-
లింగా క్లైమాక్స్ అది కాదు
లింగా చిత్ర క్లైమాక్స్ అదికాదు అని మనసు విప్పారు ఈ చిత్ర దర్శకుడు కేఎస్.రవికుమార్. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ముడింజా ఇవనై పిడి. నాన్ఈ చిత్రం ఫేమ్ కిచ్చా సుధీప్ కథానాయకుడిగా తమిళంలో పరిచయం అవుతున్న చిత్రం ఇది.ఆయనకు జంటగానిత్యామీనన్ నటించిన ఈ చిత్రం తమిళం,కన్నడం భాషల్లో తెరకెక్కనుంది. శుక్రవారం రెండు భాషల్లోనూ విడుదల కానుంది.దర్శకుడు కేఎస్.రవికుమార్ బుధవారం ఉదయం తను కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఈ చిత్రం ద్వారా తొలిసారిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నానన్నారు. తానీ చిత్రాన్ని అంగీకరించడానికి కారణం నటుడు కిచ్చా సుధీప్నే నన్నారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన మాస్ ఎంటర్టెయినర్ అని తెలిపారు. తన చిత్రాల్లో కమర్శియల్ అంశాలతో పాటు క్లాసిక్ మిక్స్ అయినా తాను దర్శకుడినేన్నారు. తన తొలి చిత్రం పురియాద పుదిర్ చిత్రమని అది ఒక కన్నడ చిత్రానికి రీమేక్ అనీ, నిర్మాత ఆర్వీ.చౌదరి తనను ఒరిజినల్ చిత్రం చూసి తమిళంకు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే రాయమని చెప్పారన్నారు. ఇకపోతే చిత్ర జయాపజయాలు ఎవరి చేతులోనూ ఉండవన్నారు. అదే విధంగా వరుసగా విజయాలు సాధించిన వారు లేరని అన్నారు. లింగా చిత్ర ప్రస్థావన తీసుకొస్తున్నారు కాబట్టి చెబుతున్నానని, ఆ చిత్రానికి తాము ముందుగా ప్లాన్ చేసింది వేరని అన్నారు. క్లైమాక్స్ ఫైట్‌లో గ్లైడర్‌ను ఉపయోగించి భారీగా చిత్రీకరించాలను కున్నామని, అయితే అందుకు సీజీ వర్క్ చాలా ఆలస్యం అవుతుందని చెప్పడంతో రజనీకాంత్ బైక్ నుంచి జంప్ చేసి గాలిలో తేలుతున్న బెలూన్ మీదకు దూకి అందులోని విలన్‌తో ఫైట్ చేయడంతో కామెడీ అనిపించిందని అన్నారు. సినిమా గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, విమర్శలు రాసే వారు కూడా ఇది తన అభిప్రాయం అని పేర్కొంటే బాగుంటుందని అన్నారు. కిచ్చా సుధీప్ మంచి నటుడే కాదని మంచి మానవతావాదిగా ఉన్నారని దర్శకుడు కేఎస్.రవికుమార్ పేర్కొన్నారు. తెలుగులో మళ్లీ దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు మంచి కథ, టీమ్ కుదిరితే తప్పకుండా చేస్తానని తెలిపారు. చిరంజీవి హీరోగా స్నేహం కోసం చిత్రం చేసిన తరువాత ఆయన చాలా సార్లు మనం మళ్లీ కలిసి పని చేద్దాం అని అంటుంటారని అన్నారు. -
హాలీవుడ్‌కు దీటుగా బాహుబలి
బాహుబలి సినిమా ప్రపంచం అంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ఇది. దీనికి సృష్టికర్త రాజమౌళి. టాలీవుడ్లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వాడుకుంటూ తన చిత్రాలతో వండర్స్ సృష్టిస్తున్న మేటి దర్శకుడీయన. విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఈగ వంటి సూపర్ సక్సెస్ చిత్రాల తరువాత రాజమౌళి తాజా చిత్రం బాహుబలి. ఇప్పటి వరకు టాలీవుడ్ వరకు పరిమితం అయిన తన ప్రతిభాపాటవాలను రాజమౌళి ఈ చిత్రంతో కోలీవుడ్, బాలీవుడ్‌లకు చాటనున్నారు. బాహుబలి చిత్రాన్ని ఆయన ఈ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాణా, అనుష్క, తమన్న, సుధీప్, సత్యరాజ్, నాజర్ వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారు. శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్ హక్కులను స్టూడియో గ్రీన్ కె ఇ జ్ఞానవేల్ రాజా పొందారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు మదన్‌కార్గి మాటలు రాయడం విశేషం. అలాగే చిత్రాన్ని తమిళనాడులో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ఈ సందర్భంగా చిత్ర హీరో ప్రభాస్ మాట్లాడుతూ ఒకసారి రాజమౌళి కలిసి చిత్రం చేద్దాం అనగానే కథ ఏమిటని కూడా అడగకుండా ఒకే చేద్దాం అన్నానన్నారు. ఎందుకంటే ఆ విషయాలన్నీ ఆయనే చూసుకుంటారన్న నమ్మకంతోనే అన్నారు. బాహుబలి కోసం 300 రోజులు శ్రమించారన్నారు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధా ల్లో శిక్షణ తీసుకున్నానని తెలి పారు. ఇలాంటి చిత్రం భవిష్యత్తులో మళ్లీ చేయడం సాధ్యం కాకపోవచ్చునని ప్రభాస్ పేర్కొన్నారు. ఇండియన్ సినిమా గర్వపడేలా బాహుబలిని ఇండియన్ సినిమాగర్వ పడేలా దర్శకుడు రాజమౌళి సిల్వర్ స్కీన్‌పై ఆవిష్కరించారని నటుడు సూర్య పేర్కొన్నారు. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బాహుబలి చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఆశ్యర్యంతో ముంచెత్తుతుందన్నారు. బాహుబలిలో చిన్న వేషం అయినా వేయాలని ఆశించానని ఆ అవకాశం లభించకపోయినా ఈ చిత్ర ప్రచారంలో తాను ఒక భాగం అవ్వడం సంతోషంగా ఉందన్నారు. బాహుబలి చిత్ర షూటింగ్ స్పాట్‌కు ఒక్కసారి వెళ్లానని అప్పుడా చిత్రానికి మూడువేలమంది ఏకధాటిగా పని చేయడం చూసి ఆశ్చర్యపోయానని సూర్య అన్నారు. ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల తరహాలో చిత్రాలు చేయాలని అనుకుంటున్నామన్నారు. బాహుబలి చూసిన తరువాత హాలీవుడ్ పరిశ్రమ ఇలాంటి చిత్రం చేయాలని ఆశపడుతుందని సూర్య అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్‌ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్‌కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
Advertisement