breaking news
torture on ladies
-
మహిళను చెరబట్టాడు.. కుమార్తెపై కన్నేశాడు
మంగళగిరి: భర్త వదిలేసిన మహిళను చెరబట్టడమే కాక ఆమె కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాలని తల్లీ కుమార్తెలను చిత్రహింసలకు గురిచేస్తున్న కామాంధుడి ఉదంతమిది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు పోలీసులకు తెలిపిన వివరాలు.. మంగళగిరికి చెందిన గోలి సాంబశివరావు కొన్నేళ్లుగా భర్త వదిలేసిన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉండగా.. తల్లితోనే ఉంటోంది. డిగ్రీ చదువుతున్న ఆ యువతికి పెళ్లి చేసేందుకు తల్లి ప్రయత్నాలు చేస్తుండగా.. ఆమెపైనా కన్నేసిన సాంబశివరావు అడ్డుకుంటున్నాడు. చిన్నతనం నుంచీ తన తల్లితో ఉంటున్న సాంబశివరావును ఆ యువతి తండ్రిగానే పిలుస్తోంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనను కూడా పెళ్లి చేసుకుంటాననడంతో ఆ యువతి తట్టుకోలేక ఎదురుతిరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాంబశివరావు తల్లీ కుమార్తెలను వారం రోజులుగా ఇంట్లోనే ఉంచి చిత్రహింసలు పెట్టాడు. బుధవారం ఆ యువతిని బెల్ట్‌తో చితకబాదడంతో తట్టుకోలేకపోయిన తల్లీ కుమార్తెలు ఇంటి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించారు. -
‘అత్యాచారం, గర్భస్రావం ఇక్కడ నిత్యకృత్యం’
ప్యోంగ్యాంగ్: నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన గురించి ప్రపంచం అంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. కఠినమైన ఆంక్షల మధ్య జీవనం సాగిస్తున్న అక్కడి ప్రజల గురించి తల్చుకుంటే.. భయం వేస్తోంది. ఇక అక్కడి డిటెన్షన్ సెంటర్ల గురించి.. వాటిలో మగ్గుతున్న ఖైదీలు.. ప్రత్యేకించి మహిళల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిటీ ‘ఐ స్టిల్ ఫీల్ ది పెయిన్’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. డిటెన్షన్ కేంద్రాల్లో మహిళలు అనుభవించిన నరకం గురించి ఈ నివేదిక ప్రపంచానికి వెల్లడించింది. 2009 నుంచి 2019 వరకు దాదాపు 100 మంది మహిళలను ఈ డిటెన్షన్ కేంద్రాల్లో బంధించినట్లు నివేదిక తెలిపింది. వీరంతా ఉత్తర కొరియా నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ మహిళలు. విడుదలైన తర్వాత ఐక్యరాజ్యసమితి పరిశోధకులు వీరిని సియోల్‌లో అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేశారు. (నార్త్ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి!) దీనిలో బాధితులు నిర్భంద కేంద్రాల్లో తాము స్వచ్ఛమైన గాలి, నిద్ర, పగటి పూట ఎండ, మంచి ఆహారానికి కూడా నోచుకోలేదని వెల్లడించారు. దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం నిద్రాహారాలు మాని పని చేస్తూనే ఉన్నామన్నారు. వీరంతా అధికారుల చేతుల్లో తీవ్ర హింసలకు గురి కావడమే కాక అత్యాచారానికి కూడా గురయ్యారని నివేదిక తెలిపింది. పోలీసు అధికారులు తమను అంగట్లో ఆటబొమ్మల మాదిరి చూసేవారని బాధితులు వెల్లడించారు. హింస, దురాక్రమణ, అత్యాచారం, బలవంతపు గర్భస్రావం వంటి దారుణాలు ఈ కేంద్రాల్లో నిత్యకృత్యమని బాధితులు వెల్లడించారు. ఓ మహిళ యూఎన్ అధికారులతో మాట్లాడుతూ.. ‘డిటెన్షన్ కేంద్రంలో ఓ అధికారి నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను తిరస్కరిస్తే.. నిన్ను హింసిస్తాను.. అవమానాలకు గురి చేస్తాను.. ఒప్పుకుంటే నిన్ను ఇక్కడ నుంచి త్వరగా విడుదల చేయడానికి సాయం చేస్తానని చెప్పాడు’ అని నివేదిక వెల్లడించింది.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) ఉత్తర కొరియా ఈ నివేదికపై వెంటనే స్పందిచలేదు.. కానీ గతంలో మాత్రం ఈ మానవహక్కుల నివేదిక తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన కుట్ర అని విమర్శించింది. ఈ నివేదికలో పాలు పంచుకున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అధికారి డేనియల్ కొల్లింగే మాట్లాడుతూ.. ‘పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్యోంగ్యాంగ్‌పై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాం. స్వేచ్ఛ, శ్రేయస్సు సాధించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన దేశం దాటుతున్న వారిని బహిష్కరించవద్దని ఇతర దేశాలను కోరుతున్నాను’ అన్నారు. -
హింస... ఇక చాలు!
మహిళలు హింస నుంచి విముక్తులై స్వేచ్చా జీవులైనప్పుడు... విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలను అందుకోగలిగినప్పుడు... తమ కుటుంబాలను, దేశాలను ఉన్నత స్థితికి చేర్చగలుగుతారు. మార్పునకు చోదకశక్తులు కాగలుగుతారు. మహిళలపై హింస ఒక సార్వత్రిక సమస్య. ఈ వ్యాధి సోకని ప్రాంతం, దేశం ప్రపంచంలో లేదు. భయానకమైన ఈ సమస్యను పత్రికలు రోజూ గుర్తు చేస్తూనే ఉంటాయి. మీడియా కంటపడకుండా లక్షల మంది మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారు. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు నిర్బంధ లైం గిక కార్యకాలాపాలకు లేదా మరో విధమైన హింసకు బాధితులవుతున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అది గుర్తిస్తే మనమందరమూ కలిసి ఈ రుగ్మతను అంతమొం దించాల్సిన ఆవశ్యకత అర్థమవుతుంది. ఇంటిలో జరిగే హింస లేదా బహిరంగ వేధింపులుగా సాగే హింస... ఏదైనాగానీ ఆ చెర నుంచి మహిళలను, ఆడపిల్లలను విముక్తం చేయాలనే కర్తవ్యానికి మనం తిరిగి నిబద్ధులం కావాల్సి ఉంది. నవంబర్ 25 నుంచి పదహారు రోజులపాటూ నిర్వహిస్తున్న లైంగిక హింస వ్యతిరేక కార్యకలాపాలు ఆ అవకాశం కల్పించాయి. సగం జనాభాను నిర్లక్ష్యం చేసి, చిన్నచూపు చూసి, వివక్ష ప్రదర్శించి ఏ దేశమూ తన పూర్తి శక్తిసామర్థ్యాల మేరకు అభివృద్ధి చెందజాలదు. అందుకే లైంగిక సమానత్వం, మహిళా సాధికారత అమెరికా విదేశాంగ విధానంలో ఒక ముఖ్యాంశమ య్యాయి. ఇంటిలో మహిళలపై సాగే గృహహింస సర్వసాధారణమైనది, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదాని ప్రకారం శారీరకమైన గాయాల నుంచి దీర్ఘకాలికమైన మానసిక కుంగుబాటు వరకు సవాలక్ష ఆరోగ్య సమస్యలకు అది కారణమౌతోంది. గర్భిణులపై గృహహింస బరువు తక్కు వ శిశువుల పుట్టుకకు దారితీస్తోంది. ఇక హత్యలకు గుర య్యే మహిళల్లో 38 శాతం గృహహింసకు బలయ్యేవారే. లైంగిక హింస శారీరకంగానే కాదు, ఆర్థికంగా కూడా ప్రభావాన్ని చూపుతుంది. మహిళల ఆదాయాలను, పని తీరును ప్రభావితం చేస్తుంది. ఒంటరితనానికి గురై మహిళలు సరిగా పని చేయలేరు. తమపట్లే కాదు, పిల్లలపట్ల కూడా శ్రద్ధచూపలేరు. మహిళలపై హింసను నివారించడం వల్ల, హింసకు పాల్పడ్డవారిని శిక్షించడం వల్ల దీర్ఘకాలంలో అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. లైంగిక హింస సమస్యపై పలు దేశాలు చట్టాలను రూపొందించాయి. ఆ చట్టాల అమలు తీరును మెరుగుపరచటానికి కలసికట్టుగా కృషిచేయడమే ఆ తదుపరి వేయవలసి ఉన్న కీలకమైన ముందడుగు. ఈ ఏడాది మొదట్లో వర్మ కమిషన్ నివేదిక వెలువడింది, ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధిం పుల చట్టం-2013’ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ సమస్య పరిష్కారం దిశగా భారత్ ముఖ్యమైన ముందడుగు వేసిం ది. ప్రపంచవ్యాప్తంగా లైంగిక హింసను నిరోధించడానికి, ప్రతిస్పందించడానికి సంబంధించిన వ్యూహాన్ని అమెరికా ప్రభుత్వం 2012 ఆగస్టులో విడుదల చేసింది. లైంగిక హింస పరిష్కారానికి నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించి, వాటి సాధనకు అమెరికా నైపుణ్యాన్ని, శక్తిసామర్థ్యాలను అందించడానికి ముందుకు వచ్చింది. విధానకర్తలకు, క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి మధ్య మరింత సంసర్గం అవసరం. మహిళలు, ఆడపిల్లలు తమ సమస్యలపై నిలిచి మాట్లాడే విధంగా వారిని సాధికారం చేయడం, మగపిల్లలను వారు తమ అక్కచెల్లెళ్ల కోసం నిలిచి మాట్లాడే విధంగా చైతన్యవంతులను చేయడం అవసరం. అలాగే ఈ కృషిలో పురుషులను, మగపిల్లలను, సంఘ నాయకులను భాస్వాములను చేయాల్సి ఉంది. లైంగిక అసమానతలు మహిళలపట్ల హింసాత్మకతను, వివక్షాయుత విధానాలను నిశ్శబ్దంగా అనుమతిస్తాయి లేదా చురుగ్గా పెంపొందింపజేస్తాయి. కాబట్టి అంతిమం గా లైంగికపరమైన అసమానతలను పూర్తిగా అధిగమిం చాల్సి ఉంటుంది. ప్రజాస్వామిక సమాజాల నిర్మాణానికి, అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందింపజేయడానికి, విద్య, వైద్యరంగాలలోని సవాళ్లను అధిగమించడానికి మహిళా సాధికారత అవసరం. మహిళలు, ఆడపిల్లలు హింస నుంచి విముక్తులై స్వేచ్చా జీవులైనప్పుడు... విద్య, ఆరోగ్యం, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలను అందుకోగలిగినప్పుడు... వారు తమ కుటుంబాలను, సమాజాలను, దేశాలను సమున్నత స్థితికి చేర్చగలుగుతారు. మార్పునకు చోదకశక్తులు కాగలుగుతారు. మా విదేశాంగమంత్రి కెర్రీ అన్నట్టు ‘‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సౌ భాగ్యాన్ని, శాంతిని పెంపొందింపజేయడానికి చేసే కృ షిలో మహిళలపై పెట్టే పెట్టుబడులు కీలకమైన భాగం... ఆ బాధ్యతను నెరవేరిస్తేనే వారు సాధికారతగల తల్లులు గా, నేతలుగా, నవకల్పనల సృష్టికర్తలుగా మారుతారు.’’ (‘మహిళలపై హింస’ కేంద్ర అంశమైన ‘2013 ప్రపంచ మానవహక్కుల దినం’ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకం)