breaking news
svarnabharati indoor stadium
-
వెంకన్న వచ్చేశారు
వైభవోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తి తిరుమల నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలు విశాఖపట్నం : విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నాయి. ఇందులో సుమారు 13 అడుగుల వెంకన్న విగ్రహం ఉండడం విశేషం. ఇప్పటికే 35 మంది అర్చకులు చేరుకున్నారు. ఈ వేడుకలను భక్తులు వీక్షించేందుకు వీలుగా భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. సౌండింగ్ సిస్టం, కెమెరాలు సిద్ధం చేస్తున్నారు. కూపన్ల పంపిణీ పూర్తి స్వామికి చేపట్టే సేవల్లో పాల్గొనదలచిన భక్తులకు అందించే కూపన్ల పంపిణీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో పూర్తయింది. మొత్తం 10,800 కూపన్లను భక్తులకు అందజేశారు. ఇదిలావుండగా టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యులు, టీటీడీ ఎస్ఈ రాములతో త్రీటౌన్ సీఐ అప్పలరాజు ఆదివారం ఇక్కడ చర్చించారు. ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. వేడుకలు జరిగినన్నాళ్లూ ఇద్దరు సీఐల పర్యవేక్షణలో ఆరుగురు ఎస్ఐలు, 45 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని సీఐ తెలిపారు. నేడు, రేపు చాగంటి ప్రవచనాలు వైభవోత్సవాల్లో భాగంగా సోమ, మంగళవారాల్లో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఇవ్వనున్నారు. బుధవారం నుంచి స్వామివారి సేవలు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం : విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నాయి. ఇందులో సుమారు 13 అడుగుల వెంకన్న విగ్రహం ఉండడం విశేషం. ఇప్పటికే 35 మంది అర్చకులు చేరుకున్నారు. ఈ వేడుకలను భక్తులు వీక్షించేందుకు వీలుగా భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. సౌండింగ్ సిస్టం, కెమెరాలు సిద్ధం చేస్తున్నారు. కూపన్ల పంపిణీ పూర్తి స్వామికి చేపట్టే సేవల్లో పాల్గొనదలచిన భక్తులకు అందించే కూపన్ల పంపిణీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో పూర్తయింది. మొత్తం 10,800 కూపన్లను భక్తులకు అందజేశారు. ఇదిలావుండగా టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యులు, టీటీడీ ఎస్ఈ రాములతో త్రీటౌన్ సీఐ అప్పలరాజు ఆదివారం ఇక్కడ చర్చించారు. ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. వేడుకలు జరిగినన్నాళ్లూ ఇద్దరు సీఐల పర్యవేక్షణలో ఆరుగురు ఎస్ఐలు, 45 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని సీఐ తెలిపారు. నేడు, రేపు చాగంటి ప్రవచనాలు వైభవోత్సవాల్లో భాగంగా సోమ, మంగళవారాల్లో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఇవ్వనున్నారు. బుధవారం నుంచి స్వామివారి సేవలు ప్రారంభం కానున్నాయి. బుల్లయ్య కళాశాలలో పార్కింగ్ వైభవోత్సవాలకు వచ్చే భక్తులు తమ వాహనాలను బుల్లయ్య కళాశాల గ్రౌండ్లో పార్కింగ్ చేయాలని నిర్వాహకులు సూచించారు. స్పెన్సర్స్ ఎదురుగా ఉన్న మొదటి గేటు వద్ద ఉచిత చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వైభవోత్సవాలకు వచ్చే భక్తులు తమ వాహనాలను బుల్లయ్య కళాశాల గ్రౌండ్లో పార్కింగ్ చేయాలని నిర్వాహకులు సూచించారు. స్పెన్సర్స్ ఎదురుగా ఉన్న మొదటి గేటు వద్ద ఉచిత చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. -
శ్రీవారి సేవ మహద్భాగ్యం
ఎంవీపీకాలనీ : శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యసేవల్లో పాల్గొనడం మహద్భాగ్యమని రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్డేడియంలో బుధవారం టీటీడీ నిర్వహించే వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు-2014, టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి సేవ టోకెన్‌ను ఆయన అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించే స్వామి నిత్య సేవల్లో విశాఖ వాసులు పాల్గొనాలని కోరారు. ఎంవీపీకాలనీలోని ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి అధ్యాత్మిక కేంద్రంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు సూచించారు. టీటీడీ జేఈవో పొలా భాస్కరరావు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 29 వరకు తొలిసారిగా విశాఖలో వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు జరుపుతున్నామన్నారు. తొలి రెండు రోజులు చాగంటి కోటేశ్వరరావుచే తిరుమల వైభవంపై ప్రవచనాలు ఉంటాయన్నారు. 23 నుంచి 29 వరకు స్వామికి నిత్య కైంకర్యాలు వ్యాఖ్యాన సహితంగా జరుగుతాయని తెలిపారు. సుమారు ఎనిమిది వేల మందికి సేవలో పాల్గొనేందుకు ఉచితంగా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సేవల టోకెన్లు ఇస్తారన్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో ముగుస్తుందన్నారు. చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ విశాఖలో టీటీడీ అధికారులు విశాఖలో వేంకటేశ్వరుని వైభవోత్సవాలు జరపడం విశాఖ ప్రజ లకు వరం అన్నారు. ఆరోగ్యం, ఆర్థిక కారణాలతో శ్రీవారిని దర్శించుకోలేని వారికి ఇక్కడే ఆ భాగ్యం దక్కుతుందని చెప్పారు. కార్యక్రమం లో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జీవి యంసీ సీఈ బి.జయరామిరెడ్డి, టీటీడీ స్పెషలాఫీసర్ రఘనాథ్, సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు.