breaking news
topless selfie
-
'టాప్ లెస్ సెల్పీ' మహిళా పోలీసుకు ఆఫర్లే ఆఫర్లు!
ఓ మహిళా పోలీసు అధికారి టాప్ లెస్ గా దిగిన ఫోటో తన ఉద్యోగానికే ఎసరు తెస్తే.. మరోవైపు అదే ఫోటోను చూసిన మోడలింగ్ ఏజెన్సీలు తమ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ఆఫర్లు మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. వివరాలు.. మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా ఆనే మహిళ పోలీసు టాప్ లెస్ సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను కిందికు దించి రొమ్ము భాగం కనబడేలా సెల్ఫీ దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. అలా చేసినందుకు తనను తానే అసహ్యించుకుంటున్నానని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన ఇద్దరు కూతుళ్లు, భర్త, తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయిన విషయం తెలిసిందే. మరో వైపు నిదియా గార్సియా టాప్ లెస్ సెల్పీ చూసిన మోడలింగ్ ఏజెన్సీలు భారీ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. తాము నిర్వహించే ఫోటో షూట్లలో న్యూడ్‌గా కాకుండా ప్రొఫెషనల్‌గా మాత్రమే ఉంటాయని నిదియాకు ఆఫర్ ఇచ్చిన స్థానిక మోడలింగ్ సంస్థ సీఈఓ ఒకరు తెలిపారు. -
టాప్‌లెస్ సెల్ఫీ పంపిన మహిళా టీచర్
లండన్: టాప్‌లెస్ సెల్ఫీని విద్యార్థికి పంపిన బ్రిటీషు మహిళా టీచర్ పై ఐదేళ్ల నిషేధం విధించారు. లంకషేర్ లోని పార్క్ హైస్కూల్ పనిచేస్తున్న లిండా హార్వే(43)కు ఫేస్బుక్ ద్వారా 16 ఏళ్ల విద్యార్థితో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరూ ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సందేశాలు, ఫోటోలు ఇచ్చిపుచ్చుకున్నారు. లిండా టాప్‌లెస్ సెల్ఫీ ఫోటో కూడా ఇందులోవుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రవర్తనా నియమావళి సంఘం ఆమెపై ఐదేళ్ల నిషేధం విధించిందని డైలీ మెయిల్ వెల్లడించింది. ఆమె చర్య ఉపాధ్యాయ వృత్తిని అమానించేలా ఉందని పేర్కొంటూ ఈ చర్య తీసుకుంది. దీనిపై 2019 వరకు అప్పీలు చేసుకునే వీలు లేకుండా చేసింది.