breaking news
Traffic divertion
-
HYD: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శ్రీరామనవమి సందర్బంగా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారామ కళ్యాణ వేడుకలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కాగా, శ్రీరామనవమి సందర్బంగా శోభాయాత్ర జరగనుంది. నేడు(గురువారం) మధ్యాహ్నం 1 గంటలకు శోభాయత్ర ప్రారంభం కానుంది. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్, సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్, సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుల్లిబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా. రాత్రి 7 నుంచి 9 వరకు కాచి గూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. In view of Sri Rama Navami shobha yatra traffic diversions will be imposed in Hyderabad City on 30-3-2023 శ్రీరామ నవమి శోభ యాత్ర దృష్ట్యా 30-3-2023న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించబడతాయి.#sriramvavami2023 #TrafficDiversions #hyderabadcity pic.twitter.com/m4CBwmcC8C — Hyderabad City Police (@hydcitypolice) March 29, 2023 -
బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పరేడ్ నిర్వహించనున్న విజయసంకల్పసభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సభ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సభకు ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. కాగా, ప్రధాని మోదీ.. హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సభ అనంతరం ప్రధాని మోదీ.. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డును మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేష్టన్ వైపు వెళ్లే వాహనాలు.. లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్ మీదుగా దారి మళ్లించారు. ఉప్పల్, తార్నాక, చిలకలగూడ మీదుగా స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ మీదుగా బేగంపేట-పంజాగుట్ట రహదారిలో వాహనదారులు రావొద్దని పోలీసులు సూచించారు. సభ నేపథ్యంలో కార్లు, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ప్రాంతాలను కేటాయించారు. - జింఖానా గ్రౌండ్స్‌లో విఐపి పార్కింగ్. - పరేడ్ గ్రౌండ్స్ సభాస్థలి సమీపంలో వివిఐపి పార్కింగ్. - శామీర్‌పేట్, కరీంనగర్, సిద్దిపేట్ వారికి దోబిఘాట్‌లో పార్కింగ్. - నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సుచిత్ర, బాలనగర్ మీదుగా వచ్చేవారికి పోలోగ్రౌండ్స్‌లో పార్కింగ్. - వరంగల్, నల్గొండ, ఉప్పల్ నుండి వచ్చే వారికి రైల్ నిలయంలో పార్కింగ్. -మహాబూబ్ నగర్, రంగారెడ్డి, ట్యంక్ బండ్ వైపు నుండి వచ్చేవారికి నక్లెస్ రోడ్డులో పార్కింగ్. -
ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు: సీపీ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. 20 ఫ్లాటూన్లతో భద్రత ఏర్పాటు చేశామని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన బుధవారమిక్కడ పేర్కొన్నారు.