breaking news
tobbaco farmers
-
పొగాకు రైతులకు లాభాలు ... ఇది సీఎం జగన్ వల్లే సాధ్యం అయ్యింది
-
వాటి స్మగ్లింగ్‌తో రూ 13 వేల కోట్లు మసి
సాక్షి, న్యూఢిల్లీ : స్మగ్లింగ్‌కు కాదేదీ అనర్హమంటూ అక్రమార్కులు చెలరేగుతున్నారు. సరుకేదైనా అక్రమంగా సరిహద్దులు దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. సిగరెట్ స్మగ్లింగ్‌తో ఖజానాకు రూ 13,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని అఖల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సిగరెట్ పరిశ్రమలో అక్రమ వర్తకం వాటా 25 శాతం పైగా ఉంటుందని, అక్రమ సిగరెట్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందుతూ వేల కోట్ల ఆదాయానికి గండికొడుతోందని పేర్కొంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసి పొగాకు సాగుచేస్తున్న రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిపిన దాడుల్లో స్మగుల్డ్ సిగరెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేస్తున్నా దీనికి సంబంధించి సరైన డేటా ఉండటం లేదని పేర్కొంది.గత రెండేళ్లలో స్మగుల్డ్ సిగరెట్లను ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారన్న తమ ప్రశ్నలకు అధికారులు ఇంతవరకూ సమాచారం అందించలేదని ఆందోళన వ్యక్తం చేసింది. పొగాకుపై పన్నులను ఇటీవల ప్రభుత్వం భారీగా పెంచడంతో దేశంలో సిగరెట్ల స్మగ్లింగ్ పెరిగిందని పేర్కొంది. అక్రమంగా దేశం దాటుతున్న సిగరెట్లపై ఫైపా ప్రధాని కార్యాలయంతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖకూ లేఖలు రాసింది. సిగరెట్ స్మగ్లింగ్‌ను నీరుగార్చేలా పన్ను వ్యవస్థ ఉండాలని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. -
పొగాకు రైతులకు చేదు అనుభవం
ఏలూరు: పట్టిసీమ వద్ద పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ను కలిసేందుకు వచ్చిన రైతులకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లనివ్వకుండా అడ్డుకున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.