-
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
సినీ ప్రపంచం.. ఓ రంగుల లోకం. అందంగా ఉంటేనే అవకాశం. లేదంటే నిరుత్సాహం. ఆ అవకాశాలతోనే పేరు, డబ్బు, స్టార్డమ్. అలాంటి పేరు ప్రఖ్యాతలను ఎవరు కాదనుకోరు. అందుకోసం ఎలాంటి పనైనా చేయడానికి సాహసిస్తారు. గ్లామర్‌గా కనపడేందుకు ఎక్కడలేని పాట్లు పడతారు. సర్జరీలు చేయించుకుంటారు. సక్సెస్ అయితే ఓకే. వికటిస్తేనే భౌతికంగా ఎక్కడా లేని చిక్కులు. అయితే కొన్నిసార్లు అందం కోసం చేసే సర్జరీలే కాకుండా ఇతర ఆపరేషన్లు కూడా తేడా కొడతాయి. ఆ నటి అనుకుంది ఒకటైతే తనకు జరిగింది ఇంకొకటి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆ నటి పరిస్థితి ఏంటో తెలుసుకుందామా ! కన్నడలో హీరోయిన్గా 'ఎఫ్ఐఆర్', '6 టు 6' వంటి తదితర చిత్రాల్లో నటించింది స్వాతి సతీష్ (Swathi Sathish). ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో చేరింది. ఆమెకు రూట్ కెనాల్ థెరపీ (Root Canal Surgery) చేశారు వైద్యులు. తీరా ఆ ఆపరేషన్ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. అయితే ఆ డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు తెలిపింది. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్‌పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు -
ఆ హీరోయిన్ ముఖం ఎందుకు ఉబ్బింది?
అందమైన ముఖవర్ఛస్సు కలిగి.. చూడగానే ఆకట్టుకునే రూపం కత్రినా కైఫ్ది. సొగసైన ఈ బాలీవుడ్ ముద్దగుమ్మ ముఖం ఈ మధ్య కాస్తా ఉబ్బినట్టు కనబడటం పలు అనుమానాలకు తావిచ్చింది. తన అందాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు కదా అని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. ఆమెను పంటినొప్పి వేధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జ్ఞానదంతాన్ని తొలగించుకోవాలని ఆమె నిర్ణయించారు. అయితే, ఈ విషయమై రెండుసార్లు డాక్టర్ అపాయింట్మెంట్ను ఎగ్గొట్టడం, పంటినొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయోటిక్స్ తీసుకోవడంతో ఆమె ముఖంపై ఆ ప్రభావం పడింది. దీంతో ఆమె ముఖం కొంత ఉబ్బినట్టు స్పష్టంగా కనిపించింది. ఇటీవల ఫొటోగ్రాఫర్ మారియో టెస్టినోను కలిసినప్పుడు, దర్శకుడు అనురాగ్ బస్సు ఇంట్లో పూజలో పాల్గొన్నప్పుడు దిగిన ఫొటోల్లో ఈ విషయం బయటపడింది. దీంతో రకరకాలు ఊహాగానాలు వచ్చాయి. ఆమె నేడో రేపో ఈ పంటినొప్పికి సర్జరీ చేయించుకొని.. నొప్పికి కారణమైన జ్ఞానదంతాన్ని తొలగించకోనున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మాజీ లవర్ రణ్‌బీర్ కపూర్ సరసన 'జగ్గా జాసుస్' సినిమాలో కత్రిన నటిస్తున్న సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement