breaking news
Two minor girls
-
ఇద్దరు బాలికల బలవన్మరణం
హైదరాబాద్: తల్లిదండ్రులు మందలిస్తున్నారనే కారణంతో అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ కథనం ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్, రమణమ్మ దంపతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో స్థిరపడ్డాడు. వీరికి వెనీల (17), అఖిల(16) సంతానం. వీరు ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. డిఫెన్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే వెంకటేశ్‌ను మూడు నెలల కోసం బాలాపూర్ ఆర్సీఐకి బదిలీ చేశారు. దీంతో వారు మూడు వారాల క్రితం కుటుంబంతో సహా వచ్చి మల్లాపూర్‌లోని శు¿ోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా కుమార్తెలు అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్తుండడంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ డ్యూటీకి, అతని భార్య కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలు వెంటిలేటర్ గ్రిల్స్‌కు చున్నీలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాసేపటికి ఇంటికి వచ్చి చూసిన రమణమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. గతంలో వెనీల బెంగళూరులో అదృశ్యం కావడంతో వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే తల్లిదండ్రులు మందలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
దీపావళి రోజు దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దీపావళి పండగ రోజు దారుణం జరిగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు మిఠాయిలు కొనిస్తామని తీసుకెళ్లి ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టారు. బుధవారం సాయంత్రం బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు మూడేళ్ల చిన్నారిని ఆడుకుంటుండగా.. ఓ యువకుడు (25) తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం పల్లవపురం ప్రాంతంలో మరో యువకుడు (20).. మోటార్ బైకుపై ఏడేళ్ల చిన్నారిని తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం
నాగపూర్: నాగపూర్ జిల్లాలో రెండు వేరువేరు సంఘటనలలో ఇద్దరు మైనరు బాలికలపై అత్యాచారం జరిగింది. పోలీసుల కథకం ప్రకారం జిల్లాలోని పిప్లా గ్రామంలో నిన్న సాయంత్రం తుషార్ మిస్కిన్ అనే యువకుడు 8 సంవత్సరాల బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి పొలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు తుషార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఐపిసి 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో సంఘటన దిఘోరి గ్రామంలో జరిగింది. సమిత్ సతిబాబ్నే అనే యువకుడు గత ఏడాది నుంచి 17 ఏళ్ల బాలికను బెదిరించి అత్యారం చేస్తున్నాడు. ఆ బాలిక గర్భవతి అయింది. పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దాంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమిత్ని అరెస్ట్ చేశారు. అతనిపై ఐపిసి సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు.