి సత్యనారాయణ గారు అని కొనియాడారు. -
మ్యూజికాలజిస్ట్ రాజాకు ఉగాది పురస్కారం
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర సంగీతంపై విశ్లేషణలు చేస్తున్న మ్యూజికాలజిస్ట్ రాజాకు ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం అందజేసింది. హైదరాబాద్కు చెందిన రాజా నలభై ఏళ్లుగా సినిమా పాటలపై పరిశోధనలు చేస్తున్నారు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషలకు చెందిన నలభై వేలకు పైగా పాటల సమాచారాన్ని వెలికితీశారు. మహారాష్ట్ర గవర్నర్ సీ.హెచ్. విద్యాసాగరరావు చేతుల మీదుగా ఉగాది పుర స్కారంతో పాటు విశ్వప్రతిభా పురస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ–‘‘ తెలుగు సినిమా పాటలకు సంబం«ధించిన పూర్తి వివరాలు ప్రతి శ్రోతకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పరిశోధన ప్రారంభించానన్నారు. తన పరిశోధనకు సంబంధించిన పాటలను రాజా మ్యూజిక్ బ్యాంక్.కామ్ (rajamusicbank.com) వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా తెలుగు సినిమా పాటలపై ప్రభుత్వం ఓ కమిటీ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తన జీవితం తెలుగు సినిమా పాటకు అంకితమని ఆయన పేర్కొన్నారు.


