breaking news
tampa air port
-
ఎత్తు తగ్గి కుదుపులకు లోనైన విమానం..
టాంపా: విమానం ఎత్తులో ఆకస్మిక తగ్గుదల కారణంగా ఒక్కసారిగా కుదుపులకు లోనై కనీసం 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం మెక్సికోలోని కాంకున్ నుంచి టేకాఫ్ తీసుకున్న జెట్‌బ్లూ సంస్థ ఎయిర్ బస్ విమానం న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత అకస్మాత్తుగా విమానం దిగువకు వచ్చింది. కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. ప్రమాదాన్ని శంకించిన పైలట్ విమానాన్ని టాంపా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గాయపడిన కనీసం 20 మంది ప్రయాణికులను వెంటనే ఆస్పత్రులకు తరలించారు. వీరెవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. కాగా, విమానంలో మొత్తం 162 సీట్లుండగా ప్రయాణికులెందరనే విషయంలో స్పష్టత లేదు. -
పిచ్చెక్కించిన పులిబొమ్మ
తంపా: ఒక బాలుడు తెచ్చుకున్న పులిబొమ్మ.. తంపా విమానాశ్రయ అధికారులకు తలపోటు తీసుకొచ్చింది. ఆ వెంటనే రిలీఫ్ ఇచ్చి సరికొత్త ఆలోచనకు ప్రాణంపోసి వారిలో నవ్వులు పూయించింది. ఓవెన్ అనే ఆరేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి హ్యూస్టన్ వెళ్లేందుకు తంపా విమానాశ్రయానికి వచ్చాడు. అయితే, తన వెంట తెచ్చుకున్న హాబ్స్ అనే పులిబొమ్మ పోగొట్టుకున్నాడు. దీంతో అతడు బిక్కమొఖం పెట్టుకొని ఏడుపు మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోక తల్లి దండ్రులు విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా కలిసి ఎయిర్ పోర్ట్ మొత్తం జల్లెడ పెట్టారు. ఒక సాహసయాత్ర మాదిరిగా చేసి చివరికి చిన్న పిల్లలు ఆడుకునే ప్రాంతంలో దానిని గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద సాహసయాత్రగా చేసిన ఈ కార్యక్రమాన్ని 'ఎడ్వంచర్' అనే పేరుతో అప్పటికప్పుడు డాక్యుమెంటరీ రూపొందించారు. పులిబొమ్మ హాబ్స్‌తో ఫొటోలు దిగారు. ఆ పిల్లాడికి చూపించి సంతోష పెట్టారు. ఎట్టకేలకు ఓవెన్ తిరిగి తనకిష్టమైన హాబ్స్‌తో హ్యూస్టన్ వెళ్లాడు.


