-
బుల్లెట్ ఎక్కాలే తల్వార్ తిప్పాలే
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక మహిళ గాల్లో తల్వార్ ఊపుతూ బుల్లెట్‌పై వీరవిహారం చేసింది. మరో మహిళ టాప్‌లెస్ జీప్‌ను ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేతితో తల్వార్‌ను గాలిలో ఝుళిపించింది. ఒక మహిళ స్కూటీ డ్రైవ్ చేస్తుంటే మరొక మహిళ వెనుక సీటులో నిల్చొని గాల్లో తల్వార్‌తో విన్యాసాలు చేసింది. ఆ రాత్రి దుర్గామాత మండపం సమీపంలో మహిళలు చేసిన రకరకాల స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ‘ఆహా ఓహో’ అని అబ్బురపడితే మరికొందరు ‘ఇలాంటి సాహసాలు తగవు’ అని ఖండించారు. -
రెచ్చిపోయిన కాలేజీ విద్యార్థులు.. టయోటా కార్లతో స్టంట్స్ చేస్తూ..
కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై రెచ్చిపోయారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఢిల్లీ సరిహద్దులోని గ్రేటర్ నోయిడాలో ఉన్న అమిటీ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు తమ ఖరీదైన కార్లతో హల్చల్ చేశాడు. నడిరోడ్డుపై కార్లతో స్టంట్లు చేశారు. కొందరు విద్యార్థులు నోయిడాలోని సెక్టార్ 126లో రెండు తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్ కార్లతో ఖాళీ రోడ్లపై విన్యాసాలు చేశారు. పంజాబీ ర్యాప్ పాటను హోరెత్తిస్తూ ప్రమాదకరంగా 360 డిగ్రీల స్టంట్లు చేశారు. ఒక పార్కింగ్ స్థలంలో కూడా ఒక కారుతో స్టంట్స్ చేస్తూ అక్కడున్న వారిని భయాందోళనలకు గురిచేశారు. ఇక, విద్యార్థుల కారు స్టంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారి పోలీసులకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. అయతే, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఆ విద్యార్థులు ఖరీదైన కార్లతో ఈ విన్యాసాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, విద్యార్థుల ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NOIDA एमिटी यूनिवर्सिटी में रहीशजादों की स्टंटबाजी, फॉर्च्यून से ड्रिफ्ट मरते वीडियो वायरल PS 126@noidapolice@noidatraffic @Uppolice pic.twitter.com/4W9hVh8zBm — हिमांशु शुक्ला (@himanshu_kanpur) December 23, 2022 -
మెర్సీ మామి.. యమా క్రేజీ..
సాధారణంగా 60 ఏళ్ల తర్వాత వయసురీత్యా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ 82 ఏళ్ల ఈ బామ్మగారు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించడమే కాదు తాను ప్రయాణిస్తున్న రైల్లోని ప్రయాణికులను సైతం ఆనందంగా ఉంచారు. ఆ బామ్మ పేరేంటో తెలియదు కానీ ఆమె చేసిన విన్యాసాలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎంతోమంది యువకులు, మధ్య వయస్కులు ఉన్నా.. వారి ముందు ఫీట్లు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఈ ఫ్రాన్స్ బామ్మ రైల్లో హుషారుగా సినిమా తరహాలో కొన్ని ఫీట్లు చేశారు. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లు చేసే ఓ స్టంట్ చేసి ఔరా అనిపించారు. ఆమె ఎదురుగా కొంతమంది చేతులు పైకెత్తి నిలుచుండగా, బామ్మగారు వారి చేతులపైకి జంప్ చేసి చేతులపై నుంచి పాకుతూ అలాగే ముందుకెళ్లి కిందకి దిగారు. ఆ తర్వాత తలపై భారం మోపుతూ మరో ఫీట్ చేశారు. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇతరత్రా సమస్యలు తనకేం లేవని చెప్పిన బామ్మ.. నేలపై తల వంచి శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ కాసేపు కాళ్లను నిటారుగా ఉంచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఫీట్లు చేస్తున్నంతసేపూ అక్కడున్న వారు బామ్మను ‘మెర్సీ మామి’ అంటూ ఉత్సాహపరిచారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement