breaking news
tuesday night
-
లిఫ్ట్ ఇస్తామంటూ బంగారం చోరీ
పెదపాడు: ప్రయాణికుడిని కారులో లిఫ్ట్ ఎక్కించుకుని బంగారం చోరీ చేసిన సంఘటన పెదపాడు మండలం కొక్కిరపాడు అడ్డరోడ్డు వద్ద చోటుచేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూ రుకు చెందిన కంకిపాటి కృష్ణమూర్తి గుడివాడలోని కుమార్తె ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో హనుమాన్ జంక్షన్ సెంటర్లో దిగాడు. ఏలూరు వేళ్లేందుకు వేచి ఉండగా తెల్ల కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏలూరుకు వెళ్తున్నామని, వస్తారా అంటూ ఎక్కించుకున్నారు. కారును కలపర్రు టోల్గేట్ సమీపంలోని కొక్కిరపాడు అడ్డరోడ్డు వద్ద లోపలకు 50 మీటర్లు తీసుకువెళ్లి కృష్ణమూర్తి వద్ద ఉన్న నాలుగు బంగారు గాజులు, రెండు ఉంగరాలు, రెండు ఫోన్లు లాక్కుని ఉడాయించారు. దీంతో కృష్ణమూర్తి పెదపాడు పోలీసులను ఆశ్రయించాడు. పెదపాడు ఏఎస్సై ఎంవీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పిన ముప్పు
ఉంగుటూరు : జాతీయ రహదారిపై బాదంపూడి వై.జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఇద్దరికిS స్వల్పగాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన బస్సు ద్వారకాతిరుమల నుంచి తాడేపల్లిగూడెం వస్తుండగా వై.జంక్షన్ వద్ద విశాఖపట్నం నుంచి నెల్లూరు వెళ్తున్న వ్యా¯Œæను ఢీకొంది. ఆర్టీసీ బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వ్యాన్ డ్రైవర్ అపోజు, మరో ప్రయాణికుడు గౌతం మరళీ గాయపడ్డారు. వీరిలో గౌతంను 108లో తాడేపల్లిగూడెం తరలించారు. ఘటనాస్థలానికిS తాడేపల్లిగూడెం ఆర్టీసీ మేనేజర్ కుమార్ వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జయింది. బస్సు ఢీకొన్న వ్యాన్ ముందుకు దూసుకుపోవడంతో బస్సు వెనుక భాగం దెబ్బతింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.