breaking news
sugarcane crop
-
ఇక నన్నెవరూ చూడలేరు!
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుందట. అలాంటి అమాయకత్వమే ఈ ఏనుగు పిల్లది. రాత్రిపూట ఓ చేలో చొరబడిన బుజ్జి ఏనుగు చెరుకు తింటూ ఉండిపోయింది. అంతలోనే ఎవరో వస్తున్నట్టు అలికిడి వినపడటంతో దాక్కోవాలనుకుంది. అదెదో పొదల్లోనో, చెట్టుమాటునో కాదు. దానికి సమీపంలో విద్యుత్ స్తంభం కనిపించింది. వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుంది. అంతేకాదు.. ఇక తానెవరికీ కనబడనని అనుకుంది. దాక్కునేందుకు జంబో కిడ్ చేసిన విఫల ప్రయత్నం వాహనంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. వెంటనే క్లిక్ మనిపించి.. ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. జరిగిన విషయాన్నంతా జోడించారు. ఆ పిల్ల ఏనుగు అమాయక చర్య ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఫొటో చూసినవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. థాయ్‌లాండ్‌లో కనిపించిన ఈ ఏనుగు భారతీయ సంతతికి చెందింది. ఆసియా ఏనుగుల ఉపజాతి. వాటికున్న చిన్న చెవులే.. ఆఫ్రికన్ ఏనుగుల నుంచి వీటిని వేరుగా చూపిస్తాయి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో 4,422 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా. వాటిలో సగం ఐదు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాటి జనాభా పెరగడం, అటవీ ప్రాంతాలు తరుగుతుండటంతో ప్రమాదకరంగా మారింది. గత సంవత్సరం, ఏనుగులకు సంబంధించిన 4,700 ప్రమాద సంఘటనలు నమోదయ్యాయి. వాటి కారణంగా 19 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని 594, ఆస్తి నష్టం కలిగించాయని 67 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఏనుగులను చంపడం కఠినమైన నేరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రింగ్ పిట్ విధానం లో చక్కెర శాతం పెరుగుతుంది
-
చెరకు చెట్లకు నిచ్చెనలు!
అవును..!మట్టిని పూర్తిగా నమ్మిన రైతు ఎన్నడూ నష్టపోడు..!!ఈ నమ్మకాన్ని సజీవంగా నిలబెడుతున్నాడు ఓ యువ రైతు.మట్టిలోని సూక్ష్మజీవరాశి పంటలకు సంజీవనిలా పనిచేస్తూ రైతులకు సిరులు కురిపిస్తోంది. మట్టి ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేస్తే అద్భుత దిగుబడులు సాధించవచ్చని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి విశేష కృషి క్రమక్రమంగా రైతు లోకానికి చేరువ అవుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా.. కేవలం మట్టి ద్రావణం, నూనెలతోనే.. చెరకు, పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను విజయవంతంగా సాగు చేస్తున్న యువ రైతు జగదీశ్ యాదవ్ విజయగాథ ఇది. మట్టిలో పెరిగే పంటలకు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులూ అక్కరలేదని.. కేవలం మట్టి ద్రావణం చాలని యువ రైతు జగదీశ్ యాదవ్ స్వానుభవంతో చాటిచెబుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన రైతు తుమ్మల మల్లయ్య, బుచ్చమ్మ దంపతుల మూడో కుమారుడు జగదీశ్ యాదవ్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తున్నారు. 30 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ వచ్చిన జగదీశ్ ఈ ఏడాది సేంద్రియ పద్ధతుల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. 12 ఎకరాల్లో చెరకు, మిగతా 18 ఎకరాల్లో బీటీ–2 పత్తి, కంది అంతరపంటగా మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడటం లేదని జగదీశ్ చెప్పారు. పంటల ఎదుగుదల దశలో నూనెలను డ్రిప్‌తో పంటలకు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) పద్ధతిలో మట్టి ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. గత ఏడాది శనగ పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేశారు. శనగపచ్చ పురుగు ఆశించగా సీవీఆర్ పద్ధతి గురించి తెలుసుకొని ఎకరానికి 30 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే 5–7 రోజుల్లో పురుగు బెడద పోయిందన్నారు. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది పంటలన్నిటినీ సీవీఆర్ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. 15 అడుగుల ఎత్తు పెరిగిన చెరకు 12 ఎకరాల్లో సాగు చేస్తున్న చెరకు తోట అసాధారణంగా 14–15 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గడ ఒకటి 3 కిలోల బరువు ఉండటంతో.. ఎకరానికి 70–80 టన్నుల దిగుబడి వస్తుందని జగదీశ్ ఆశిస్తున్నారు. ఈ నెల 20 నుంచి చెరకు నరికి ఫ్యాక్టరీకి తోలనున్నారు. తమ ప్రాంతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడిన వారి చెరకు తోటలు తమ తోట కన్నా సగం ఎత్తు మాత్రమే ఎదిగాయని, ఎకరానికి 40 టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదన్నారు. వీరు ఎరువులకే ఎకరానికి రూ. 20 వేల వరకు ఖర్చు చేశారని, తాము 12 ఎకరాలకు 4 దఫాలలో మొత్తం కలిపి కేవలం 60 లీటర్ల నూనెలను వాడామని(ఖర్చు రూ. 5 వేలు) తెలిపారు. 80632 రకం 13 టన్నుల చెరకు విత్తనాన్ని వరుసల మధ్య 5 అడుగులు.. మొక్కల మధ్య అరడుగు దూరంలో మూడు కన్నుల ముచ్చెలను గత మార్చి 20న నాటారు. చెరకు సాగుకు ముందు 12 ఎకరాల్లో 15 రోజుల పాటు రూ. 25 వేల ఖర్చుతో గొర్రెలను మందగట్టారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు 7 సార్లు సీవీఆర్ చెప్పిన విధంగా మట్టి ద్రావణాన్ని పిచికారీ చేశారు. పైమట్టి(భూమిపైన 6 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలు, లోపలి మట్టి(భూమిలో 6 అంగుళాల లోతు నుంచి 4 అడుగుల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలను కలిపి 200 లీటర్ల డ్రమ్ముల్లో కలిపి ఎకరానికి పిచికారీ చేశామన్నారు. జేసీబీతో తన పొలంలో ఒక మూల నుంచి రెండు ట్రాక్టర్ల మట్టిని తీసి దాచిపెట్టుకొని ఉపయోగించామన్నారు. స్ప్రేయర్లకు అందనంత ఎత్తుకు పెరగటంతో జూలై నాటి నుంచి మట్టి ద్రావణం పిచికారీని కూడా నిలిపివేశానని జగదీశ్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం 15 అడుగుల ఎత్తుకు పెరగటంతో జడలు వేయడానికి కూడా నిచ్చెనలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం విశేషం. కలుపు, జడలు వేయటం, ఫ్యాక్టరీకి తోలకం తదితర ఖర్చులన్నీ పోను 12 ఎకరాలకు రూ. 22 లక్షల వరకు నికరాదాయం వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకపోవటం వల్ల ఖర్చు తగ్గించుకోవటం సాధ్యమైంది. ఆ మేరకు పర్యావరణానికి జరిగే కీడును కూడా నివారించినట్టయింది. పత్తికి గులాబీ పురుగు సోకలేదు! కొన్ని ఎకరాల్లో బీటీ–2 రకం పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను కూడా ఈ ఏడాది రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా జగదీశ్ యాదవ్ సాగు చేయటం విశేషం. గులాబీ రంగు పురుగు తమ పొలంలో కనిపించలేదన్నారు. తెల్లదోమ, పచ్చదోమల నివారణకు ప్రతి 15 రోజులకోసారి మట్టి ద్రావణాన్ని(15 కిలోల పైమట్టి + 15 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి) పిచికారీ చేశామన్నారు. దోమ ఉధృతంగా ఉందనిపిస్తే 10 రోజులకోసారి పిచికారీ చేశామన్నారు. పైమట్టి ద్రావణం వల్ల పంట ఏపుగా పెరుగుతుందని, లోపలి మట్టి ద్రావణం వల్ల చీడపీడలు దరిచేరకుండా ఉంటాయన్నారు. నూనెలను ఎకరానికి 4 లీటర్ల చొప్పున రెండు సార్లు డ్రిప్ ద్వారా అందించామన్నారు. సాధారణంగా పత్తి రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు మాత్రమే ఎకరానికి రూ. 20 వేలకు పైగా ఖర్చు చేశారని, తాము ఎకరానికి మహా అయితే రూ. వెయ్యి మాత్రమే ఖర్చు చేశామన్నారు. మట్టి ద్రావణాన్ని తామే పిచికారీ చేసుకుంటామన్నారు. భారీ వర్షాల దెబ్బకు దిగుబడి తగ్గిందని అంటూ.. ఎకరానికి సగటున 9–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ఎన్ని రసాయనిక ఎరువులు వేసినా ఇంత దిగుబడి రాదు! చింతల వెంకటరెడ్డి చెప్పినట్లు మట్టి ద్రావణంతోపాటు.. నూనెలను వాడటం వల్లనే ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధించగలిగాను. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండానే చెరకు తోట అద్భుతమైన దిగుబడి ఇచ్చింది. పత్తిలో ఎకరానికి రూ. 20 వేల వరకు రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు తగ్గింది. రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులతో సమానంగా 8–11 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ రకంగా చూసినా మట్టి ద్రావణం చక్కని ఫలితాలనిస్తున్నదని రెండేళ్లుగా వివిధ పంటలు సాగు చేసిన అనుభవంతో గ్రహించాను. ఇతర రైతులకూ ఇదే చెబుతున్నాను. – తుమ్మల జగదీశ్ యాదవ్ (80088 61961), పట్లూర్, మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా (సీవీఆర్ మట్టి ద్రావణం గురించి పూర్తి వివరాలకు‘సాక్షి సాగుబడి’ ఫేస్బుక్ గ్రూప్ చూడండి.) – కె.సుధాకర్ రెడ్డి, సాక్షి, మర్పల్లి, వికారాబాద్ జిల్లా మట్టి ద్రావణం తయారీ -
‘మధుకాన్’ ముట్టడి ఉద్రిక్తం
రాజేశ్వరపురం (నేలకొండపల్లి): మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రైతుల ఆందోళనకు యూజమాన్యం తలొగ్గింది. చర్చలకు ఆహ్వానించింది. మద్దతు ధరగా 3000 రూపాయలు ఇవ్వాలన్న డిమాండుపై నిర్ణయం తీసుకునేందుకు 20 రోజుల గడువు కావాలని యూజమాన్యం కోరింది. దీనికి రైతు సంఘాల నాయకులు అంగీకరించారు. చెరకు టన్నుకు 3000 రూపాయలు చెల్లించాలన్న డిమాండుతో ఐదు రోజులుగా చెరకు రైతులు ఆందోళన సాగిస్తున్నారు. రైతు సంఘాల అఖిలప క్షం పిలుపుతో వారు ఆదివారం రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్ ఫ్యాక్టరీని ముట్టడించారు. ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రైతులతో చర్చించేందు కు యాజమాన్యం ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో, ఖమ్మం డీఎస్పీ దక్షిణమూర్తి చొరవ తీసుకున్నారు. ఆయన ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాసరావుతో మాట్లాడి, రైతులతో చర్చలకు అంగీకరింపచేశారు. రైతు ప్రతినిధులు రచ్చా నరసింహారావు, మానుకొండ శ్రీనివాసరావు, నర్రా పూర్ణచందర్రావు, తోటకూరి రాజు, సురేందర్‌రెడ్డి, చావా లెనిన్తో కూడిన 11 మంది ప్రతినిధుల బృందంతో జీఎం తన చాంబర్లో చర్చలు జరిపారు. ఇవి ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆగ్రహోదగ్రులయ్యూరు. వారు పోలీసు వలయూన్ని నెట్టుకుంటూ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. అక్కడ వీరిని కూసుమంచి, ఖమ్మం రూరల్, ఖమ్మం మహిళ పోలీస్‌స్టేషన్ సీఐలు రవీందర్‌రెడ్డి, తిరపతిరెడ్డి, అంజలి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. తమ డిమాండుపై యాజమాన్యం ప్రకటన చేయూలని ఆందోళనకారులు నినదించారు. ఫ్యాక్టరీ జీఎం శ్రీనివాసరావు వద్దకు కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి వెళ్లి మాట్లాడారు. ఆ తరువాత ఆయన ఆందోళనకారుల వద్దకు వచ్చి.. ‘‘మీ డిమాండుపై చర్చించేందుకు 20 రోజుల్లోగా ప్రత్యేక సమావేశాన్ని యూజమాన్యం నిర్వహిస్తుందని జీఎం చెప్పారు’’ అని తెలిపారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. మాట తప్పితే ప్రత్యక్ష ఆందోళన మధుకాన్ మాజమాన్యం మాట తప్పితే ప్రత్యక్ష ఆం దోళన మళ్లీ మొదలవుతుందని టీఆర్ఎస్ రైతు వి భాగం రాష్ట్ర నాయకుడు నల్లమల వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆందోళన విరమణ అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మధుకాన్ యూజమాన్యం మొండి వైఖరి విడనాడి, రైతులకు గిట్టుబాటు ధర నిర్ణరుుంచాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో చెరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రాంబాబు, నాయకుడు నున్నా నా గేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, నాయకుడు బత్తుల లెనిన్, వైఎస్ఆర్ సీపీ నాయకులు నంబూరి ప్రసాద్, మానుకొండ శ్రీనివాసరావు, బొల్లినేని వెంకటేశ్వరరావు, న్యూడెమెక్రసీ నాయకుడు టి.హనుమంతరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొరివి వెంకటరత్నం, నాయకుడు జొగుపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చెరుకు తోటలో అగ్ని ప్రమాదం
అశ్వారావుపేట రూరల్, న్యూస్‌లైన్: చెరుకు పంట తొలగించిన ఓ తోటలో శనివారం మంటలు వ్యాపించాయి. వీటిని ఆర్పేందుకు వెళ్లిన ఫైరింజన్‌కు మంటలు అంటుకున్నాయి. త్రుటిలో ముప్పు తప్పింది. అశ్వారావుపేట మండలంలోని గంగారం గ్రామానికి సమీపంలో వేముల ప్రకాష్ అనే రైతుకు చెందిన చెరుకు తోటలో ఇటీవల పంటను తొలగించారు. ఈ తోటలో శనివారం సాయంత్రం మంటలు వ్యాపించాయన్న సమాచారంతో అశ్వారావుపేట నుంచి ఫైరింజన్ వెళ్లి మంటలను అదుపు చేస్తోంది. ఇంతలో ఆ మంటలు ఫైరింజన్‌కు అంటుకున్నాయి. ఫైరింజన్ టైర్లతోపాటు ఇంజన్ ప్రదేశంలో మంటలు అంటుకున్నాయి. వాటిని సిబ్బంది అదపులోకి తెచ్చారు. డీజల్ ట్యాంక్ వద్ద కూడా మంటలు చెలరెగడంతో సిబ్బంది ఆందోళన చెందారు. మంటలు అదపులోకి రావడంతో పెను ముప్పు తప్పింది.