breaking news
tirupati collectorate
-
తిరుపతిలో కలకలం.. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. దీంతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం పోలీసులకు మెయిల్ రాగా, తిరుపతి కలెక్టరేట్‌ను బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్లో అన్ని విభాగాల సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు.. తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో బాంబు లేదని తేల్చడంతో కార్యాలయంమ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.కాగా, తిరుపతికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా కార్పొరేట్ హోటళ్లతో పాటు పలు ఆలయాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. గత నెల(ఫిబ్రవరి)లో ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాలలో హ్యూమన్ ఐఈడీ బాంబు పెట్టామంటూ ఆగంతుకుల నుంచి కళాశాల అధికారులకు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు, అధ్యాపకులు ఉలిక్కిపడ్డారు.వెంటనే కళాశాల అధికారులు తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గతంలో పలు మార్లు కళాశాలకు బాంబు బెదురింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఫేక్ సమాచారంగా తేల్చారు. -
చిత్తూరు కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధింపు
చిత్తూరు కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై నిరసన తెలిపేందుకు తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, వేలాదిమంది కార్యకర్తలు వస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ శుక్రవారమిక్కడ వెల్లడించారు. ఇందుకోసం జిల్లాకు వచ్చే అన్ని సరిహద్దుల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం తిరుపతి శేషాచలం అడవుల్లో 20మంది ఎర్రచందనం కూలీలు ఎన్ కౌంటర్ అయిన విషయం తెలిసిందే.