చరిత్ర సృష్టించిన పాక్ యువ ఓపెనర్
పాకిస్తాన్- శ్రీలంక మధ్య రావల్పిండి వేదికగా సోమవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య పాక్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ జట్టు యాజమాన్యం నలుగురు కొత్త ఆటగాళ్లను తుదిజట్టుకు ఎంపిక చేసింది.తయ్యబ్ ఆరిఫ్, అరాఫత్ మిన్హాస్, మహ్మద్ తాహా, సాకిబ్ ఖాన్ పాక్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఇక వీరిలో తయ్యబ్ ఆరిఫ్ ఓపెనర్‌గా బరిలోకి దిగి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ తరఫున అరంగేట్రంలోనే అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా పాక్ తరఫున టెస్టుల్లో తొలి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.శ్రీలంకతో తొలి టెస్టులో తయ్యబ్ కేవలం 46 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 57 పరుగులు సాధించాడు. కాగా తయ్యబ్ ఆరిఫ్ ఇరవై ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. అయితే, 21 ఏళ్ల రజావుల్లా ఇటీవల బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ అరంగేట్రంలో 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో తొలి టెస్టులో మరో ఓపెనర్ అజాన్ ఆవైస్ 30 పరుగులు చేయగా.. కెప్టెన్ బాబర్ ఆజం అర్ధ శతకం (50) సాధించాడు. ఈ క్రమంలో 35 ఓవర్ల ఆట ముగిసేసరికి పాక్ మూడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.