breaking news
temple promises
-
చిన్న దుకాణానికి రూ.1.72 కోట్ల లీజు.. ఒక్క అడుగు రూ.2.47 లక్షలు
ఇండోర్: గుడి ఆవరణలో కేవలం పూలు, పూజా సామగ్రి, ప్రసాదాలు విక్రయించే 69.50 చదరపు అడుగుల వైశాల్యమున్న చిన్నపాటి దుకాణాన్ని ఓ వ్యాపారి రూ.1.72 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకు దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ప్రఖ్యాత ఖజ్రానా గణేశ్ ఆలయ కాంప్లెక్స్‌లో ఈ లీజు వ్యవహారం చోటుచేసుకుంది. ‘1–ఎ’ దుకాణాన్ని లీజుకు ఇవ్వడానికి ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. రూ.30 లక్షలు కనీస మొత్తంగా నిర్ణయించారు. వేలం పాటలో ఇది ఏకంగా రూ.1.72 కోట్లకు చేరింది. అంటే ఒక్కో చదరపు అడుగు స్థలం రూ.2.47 లక్షలు పలికింది. వాణిజ్య స్థలం లీజు కోసం ఈ స్థాయిలో ధర పలకడం అరుదైన సంఘటన అని చెప్పొచ్చు. ఖాజ్రానా వినాయక ఆలయానికి దర్శించుకొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక్కడ వ్యాపారం భారీగానే జరుగుతోంది. -
బాసర ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం
బాసర : ఆదిలాబాద్ జిల్లా బాసరలోన అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఓ జనరల్ స్టోర్‌లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు జరిగింది. ప్రమాదం గమనించిన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంపై సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కావాలని నిప్పుపెట్టారా లేక షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా అనేది మిస్టరీగా ఉంది. పోలీసులకు సమాచారం అందించారు.