HYD: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్‌ డైవర్షన్‌ వివరాలు ఇవే..

Traffic Diversion In Hyderabad During Shri Ram Navami Shobha Yatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో శ్రీరామనవమి సందర్బంగా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారామ కళ్యాణ వేడుకలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కాగా, శ్రీరామనవమి సందర్బంగా శోభాయాత్ర జరగనుంది. నేడు(గురువారం) మధ్యాహ్నం 1 గంటలకు శోభాయత్ర ప్రారంభం కానుంది. 

శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా గోషామహల్‌, సల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. 

గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్, సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్, సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుల్లిబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా. రాత్రి 7 నుంచి 9 వరకు కాచి గూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top