-
Hyderabad: అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు తస్కరించిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రహమత్‌నగర్‌లో నివసించే పంతం విజయ తన ఇంటికి తాళం వేసి తల్లితో కలిసి స్వగ్రామానికి వెళ్లింది. ఇంటిని కనిపెట్టాలని సమీపంలో నివసించే తన చెల్లెలు జ్యోతికి చెప్పింది. రహమత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసిస్తున్న చింత రాజు, జ్యోతి ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఈ నెల 10వ తేదీన తనను నమ్మి అక్క ఇల్లు అప్పగించగా జ్యోతి తన స్నేహితుడు రాజుతో కలిసి అక్క ఇంటికి కన్నం వేసింది. విజయ ఇంటికి వెళ్లిన జ్యోతి తన స్నేహితుడు రాజుతో కలిసి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 25 తులాల ఆభరణాలను తస్కరించారు. బాధితురాలు ఆ తెల్లవారే ఫిర్యాదు చేస్తూ చింత రాజుపై అనుమానం వ్యక్తం చేసింది. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు రాజును అరెస్ట్ చేసి 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా ఈ దొంగతనానికి విజయ సోదరి జ్యోతి సహకారం కూడా ఉందని తేలింది. ఇద్దరూ కలిసే పథకం ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలిపారు. చోరీ చేసిన నగలను మణప్పురం, ముత్తూట్‌లో తనాఖాలో పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బుతో రాజు బెట్టింగ్‌లకు పాల్పడి సర్వం పోగొట్టుకున్నట్లు తేలింది. జూబ్లీహిల్స్ క్రైం ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ హరీశ్వర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Chittoor: కీచకుడి వికృత చేష్టలు.. బాలికలను మిద్దె మీదకు తీసుకెళ్లి.. -
సోదరిపై లైంగిక వేధింపులు.. అందుకే ఆ హత్యలు!
థానే: సొంత కుటుంబ సభ్యలను 14 మందిని అత్యంత దారుణంగా హత్య చేసి.. తనూ ఆత్మహత్య చేసుకున్న హుస్నేన్ వారేకర్ గురించి ఆదివారం పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. థానే సమీపంలోని వారేకర్ ఇంట్లో దొరికిన మందులను బట్టి చూస్తే.. అతని మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలుస్తోందని, అలాగే అతను తన సోదరిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విచారణలో తేలిందని జాయింట్ కమిషనర్ అశుతోష్ వెల్లడించారు. వారేకర్ ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేదని, అతడు సమారు 65 లక్షల రూపాయలు సమీప బందువుల వద్ద అప్పుచేశాడని ఆయన వెల్లడించారు. సోదరిని లైంగికంగా వేధించిన విషయం కుటుంబసభ్యులకు తెలియటంతోనే అందరినీ చంపాలని వారేకర్ భావించి ఉంటాడని ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన సుబియా బర్మార్ పోలీసులతో వెల్లడించింది. ఘటన సమయంలో వారేకర్ తల్లి ఎంతగానో ప్రాధేయపడినప్పటికీ అతను ఆమెను విడిచిపెట్టలేదని సుబియా విచారణలో తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement