breaking news
Top 10 Best Selling Models
-
మే నెలలో ఎక్కువ మంది ఈ కార్లనే కొన్నారు!
మే 2026లో దేశీయ విఫణిలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయించింది. ఈ బ్రాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలో ఆరు మోడళ్లకు స్థానం కల్పించింది. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేశాయి.అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ మే 2026లో 24,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మంచి మైలేజ్, సౌకర్యం, తక్కువ ధర కారణంగా ఇది వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది.రెండవ స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది. ఈ మోడల్ 20,686 యూనిట్ల అమ్మకాలతో 52 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది మార్కెట్లో హాట్ సెల్లింగ్ మోడల్‌గా మారింది.మూడవ స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే ఈ ఎంపీవీ 20,350 యూనిట్ల అమ్మకాలతో 26 శాతం వృద్ధిని సాధించింది.నాలుగవ స్థానంలో టాటా పంచ్ నిలిచింది. టాప్ 10 అమ్మకాల జాబితాలో ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ చోటు సంపాదించుకుంది. దీనికి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మోడల్ 20,208 యూనిట్ల అమ్మకాలు చేసి 54 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఐదవ స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తమ్ 19,100 యూనిట్ల అమ్మకాలతో 46 శాతం వృద్ధిని చూపింది.ఆరవ స్థానంలో మారుతి సుజుకి బాలెనో నిలిచింది. ఇది 18,396 యూనిట్లు అమ్ముడై, టాప్ 10లోనే అత్యధిక వృద్ధి రేటు (58%) సాధించింది.ఏడు, ఎనిమిది స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ చోటు సంపాదించుకున్నాయి. వీటి అమ్మకాలు వరుసగా 18,076.. 17,519 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎంట్రీ లెవల్, యూత్ సెగ్మెంట్లో ఇవి ఇప్పటికీ బలమైన డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి.తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. దీని క్లాసిక్, కొత్త వెర్షన్లు కలిపి 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. పదవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. కఠినమైన పోటీ ఉన్నప్పటికీ ఇది 15,253 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన పనితీరు చూపించింది.ఇదీ చదవండి: కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్! -
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారు
భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశీయ విఫణిలో అమ్మకానికి ఉన్న అన్ని కార్లూ.. గొప్ప విక్రయాలను పొందలేవు. కానీ కొన్ని కార్లు మాత్రం ఊహకందని రీతిలో అమ్ముడవుతాయి. ఈ కథనంలో ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లను గురించి తెలుసుకుందాం.దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్లో 2021లో 'పంచ్' పేరుతో మైక్రో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ కారు ఈ ఒక్క ఏడాది ఏకంగా 1.86 లక్షల సేల్స్ పొంది.. అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది. 2023లో 1.50 లక్షల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. టాటా పంచ్ సేఫ్టీ రేటింగులో 5 స్టార్స్ సొంతం చేసుకుని, అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా పంచ్ ధర రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో పంచ్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.2024లో (జనవరి నుంచి నవంబర్) అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు⮞టాటా పంచ్: 1,86,958 యూనిట్లు⮞హ్యుందాయ్ క్రెటా: 1,74,311 యూనిట్లు⮞మారుతి సుజుకి బ్రెజ్జా: 1,70,824 యూనిట్లు⮞మహీంద్రా స్కార్పియో: 1,54,169 యూనిట్లు⮞టాటా నెక్సాన్: 1,48,075 యూనిట్లు⮞మారుతి సుజుకి ఫ్రాంక్స్: 1,45,484 యూనిట్లు⮞మారుతి సుజుకి గ్రాండ్ విటారా: 1,15,654 యూనిట్లు⮞హ్యుందాయ్ వెన్యూ: 1,07,554 యూనిట్లు⮞కియా సోనెట్: 1,03,353 యూనిట్లు⮞మహీంద్రా బొలెరో: 91,063 యూనిట్లుఇదీ చదవండి: మరో ఖరీదైన కారు కొన్న జొమాటో సీఈఓ: ధర ఎన్ని కోట్లో తెలుసా? -
ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్..
♦ బెస్ట్ సెల్లింగ్ మోడల్ ♦ టాప్–10లో కార్లన్నీ 2 కంపెనీలవే న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘స్విఫ్ట్’ తాజాగా అదే కంపెనీకి చెందిన ‘ఆల్టో’ మోడల్‌ను వెనక్కు నెట్టింది. దేశీ మార్కెట్లో ఏప్రిల్ నెల వాహన విక్రయాల్లో ‘స్విఫ్ట్’.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవతరించింది. కాగా మారుతీ ఎప్పటిలాగే ఇండియన్ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కంపెనీకి చెందిన ఏడు కార్లు ‘టాప్–10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్’ జాబితాలోస్థానం దక్కించుకున్నాయి. ఇక మిగిలిన మూడు స్థానాలను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆక్రమించింది. కాగా జాబితాలో మరే ఇతర కంపెనీ మోడళ్లు లేకపోవడం గమనార్హం. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ♦ మారుతీ స్విఫ్ట్ విక్రయాలు ఈ ఏప్రిల్‌లో 23,802 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో స్విఫ్ట్ అమ్మకాలు 15,661 యూనిట్లుగా ఉన్నాయి. అంటే విక్రయాల్లో 52 శాతం వృద్ధితో ఈ మోడల్ జాబితాలో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ♦ ఇక ఎప్పుడూ టాప్‌లో ఉంటూవచ్చిన ఆల్టో ఈసారి రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. విక్రయాలు 36% వృద్ధితో 16,583 యూనిట్ల నుంచి 22,549కు పెరిగాయి. ♦ 2016 ఏప్రిల్‌లో ఆల్టో అగ్రస్థానంలో, స్విఫ్ట్ రెండో స్థానంలో ఉండేవి. కానీ ఇప్పుడు స్విఫ్ట్ తొలి స్థానానికి, ఆల్టో రెండుకు మారాయి. ♦ 17,530 యూనిట్ల విక్రయాలతో మారుతీ బాలెనో మూడో స్థానంలో ఉంది. ఇదే కంపెనీకి చెందిన వ్యాగన్–ఆర్ 16,348 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానం దక్కించుకుంది. ♦ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఐదవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,668 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 ఆరవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,001 యూనిట్లుగా ఉన్నాయి. ♦ మారుతీ విటారా బ్రెజా 10,653 యూనిట్ల అమ్మకాలతో 7వ స్థానంలో నిలిచింది.


