హైదరాబాద్‌లో పబ్‌పై దాడి, అదుపులో 30 మంది విద్యార్థులు
నగరంలోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెన్ స్పోర్ట్స్ క్లబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 30 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వారందరూ మద్యం సేవిస్తున్నారని అధికారులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కొందరు అమ్మాయిలు అసభ్యకర దుస్తులు ధరించారు.
పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని పలు పబ్‌లలో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాడి చేశారు.