
వాషింగ్టన్ డీసీ: బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు విరుచుకుపడ్డారు. బ్రిక్స్‌లోని ఆరు దేశాలకు జూలై 6న విధించిన 10శాతం అదనపు సుంకాలను మరోమారు గుర్తుచేశారు. అమెరికన్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఏ దేశానికైనా ఇలాంటి దెబ్బే ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.
డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ డాలర్ తన హోదాను కోల్పోతే అది ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన ఆయన మరో మరోమారు బ్రిక్స్ దేశాలపై (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) మాటల దాడి చేశారు. ‘బ్రిక్స్’ త్వరలోనే కనుమరుగవుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమూహంలోని దేశాలపై భాగమైన 10 శాతం అదనపు సుంకం విధించడంపై గతంలో చేసిన ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు.
#WATCH | US President Donald Trump says, "... This (The Genius Act) is really strengthening the US Dollar and giving the Dollar a great prominence. There is a little group called BRICS, and it is fading out fast. But BRICS tried and wanted to take over the Dollar and the… pic.twitter.com/wG6GEe8OOs
— ANI (@ANI) July 18, 2025
తమ ‘జీనియస్ చట్టం’ అమెరికా డాలర్‌ను బలోపేతం చేస్తుందని, డాలర్‌కు మరింత ప్రాముఖ్యతను తీసుకువస్తుందన్నారు. అయితే డాలర్ ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్రిక్స్ అనే చిన్న సమూహం త్వరలోనే కనుమరుగుకానున్నదని ట్రంప్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలకు తాము 10శాతం అదనపు సుంకం విధిస్తామని ప్రకటించగానే ఆ దేశాలవారు మర్నాడే సమావేశం నిర్వహించారని, అయినా తనను కలుసుకునేందుకు ఎవరూ రాలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదాను ఎప్పటికీ కోల్పోనివ్వమని అన్నారు. బ్రిక్స్‌లోని ఆరు దేశాలు తమ తీరు మార్చుకుంటే ఈ సమస్య సద్దుమణుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
బ్రిక్స్ దేశాలు గత ఏడాది బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలను దాటి ఇరాన్, ఇండోనేషియాలకు సభ్యత్వాన్ని కల్పించాయి. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయా దేశాధినేతలు యూఎస్ సైనిక, వాణిజ్య విధానాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఆయా దేశాలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కాగా ట్రంప్ 2025, జూలై 18న జీనియస్ చట్టంపై సంతకం చేశారు. ఇది ప్రపంచ డిజిటల్ కరెన్సీ విప్లంలో కొత్త అధ్యాయమని ట్రంప్ పేర్కొన్నారు.