breaking news
temple staff
-
ఆదాయం.. హారతి
కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు దేవస్థానం సిబ్బంది హారతి పళ్లెం రూపంలో స్వాహా చేస్తున్నారు. దేవస్థానం ఈఓ ఈ విషయంపై దృష్టి సారిస్తే నెలకు రూ.50 లక్షల మేరకు ఖజానాకు చేరుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కానుకలు ఎవరికి చేరాలి? నిత్యం దేశం నలుమూల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు వరసిద్ధి వినాయకస్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్ర మంలో వారు స్వామివారికి చేరేలా కానుకలు స మర్పిస్తారు. పేద, ధనిక, పిల్లల పేరుతో మొక్కుబడులు ఇచ్చేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సగటున భక్తులు రూ.పది నుంచి రూ.10 వేల నూట పదహార్ల వరకు సమర్పించి మొక్కులు తీ ర్చుకునేవారుంటారు. వీటితో పాటు వెండి, బం గారం (తులం, అర తులం) సమర్పించే వారు దక్షిణాది రాష్ట్రాల్లో భక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరిని గర్భాలయ సిబ్బంది తప్పుదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్వామివారి గర్భాలయంలో మూల విగ్రహనికి ఎదురుగా హారతి పళ్లెం ఉంచి కానుకలు అందులో పడేలా భక్తులను ప్రసన్నం చేసుకుంటారు. దీంతో ఆ మొత్తం వారి జేబుల్లోకి వెళుతోంది. ఇలా సాధారణ సమయాల్లో రోజుకు రూ.20 వేలు, రద్దీ సమయాల్లో రూ. 50 వేల పైచిలుకుకు నొక్కేస్తున్నారు. ఈ క్రమంలో నెలకు రూ.50 లక్షలకు పైగా స్వాహా జరుగుతోంది. ఆశీర్వాదాలతో నిలువు దోపిడీ వినాయకస్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఉండే అర్చక, వేదపండితుల వద్ద ఆశీర్వాదం పొందాలని భావి స్తారు. అలాంటి వారి కోసం దేవస్థానంలో ఆశీర్వా ద సేవ ఉంది. అయితే ఆలయంలో పనిచేసే అర్చ క, వేదపండితులు ఎలాంటి టికెట్ లేకుండా కేవలం ధనిక భక్తులకు ఉచితంగా ఆశీర్వాదం చేసి, కండువాలు కప్పుతారు. ఇందుకు భక్తులు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అర్చకులు, వేదపండితుల చేతిలో ఉంచి, వెళుతున్నారు. ఇలా కూడా దేవస్థానానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. ఈఓ దృష్టి సారించాలి కాణిపాక దేవస్థానికి వచ్చే భక్తులు అందజేసే కానుకలు ఆలయంలో పనిచేసే సిబ్బందే స్వాహా చేస్తుండడం వెనుక భక్తుల నుంచి పలురకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానుకలు స్వాహా జరిగే ప్రాంతాలపై దేవస్థాన ఈఓ దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా గర్భాలయంలో హారతి పళ్లెం, అభిషేక అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసే కేంద్రం, వేదపండితులు, అర్చకుల అనధికార ఆ శీర్వాదాలు, హోమం జరిగే, గణపతి చతుర్థి వ్ర తం, దేవస్థానంలో పనిచేసే సిబ్బంది పని తీరుపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. భక్తులు కానుకలు హుండీలోనే సమర్పించాలి భక్తులు కానుకలను హుండీలోనే సమర్పించాలి. ఎలాంటి కానుకలు హారతి పళ్లెం లో వేయకూడదు. ఈ క్రమంలో దేవస్థానంలో విధులు నిర్వహించే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశాం. అలాగే ఆశీర్వా దం టికెట్టు లేకుండా ఆశీర్వాదాలు చేస్తే అలాంటి సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. –పి.పూర్ణచంద్రరావు,కాణిపాకం దేవస్థానం ఈఓ -
అపచారంపై అపచారం!
సాక్షి, విశాఖపట్నం:సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆపచారంపై అపచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆలయంలో చోటు చేసుకుంటున్న పలు అవాంఛనీయ సంఘటనలతో భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి తిలోదకాలివ్వడం, సుప్రభాత, పవళింపు సేవల్లో అన్యాయాలు, అర్చకుల్లో ఆధిపత్య పోరు వంటి ఘటనలు వెలుగు చూశాయి. కొద్దిరోజుల క్రితం రాజభోగం సమయంలో ఓ మహిళ గర్భ గుడిలో ఉండడం తీవ్ర దుమారం రేపింది. దీనిని అపచారంగా భావించిన భక్తజనం నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాక్షాత్తూ ఆలయ ఉద్యోగే అపచారానికి పాల్పడ్డాడు. పరమ పవిత్రంగా భావించే స్వామి ఉత్తర ద్వారం సమీపంలో సూరిబాబు అనే నాలుగో తరగతి ఉద్యోగి బహిరంగంగా, పట్టపగలు మూత్ర విసర్జన చేశాడు. దానిని కొంతమంది భక్తులు కెమెరాలో బంధించారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. -
సత్యదేవునికి తప్పని నోట్ల పాట్లు
-
దేవుడికే శఠగోపం పెట్టారు
-
శ్రీకాకుళం జిల్లా పాలకొండ గుడిలో అపచారం
-
దేవాలయ సిబ్బందికి రూ. 5వేల గౌరవవేతనం
ఆదాయాలు లేని దేవాలయాల సిబ్బందికి ప్రతినెలా 5వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. జనవరి నుంచి 2,645 మంది ధార్మిక సిబ్బందికి ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. దీని కోసం రూ. 250 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామన్నారు. జనవరి 1న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో మూడు రోజుల పాటు సిఫార్సు లేఖలను నిషేధించామని మాణిక్యాలరావు చెప్పారు. వీఐపీల లేఖలను అనుమతించేది లేదని, వీఐపీ సహా నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను కూడా 5వేల నుంచి 800కు తగ్గించినట్లు మంత్రి తెలిపారు.