breaking news
ticket cancellations
-
ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా.. ఇది చదవండి!
దూర ప్రయాణాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్. శుభకార్యాలు, పండగలు, పనుల నిమిత్తం ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు సాధారణంగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటాం. అయితే ట్రైన్ జర్నీ చేయాలంటే ముందుగా టికెట్ రిజర్వు చేసుకోవాలి. పండగలు, సెలవులు, పెళ్లిళ్ల సీజన్లో రైలు టికెట్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతో వెయిటింగ్ లిస్టులు చాంతాడంత పేరుకుపోయి ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనే వెయిటింగ్ లిస్ట్‌లోని వారికి ప్రాధాన్యతా క్రమంలో టికెట్ దొరుకుతుంది. ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, వెయిటింగ్ లిస్ట్‌లోని టికెట్ కన్ఫామ్ కాకపోయినా డబ్బులు తిరిగి చెల్లిస్తుంది రైల్వే శాఖ. నిబంధనల మేరకు కొంత మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మాత్రమే ప్రయాణికులకు రిఫండ్ చేస్తుంది. టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వేకు భారీగానే ఆదాయం వస్తోందని తాజాగా వెల్లడైంది.టికెట్ల రద్దు.. పెద్ద పద్దే!సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. టికెట్ క్యాన్సిలేషన్స్ (ticket cancellations) ద్వారా గత నాలుగున్నరేళ్లలో దాదాపు రూ. 700 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. దక్షిణమధ్య రైల్వే వార్షిక ఆదాయంలో ఇది 3.5 శాతం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ వివరాలు రాబట్టింది. ప్రయాణికుల ద్వారా 2024-25లో దక్షిణమధ్య రైల్వేకు వచ్చిన ఆదాయం రూ. 5,710 కోట్లు. 2024లో 1.4 కోట్ల టికెట్లు క్యాన్సిల్ కాగా, ఇందులో 65 లక్షలు వెయిటింగ్లిస్ట్లోనివే. టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికుల సంఖ్య గత 4 ఏళ్లలో నాలుగింతలు పెరగడం గమనార్హం. 2021లో 15.96 లక్షల టికెట్లు క్యాన్సిల్ కాగా, 2024లో ఈ సంఖ్య 65.62 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు 31.52 లక్షల టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. రిఫండ్ ఎంత?రైల్వే నిబంధనల ప్రకారం.. కన్ఫామైన టిక్కెట్‌ను.. ప్రయాణానికి 12 నుంచి 48 గంటల ముందు రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25 శాతం మినహాయించుకుని మిగతా మొత్తం జమ అవుతుంది. ప్రయాణానికి 4 నుంచి 12 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే సగం మొత్తం మాత్రమే రిఫండ్ వస్తుంది. వెయిటింగ్‌లిస్ట్‌లోని టికెట్ కన్ఫామ్ కాకుంటే క్లరికల్ చార్జి కింద రూ. 60 తీసుకుని మిగతా మొత్తం తిరిగిచ్చేస్తారు.'రద్దు'డే రుద్దుడు!కాగా, రైల్వే శాఖ క్యాన్సిలేషన్ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. కన్ఫార్మడ్ టికెట్ బుక్ చేసినప్పుడు నామినల్ చార్జీలు తీసుకుంటున్నారని, మరి వెయిటింగ్‌లిస్ట్‌లోని టికెట్ కన్ఫామ్ కాకపోయినా క్లరికల్ చార్జి ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకేసారి ఎక్కువ టికెట్లు తీసుకోకుండా ఉండేందుకే క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. తమ జోన్ వార్షికాదాయంలో క్యాన్సిలేషన్ చార్జీల ద్వారా వచ్చే మొత్తం చాలా స్వల్పమని దక్షిణమధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.చదవండి: మెట్రో రైల్లో ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా?2024-25లో దక్షిణమధ్య రైల్వే ఆదాయ గణాంకాలుమొత్తం ఆదాయం: రూ.20,569 కోట్లుసరకు రవాణా: రూ.13,864 కోట్లుప్రయాణికులు: రూ. 5,710 కోట్లుపార్శిల్, టికెట్ చెకింగ్: రూ.513.6 కోట్లుపార్కింగ్, కేటరింగ్, యాడ్స్: 402.7 కోట్లు -
రూ. 13,000 టికెట్టుకి రూ. 20 రీఫండ్ - ఐఏఎస్ ఆఫీసర్ షాక్!
ఆధునిక కాలంలో విమాన ప్రయాణాలు సర్వ సాధారణం అయిపోతున్నాయి. కావున చాలామంది ఫ్లైట్ జర్నీ చేసేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొంత అమౌంట్ (రీఫండ్) తిరిగి వస్తుంది. అయితే ఇటీవల ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాహుల్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి తన ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ. 13,820 కాగా, క్యాన్సిల్ చేసుకున్న తరువాత అతనికి రీఫండ్ అయిన మొత్తం కేవలం రూ. 20 మాత్రమే. దీనిని అతని ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది. నిజానికి అతని టికెట్ ధర నుంచి ఎయిర్‌లైన్ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 11,800, జీఐ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 1200, జీఐ కన్వీనియన్స్ ఫీజు కింద రూ. 800 కట్ చేసి చివరకు రూ. 20 రీఫండ్ చేసారు. ఇది చూడగానే ఐఏఎస్ అధికారి కూడా హవాక్కయిపోయాడు. తిరిగి డబ్బు వెనక్కి రావాలంటే ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపైన నెటిజన్లు వారికి నచ్చిన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 -
జూన్ 30 వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లు రద్దు
న్యూఢిల్లీ: సాధారణ రైళ్లలో ప్రయాణానికి జూన్ 30వ తేదీ వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ గురువారం ప్రకటించింది. సాధారణ ప్రయాణికుల రైళ్లను జూన్ మాసాంతం వరకు నడిపే అవకాశం లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మే 1న ప్రారంభించిన శ్రామిక్ స్పెషల్ రైళ్లు, మే 12న ప్రారంభించిన ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని పేర్కొంది. మెయిల్/ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లలో ప్రయాణానికి లాక్డౌన్ కంటే ముందు, లాక్డౌన్ సమయంలో జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టికెట్లు రద్దవుతాయని, ప్రయాణికులకు టికెట్ మొత్తాన్ని వెనక్కి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. ఈ–టికెట్ల కొనుగోలుదారులు ఆన్లైన్లోనే రీఫండ్ పొందవచ్చు. లాక్డౌన్ నేపథ్యంలో సాధారణ రైళ్ల రాకపోకలను మార్చి 25 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. గమ్యస్థానం చిరునామా ఇవ్వాల్సిందే రైళ్లలో ప్రయాణించేవారు ఇకపై తాము చేరాల్సిన గమ్యస్థానం చిరునామాను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్న వారి నుంచి ఈ చిరునామాలను రైల్వేశాఖ ఇప్పటికే సేకరిస్తోంది. రికార్డుల్లో భద్రపరుస్తోంది. ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్లు తేలితే.. వారితో కలిసి ప్రయాణించిన వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రక్రియ ప్రారంభించింది. రైల్వేకు సంబంధించి ఎలాంటి బుకింగ్లకైనా గమ్యస్థానం చిరునామా తెలపాలని రైల్వేశాఖ అధికార ప్రతినిధి బాజ్‌పాయ్ చెప్పారు. రైళ్లలో ప్రయాణించినవారిలో 12 మందికి కరోనా సోకినట్లు గతంలో బయటపడింది. -
ఆన్లైన్లో రిఫండ్ స్టేటస్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు తాము రద్దు చేసుకున్న టికెట్ల రిఫండ్ స్టేటస్‌ను ఆన్లైన్లో తెలుసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం ట్ఛజunఛీ.జీnఛీజ్చీnట్చజీ ఠ్చీy.జౌఠి.జీn సైట్లోకి లాగిన్ అయ్యి పీఎన్ఆర్ నమోదు చేస్తే సరిపోతుంది. ఈ సదుపాయం ఆన్లైన్లో తీసుకున్న టికెట్లతోపాటు టికెట్ కౌంటర్ల వద్ద కొనుగోలు చేసిన టికెట్లకూ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. పారదర్శకతను ప్రోత్సహించేందుకు, వాపసయ్యే సొమ్ము కోసం ప్రయాణికులు ఎదురుచూడకుండా ఇది ఉపయోగపడుతుందని రైల్వే బోర్డ్ పబ్లిసిటీ డైరెక్టర్ వేద ప్రకాశ్ తెలిపారు. టికెట్లను ఆన్లైన్లో రద్దు చేసుకుంటే ఐదు రోజుల్లోగా ప్రయాణికుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుందనీ, అలాగే, కౌంటర్లలో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసుకు వారం రోజుల సమయం పడుతుందని అన్నారు. -
టికెట్ రద్దుకు నగదు రీఫండ్ లేదు
న్యూఢిల్లీ: చిన్న నోట్ల కొరత, బుకింగ్ కౌంటర్లలో పెరిగిన రద్దీతో టికెట్ రద్దుచేసుకునే వారికి నగదు తిరిగి చెల్లించడాన్ని రైల్వే శాఖ నిలిపివేసింది. బదులుగా ప్రయాణికులకు టికెట్ డిపాజిట్ రసీదులను జారీ చేస్తోంది. రీఫండ్ మొత్తం రూ.10 వేలు దాటితే ఆ సొమ్మును వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు బదిలీచేస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అందుకోసం టికెట్ రద్దుచేసుకునే సమయంలో ప్రయాణికుడు తన బ్యాంకుఖాతా వివరాలను అందించాలి. కౌంటర్ టికెట్ల అమ్మకాల్లో 13 శాతం పెరుగుదల వల్ల ఈ-టికెట్ వ్యాపారం రెండురోజుల్లో 10 శాతం పడిపోయింది. విమాన టికెట్లకు రిఫండ్ వద్దు రద్దైన పాత నోట్లతో విమానాశ్రయ కౌంటర్లలో తీసుకున్న టికెట్లను రద్దుచేయవద్దని కేంద్రం విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ టికెట్లకు సంబంధించి టికెట్లను రిఫండ్ కూడా చేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది. అవినీతిపరులు టికెట్లు బుక్ చేసుకున్నాక రద్దుచేసుకుని డబ్బులు తీసుకునే అవకాశముందన్న వార్తలతో డీజీసీఏ అప్రమత్తమైంది. దీంతో ఇలా పాత నోట్లతో టికెట్లు బుక్ చేసుకున్న వారి టికెట్లను రద్దుచేయవద్దని, రీఫండ్ కూడా చేయొద్దని ఆదేశించింది. దీంతో పలు సంస్థలు 48 గంటలకు ముందు టికెట్ తీసుకున్న ప్రయాణికులకు రీఫండ్, రద్దు విషయంలో స్పష్టమైన సమాచారమిచ్చాయి.