breaking news
triggere
-
నేపాల్‌లో జల ప్రళయం.. 500 మంది గల్లంతు
కాట్మాండు: నేపాల్ జల ప్రయళం సృష్టించింది. మెరపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా వందలాది మంది స్థానికులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు వరదల్లో గల్లంతైనట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్ పర్యాటక బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పర్యాటకుల ఆచూకీ కోసం ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ ట్రావెల్ కంపెనీల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు పర్యాటక శాఖ గుర్తించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నారు. గల్లంతైన విదేశీ పర్యాటకులలో భారతీయులు అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక నివేదిక ప్రకారం.. నేపాల్ మెరుపు వరదలు సృష్టించిన బీభత్సంలో మొత్తం 100కి పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక నేపాల్ వరదలతో బిహార్,ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నేపాల్ త్రిసూలీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశాయి. స్థానికుల్ని సురక్షిత ప్రాంతాల వైపు తరలిస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలు వరద నీటిలో కొట్టుకుపోగా, 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.రసువా పర్వత జిల్లా పరిధిలోని శ్యాప్రు బేసి, తిమురే ప్రాంతాలు వరద ధాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భోటే కోశి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం ఉందని, నష్టం తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా అధికారి నరేంద్ర పరియార్ పేర్కొన్నారు.ఈ విపత్తుపై ప్రధాని బాలేంద్ర షా స్పందిస్తూ.. సహాయక చర్యల్లో పోలీస్, సైనిక బలగాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా, గల్లంతైన 28 మంది భద్రతా సిబ్బందిలో 19 మంది నేపాల్ పోలీస్ విభాగానికి, తొమ్మిది మంది ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్)కు చెందినవారు ఉన్నారు. రసువాగఢీ పోలీస్ పోస్టులోని 22 మందిలో 13 మంది ఆచూకీ లభించలేదు. శ్యాబ్రూబేసి ప్రాంతంలో ఆరుగురు పోలీసులు, తిమురే సరిహద్దు అవుట్‌పోస్ట్‌లోని 9 మంది ఏపీఎఫ్ జవాన్లు ఇంకా సంప్రదింపులకు అందలేదు. టిబెట్ నుంచి ఉద్భవించే భోటే కోశి నది నేపాల్‌లోని త్రిశూలి నదిలో కలిసి, అనంతరం భారత్‌లోకి గండక్ నదిగా ప్రవహిస్తుంది. సరిహద్దుల్లో వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం రక్షణ చర్యలను ముమ్మరం చేసింది.ఇది కూడా చదవండి: ‘వాళ్లు బెస్ట్ సీఎంలా?’.. సీజేపీ చీఫ్‌పై పూనావాలా ఆగ్రహం -
భారతీయులుగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ వివాదంలో చిక్కుకున్నారు. తాము అధికారంలోకి రాకముందు భారత్‌లో జన్మించినవారిగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారని చైనా, దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని సృష్టించాయి. 'ఏడాది కిందట మీరంతా భారతదేశంలో జన్మించినవారిగా చెప్పుకునేందుకు సిగ్గుపడేవారు. కానీ మా పరిపాలన వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు భారతదేశ ప్రతినిధులమని చెప్పుకునేందుకు గర్వపడుతున్నారు' అని మోదీ ట్విట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. మోదీ ఆయన స్థాయిని దిగజార్చుకుంటున్నారని పేర్కొంది. చెత్తరాజకీయాలకు పాల్పడకుండా ప్రధాని హోదాకున్న గౌరవాన్ని కాపాడాలని సూచించారు. అలాగే చాలామంది కూడా మోదీ ట్వీట్ పై విమర్శలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి ప్రధాని నరేంద్రమోదీనే అనుకుంటా అంటూ పలువురు పెదవి విరిచారు.


