breaking news
tariff plan
-
రష్యా చమురుకి భారత్ దూరమైంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్‌పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్‌న్యూస్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్‌ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్‌పై ట్రంప్ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ 50 శాతం సుంకాలను భారత్ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్‌లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్ 50 శాతం టారిఫ్‌ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్ ఆయిల్‌ను స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం. -
‘మాతో ఆటలొద్దు’: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు విరుచుకుపడ్డారు. బ్రిక్స్‌లోని ఆరు దేశాలకు జూలై 6న విధించిన 10శాతం అదనపు సుంకాలను మరోమారు గుర్తుచేశారు. అమెరికన్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఏ దేశానికైనా ఇలాంటి దెబ్బే ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ డాలర్ తన హోదాను కోల్పోతే అది ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన ఆయన మరో మరోమారు బ్రిక్స్ దేశాలపై (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) మాటల దాడి చేశారు. ‘బ్రిక్స్’ త్వరలోనే కనుమరుగవుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమూహంలోని దేశాలపై భాగమైన 10 శాతం అదనపు సుంకం విధించడంపై గతంలో చేసిన ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు. #WATCH | US President Donald Trump says, "... This (The Genius Act) is really strengthening the US Dollar and giving the Dollar a great prominence. There is a little group called BRICS, and it is fading out fast. But BRICS tried and wanted to take over the Dollar and the… pic.twitter.com/wG6GEe8OOs— ANI (@ANI) July 18, 2025తమ ‘జీనియస్ చట్టం’ అమెరికా డాలర్‌ను బలోపేతం చేస్తుందని, డాలర్‌కు మరింత ప్రాముఖ్యతను తీసుకువస్తుందన్నారు. అయితే డాలర్ ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్రిక్స్ అనే చిన్న సమూహం త్వరలోనే కనుమరుగుకానున్నదని ట్రంప్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలకు తాము 10శాతం అదనపు సుంకం విధిస్తామని ప్రకటించగానే ఆ దేశాలవారు మర్నాడే సమావేశం నిర్వహించారని, అయినా తనను కలుసుకునేందుకు ఎవరూ రాలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదాను ఎప్పటికీ కోల్పోనివ్వమని అన్నారు. బ్రిక్స్‌లోని ఆరు దేశాలు తమ తీరు మార్చుకుంటే ఈ సమస్య సద్దుమణుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.బ్రిక్స్ దేశాలు గత ఏడాది బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలను దాటి ఇరాన్, ఇండోనేషియాలకు సభ్యత్వాన్ని కల్పించాయి. ఇటీవల బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయా దేశాధినేతలు యూఎస్ సైనిక, వాణిజ్య విధానాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఆయా దేశాలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కాగా ట్రంప్ 2025, జూలై 18న జీనియస్ చట్టంపై సంతకం చేశారు. ఇది ప్రపంచ డిజిటల్ కరెన్సీ విప్లంలో కొత్త అధ్యాయమని ట్రంప్ పేర్కొన్నారు. -
మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?
దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్‌ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్‌లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్‌ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు. ఏఆర్పీయూ రూ.300 స్థాయికి..భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్ ఐడియా ఏఆర్పీయూ ఏప్రిల్–జూన్‌లో రూ.154 నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్‌ల పెంపు ఈ సంస్థలకు షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు తమ కనెక్షన్లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.మౌలికంలో పెట్టుబడులు..మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్‌లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్‌లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా నుంచి అక్టోబర్‌లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (డీఐపీఏ) డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. భారతీ ఎయిర్టెల్ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం టారిఫ్ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్పీయూ అవసరం.ఇదీ చదవండి: గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరటబీఎస్ఎన్ఎల్కు మార్పుధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సబ్‌స్క్రైబర్ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్ఎన్ఎల్ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో వైర్లెస్ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. యాక్టివ్ సబ్స్రైబర్ బేస్ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్ జియో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది. -
టెలికాం కంపెనీలపై ట్రాయ్ కన్నెర్ర! ఇష్టారీతిగా ఆఫర్లు ఇవ్వొద్దంటూ ఆదేశం!!
మొబైల్ ఫోన్ ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. తమకు తెలియకుండా కస్టమర్లకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వొద్దంటూ తేల్చి చెప్పింది. తమ ఆదేశాలు హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ట్రాయ్ వెల్లడించింది. ఫిర్యాదుల వెల్లువ ఇండియన్ మొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త చందాదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ టారిఫ్‌లు ప్రకటించే ముందు ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదని, ట్రాయ్ అనుమతి తీసుకోకుండానే మొబైల్ ఆపరేటర్లు ప్రత్యేక టారిఫ్‌లు అమలు చేస్తున్నారంటూ ఒక సంస్థపై మరో సంస్థ తరచుగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కారణం ఏంటీ మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా కస్టమర్లు తమ నంబర్ మారకుండానే ఆపరేటర్‌ను మార్చుకునే వీలుంది. అయితే ఎంఎన్‌పీ అమలు చేసే సమయంలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన చందాదారున్ని ఆకట్టుకునేందుకు ట్రాయ్ దగ్గర అనుమతి తీసుకోని పలు రకాల ఆఫర్లు కస్టమర్లకు ప్రకటిస్తున్నాయి. ఇదే సందర్భంలో తమ దగ్గరి నుంచి కస్టమర్ బయటకు వెళ్లకుండా కూడా అనుమతి లేని ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదంతా థర్డ్‌పార్టీల ద్వారా జరుగుతోంది. ఇంత కాలం ఈ వ్యవహారం జరుగుతూ వస్తోన్నా .. ఇటీవల మొబైల్ ఆపరేటర్లు ఈ అనధికారిక టారిఫ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌ని ఆశ్రయించారు. తక్షణమే అమలు మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ అనధికారిక టారిఫ్‌లను అమలు చేయోద్దంటూ ఆదేశించింది. ఈ టారిఫ్ అమలు చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయంది. చదవండి : హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ -
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్
ముంబై: తారిఫ్ వార్‌లో రిలయన్స జియో విజయం సాధించింది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీ తారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వడం సాధ్యం కాదని వాదించిన టెల్కోలకు షాకిస్తూ ట్రాయ్ జియోకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో ప్రకటించిన వెల్కం ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండూ ఫండమెంటల్ గా వేరువేరు అని తేల్చి చెప్పింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని గతంలో ప్రకటించిన ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రాయ భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ సహా ఇతర ఆపరేటర్లకు ఈ సమాచారాన్ని ట్రాయ్ అందించనుంది. కాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకాం తాజా ఆఫర్ పై టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, ఐడియా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ రిలయన్స్ జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా శాశ్వత కాలం ఫ్రీగా ఇవ్వడం సాధ్యం కాదనీ దీన్ని నిరోధించాలంటూ టెలికాం ట్రిబ్యునల్ (టీడీఎస్‌ఏటి) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సో.. తాజా హ్యాపీ న్యూయర్ ఆఫర్ ను జియో వినియోగదారులు నిస్సంకోచంగా అనుభవించవచ్చు. మార్చి 31, 2017 వరకు జియో ఆఫర్ చేసిన ఉచిత డ్యాటా, వాయిస్ సేవలను జియో లవర్స్ నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయడానికి ట్రాయ్ అనుమతినిచ్చింది. సంబంధిత వార్తలు.. ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా? జియో తరువాతి డాటా ప్లాన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది! -
ఎయిర్‌సెల్ 5 రూపాయల పథకం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌సెల్ రూ.5కే అయిదు రకాల వాయిస్ పథకాలను ప్రకటించింది. ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచితం, ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు 6 సెకన్లకు ఒక పైసా, అన్ని స్థానిక కాల్స్ 2 సెకన్లకు 1 పైసా, లోకల్ మరియు ఎస్టీడీ 2 సెకన్లకు 1 పైసాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. వీటితోపాటు ఐఎస్డీ పథకాన్ని కూడా రూపొందిం చింది. ఈ అయిదు పథకాల్లో కస్టమర్లు ఏదైనా ఒకదానిని ఎంచుకోవాలి. పథకాన్నిబట్టి 10 రోజుల నుంచి 30 రోజుల దాకా వ్యాలిడిటీ ఉంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచితం, అన్ని స్థానిక కాల్స్ పథకాల్లో ప్రతి రోజు తొలి 120 సెకన్లకుగాను సెకనుకు 1.5 పైసలు చార్జీ చేస్తారు. లోకల్ మరియు ఎస్టీడీ ప్లాన్‌లో ప్రతి రోజు తొలి 120 సెకన్ల కు సెకనుకు 2 పైసలు చార్జీ ఉంటుంది. ట్రయల్ రన్లో 4జీ: రాష్ట్రంలో 4జీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ దీపిందర్ తివానా శుక్రవారమిక్కడ తెలిపారు. వాణిజ్యపరం గా సేవలు అందించేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. వాస్తవానికి 4జీ ఆధారిత మొబైల్ ఫోన్ల లభ్యత దేశంలో తక్కువగా ఉందన్నారు. వాయిస్ పథకాలను ప్రకటించిన అనంత రం కంపెనీ దక్షిణ ప్రాంత మార్కెటింగ్ హెడ్ భరత్ మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.