breaking news
Udaybhanu
-
ప్రలోభాలు కాదు, ప్రగతి కోసం ఓటేద్దాం: ఉదయభాను
-
లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందించే ప్రముఖ యాంకర్ ఉదయభాను పరిచయం అవసరం లేని సెలబ్రిటీ. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉదయ భాను మరోసారి ట్రెండింగ్లో నిలిచారు. గ్రేటర్ పోరులో ఓటు హక్కు వినియోగంపై ఆమె అద్భుతంగా మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అమ్ముకుంటే జరిగే పరిణామాలపై తనదైన శైలిలో అనర్గళంగా చెప్పుకొచ్చారు. ఓటు మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం అంటూ కొత్త భాష్యాన్ని చెప్పుకొచ్చారు. మాటల, అంకెల గారడీలో నాయకులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వైనాన్ని కనిపెట్టాలని సూచించారు. ఓటును నిర్వీర్యం చేయొద్దు...ఓటు వేసి తీరదాం అంటూ ఫేస్బుక్ లో ఒక వీడియోను ఉదయ భాను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో మీకోసం... -
సినిమా రివ్యూ: మధుమతి
తెలుగు తెరపై అడపాదడపా అతిధి పాత్రలతో తళుక్కుమంటున్న టాప్ యాంకర్ ఉదయభాను ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'మధుమతి'. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ శ్రీధర్ దర్శకుడు. విడుదలకు ముందే చిన్నపాటి వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన శృంగార భరిత చిత్రం 'మధుమతి' డిసెంబర్ 13వ తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద చిత్రాల అలికిడి లేని నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ: కార్తీక్ ఓ కంపెనీ యజమాని.. ప్రేమ, పెళ్లి అంటేనే చిరాకు పడే కార్తీక్ ఆడవాళ్లకు ఆమడ దూరంలో ఉంటాడు. పెళ్లి చేసుకోవాలంటూ ఇంట్లోవాళ్లు బలవంతం పెట్టడంతో తనకు పెళ్లయిపోయిందని అబద్దం ఆడుతాడు. దాంతో భార్యను చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో మధుమతి అనే వేశ్యను భార్యగా నటించాలని కొ్న్ని రోజుల కోసం ఒప్పందం కుదుర్చుకుంటాడు. మధుమతిని భార్యగా ఇంట్లోవాళ్లకు పరిచయం చేస్తాడు. మధుమతిలో మంచితనం, కార్తీక్ ప్రవర్తన తీరుతో ఇద్దరూ పరస్పరం ఇష్టపడతారు.వారి ఇష్టం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. కార్తీక్, మధుమతి విడిపోతారా, వారిద్దరి ప్రేమ కథ చివరికి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్లలో ఒకరైన ఉదయభాను మధుమతి పాత్రకు న్యాయం చేకూర్చింది. కీలక సన్నివేశాల్లో మధుమతిగా ఉదయభాను ఆకట్టుకుంది. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించేలా ఉదయభాను లేకపోయింది. ఈచిత్రంలో వ్యక్తిగతంగా మంచి మార్కులే సంపాదించుకుంది. కార్తీక్ పాత్రలో హీరోగా విష్ణుప్రియన్ ఆకట్టుకోలేకపోయారు. మధుమతి పాత్రనే ప్రధాన పాయింట్ గా నమ్ముకుని ఈ చిత్రాన్ని నిర్మించారు దర్శకుడు రాజ్ శ్రీధర్. అయితే తొలి భాగం ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ప్రభాస్ శ్రీను, కమెడియన్ వేణు హస్యం ఆకట్టుకోలేక అభాసుపాలైంది. దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో ట్విస్ట్ కన్విన్సింగ్ గా లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసే అంశం. కెమెరా పనితనం ఓకే అనిపించింది, మ్యూజిక్, ఇతర విభాగాలు సోసోగా ఉన్నాయి. ఈ చిత్రంపై నెలకొన్న వివాదాలు, చిత్ర నిర్మాతలపై ఉదయభాను హాట్ హాట్ వ్యాఖ్యలు మధుమతిని ఏమేరకు రక్షిస్తాయో వేచి చూడాల్సిందే.