breaking news
thought of suicide
-
అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: యూఎస్ ప్రెసిడెంట్
న్యూయార్క్: ఆత్మ హాత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని.. వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన తాను అక్కడి నుంచి దూకి ఆత్మచేసుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అయతే తన పల్లల గురించి ఆలోచించి... ఆత్మహత్య చేసుకుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నని తెలిపారు. 1972 సంవత్సరంలో తొలిసారి సెనేటర్‌గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్... తన భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారని వెల్లండించారు. ఆ సమయలో చాలా బాధలో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు.ఆ బాధలో తాగటం అలవాటు లేని తాను మందు బాటిల్ తీసుకొని డెలావేర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి తాగుతుండగా.. ఆత్మహత్య ఆలోచన వచ్చిందన్నారు. కానీ, తన మిగతా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఆలోచించి.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అదే విధంగా మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ముందే డిబేట్లో పాల్గొనాలని ఉన్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఓ చోట ట్రంప్‌తో డిబేట్ తనకు సంతోషమన్నారు. దీనిపై ట్రంప్ సైతం ప్రతిస్పందించారు. ‘ నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయానికైనా బైడెన్‌తో డిబేట్‌కు అంగీకరిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఇక.. అధ్యక్ష పదవి ఎన్నికల డిబేట్ల ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్బర్గ్, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో జరగనున్నాయి. -
ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా
తీహార్ జైల్లో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కూడా పేసర్ శ్రీశాంత్‌కు వచ్చిందట. అయితే, ఎలాగోలా ఆ ఆలోచనల నుంచి బయటపడి, ఇప్పుడు మచ్చ కూడా తుడిచేసుకున్న ఈ కేరళ కుర్రాడు.. తనపై నిషేధం ఎత్తేయాల్సిందిగా బీసీసీఐని కోరాలని అనుకుంటున్నాడు. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అపాయింట్మెంట్ కోరానని శ్రీశాంత్ చెప్పాడు. బీసీసీఐ పెద్దలు తన విషయంలో సానుకూలంగా ఆలోచించడం చాలా సంతోషకరమని, వాళ్ల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నానని తెలిపాడు. క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌తో తనకు సంబంధాలున్నాయని, దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ లాంటివాళ్లతో లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు తాను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదని శ్రీశాంత్ తెలిపాడు. అయితే.. శివారాధనతోనే తాను ఆ భావనల నుంచి బయట పడినట్లు చెప్పాడు. తాను ఇప్పటికీ వేచి చూస్తానని, ఎవరిమీదా దావాలు వేయాలన్న ఆలోచన లేదని, ఇప్పటికీ క్రికెట్ ఆడాలన్నదే తన కోరిక అని చెప్పాడు. తనపై విధించిన జీవితకాల నిషేధం ఎత్తేసిన తర్వాత మాత్రమే తాను ప్రాక్టీసు మళ్లీ మొదలుపెడతానని శ్రీశాంత్ అన్నాడు.