breaking news
Syed Shahnawaz Hussain
-
దేశానికి నువ్వేమిచ్చావు: రవీనా టాండన్
ఢిల్లీ: మత అసహనంపై ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌పై నటి రవీనా టాండన్, బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. నరేంద్ర మోదీని ప్రధానిగా చూడలేని వ్యక్తులు, ఇప్పుడు ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటున్నారని నటి రవీనాటాండన్ పేర్కొన్నారు. రవీనా టాండన్ ట్వీట్ల సారాంశం ఇలా ఉంది.. ''మోదీని ప్రధానిగా చూడకూడదని అనుకునేవాళ్లంతా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. వాళ్లు దేశానికి సిగ్గుచేటు. అసహనాన్ని ఖండించాలని, దానిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు. కానీ, ఇలా విషం చిమ్మడం సరికాదు. దేశానికి గుండెకాయ లాంటి ముంబై మహానగరం మీద బాంబుల వర్షం కురిసినప్పుడు వాళ్లకు ఎందుకు భయం వేయలేదో అని ఆశ్చర్యం వేస్తోంది. మోదీ ప్రధాని అయిన రోజు నుంచి తాము సంతోషంగా లేమని వీళ్లు బహిరంగంగా చెబితే బాగుండేది. అంతేతప్ప మొత్తం దేశం సిగ్గుపడేలా వ్యాఖ్యానించడం సరికాదు. వాళ్లకు నిజంగా దమ్ముంటే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి. అంతేతప్ప దేశ పరువు ప్రతిష్ఠలను దిగజార్చకూడదు. ఏ రకమైన నిరసనతోనూ నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ మన దేశాన్ని గౌరవించే విషయానికొద్దాం.. దేశం నీకు ఏమిచ్చిందో, నువ్వు దేశానికి ఏమిచ్చావో ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో.'' ఇక ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కుందని షానవాజ్ హుస్సేన్ చెబుతూనే, ఈ దేశం అమీర్ ఖాన్‌కు చాలా ఇచ్చిందన్నారు. భారత్ కన్నా మరో మెరుగైన దేశాన్ని అమీర్ ఖాన్ చూడలేరని, దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి అమీర్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని షానవాజ్ ధ్వజమెత్తారు. మరోవైపు అమీర్ ఖాన్ పై ఢిల్లీలోని అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అమీర్ ఖాన్ ఇంటి ఎదుట భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు ప్రారంభించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సంఘటనలు తనకు ఆందోళన కలిగించాయని.. తన భార్య కిరణ్‌రావ్ ఈ దేశం వదిలి వెళ్దామని కూడా ప్రతిపాదించారని సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా అవార్డుల కార్యక్రమంలో అమీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
సుష్మ వర్సెస్ జైట్లీ
సుష్మ అరుణ్ జైట్లీ బిజెపిలో అయిదున్నర దశాబ్దాల అనుభవం చురుకైన నేత, యువకుడు, సమస్యలను త్వరగా అర్థం చేసుకుంటారు అద్వానీకి అత్యంత సన్నిహితురాలు నరేంద్ర మోడీకి మొదట్నుంచీ గట్టి మద్దతుదారు, గుజరాత్ వ్యవహారాల ఇన్చార్జి గా అనుభవం మంత్రిగా పనిచేసిన అనుభవం మొదట్నుంచీ రాజ్యసభ రూటే అమెది మొదట్నుంచీ లోకసభ రూటు కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టడంలో వెనకాడరు కాంగ్రెస్ తో సాన్నిహిత్యం, మెతక వైఖరి అవలంబిస్తుందన్న ఆరోపణ రాజ్యసభలో సీమాంధ్ర హక్కులపై పోరు తెలంగాణ చర్చను రసాభాస చేసిన ఆరోపణ మద్దతుదార్లు - అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, షానవాజ్ హుసేన్ మద్దతుదార్లు - నరేంద్ర మోడీ, అమిత్ షా, వసుంధరా రాజే బిజెపిలో ప్రధాని ఎవరన్న చర్చ ముగిసింది. ఇప్పుడు ఉప ప్రధాని ఎవరన్న రచ్చ మొదలైంది. బిజెపిలో ఇప్పుడు దీనిపై అంతర్గతంగా భారీ చర్చే జరుగుతోంది. అసలు సమస్యంతా అకాలీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తో మొదలైంది. అమృత్ సర్ నుంచి లోకసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న అరుణ్ జైట్లీకి మద్దతుగా ప్రచారం చేస్తూ ఒక సభలో బాదల్ 'మీరు అరుణ్ జైట్లీకి ఓటేస్తే ఉప ప్రధానమంత్రికి ఓటేసినట్టే' అని అన్నారు. అంతే! రచ్చ మొదలైంది. 'నేను ఉపప్రధాని అభ్యర్థిని కాను' అని జైట్లీ స్వయంగా ప్రకటించినా ఫలితం లేకపోయింది. మరో వైపు మధ్యప్రదేశ్ లో సీనియర్ బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి సుందర్ లాల్ పట్వా కుమారుడు సురేంద్ర పట్వా తమ రాష్ట్రంలోని విదిశ నుంచి పోటీ చేస్తున్న సుష్మా స్వరాజ్ ఉప ప్రధాని అని ప్రకటించారు. బిజెపి సీనియర్ నేతల్లో నరేంద్ర మోడీని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది ఒక్క సుష్మా స్వరాజే. ఆమె నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అంత అనుకూలంగా మాట్లాడలేదు. బళ్లారి నుంచి వివాదాస్పద నేత బీ శ్రీరాములుకి టికెట్ ఇవ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే జస్వంత్ సింగ్ కు బార్మేర్ టికెట్ ఇవ్వకపోవడాన్నీ నిరసించారు. ఆమె తన సభల్లో ఎక్కడా మోడీ పేరు ప్రస్తావించరు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పనితీరును మాత్రం బాగా ప్రశంసిస్తారు. బిజెపిలో ఒక వర్గం మోడీకి పగ్గాలు వేసేందుకు ఉప ప్రధానిగా సుష్మా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అలాంటి వారిలో అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, షానవాజ్ హుసేన్ లు ఉన్నారు. ఇటీవలే బిజెపికి మద్దతుదారు, మోడీ అభిమాని అయిన ఫెమినిస్టు జర్నలిస్టు మధు కిష్వర్ బిజెపిలో ఒక వర్గం బిజెపికి 160 సీట్లు మాత్రమే రావాలని కోరుకుంటున్నారని సంచలన ప్రకటన చేశారు. బిజెపికి తక్కువ సీట్లు వస్తే ఎన్డీయే మిత్ర పక్షాల బలం పెరుగుతుందని, వారు మోడీకి బదులు మరొకరు పీఎం కావాలని కోరవచ్చునని వారు ఆశిస్తున్నారు. ఇలాంటి వర్గానికి ఆమె క్లబ్ 160 అని పేరు పెట్టారు. బిజెపికి సొంతంగా 180 నుంచి 200 సీట్లు వస్తే మోడీకి పట్టపగ్గాలుండవని క్లబ్్ 160 భయపడుతోందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఉప ప్రధాని ఎవరన్న విషయంలో చర్చను మొదలుపెట్టారని వార్తలు వినవస్తున్నాయి.